డైలీ సీరియల్

అనంతం-6

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తండ్రికి అన్యాయం జరిగిందన్నకోపంలో వళ్లుమరచి, ఆవేశంలో ఏదో ఆలోచించాడు కానీ, కొండదేవర-దేవరకు మహత్మ్యం లేకపోతే విశ్వసృష్టి ఎలా జరిగేది?’’ ఎలా మనుగడ సాగించేది?
దేవుడ్ని శంకించినందుకు తనను తానే నిందించుకున్నాడు. అంతలోనే భయం వేసింది. తలెత్తి, నల్లకొండ వైపు చూశాడు నాయక్!
కోపంగా వున్న కొండదేవర ఊహలో కనిపించాడు!
సందేహం లేదు!
తననలా, తప్పని వారించింది కొండదేవరే!
దొంగ కల్లు తాగి పరుల సొమ్ము ఆశించటం తప్పని దేవర కాకుండా ఎవరు చెప్తారు? కల్లుగీసేవాడి కాయకష్టం దొంగలించి కడుపు నింపుకోవడం తప్పని దేవర కాకుండా ఇంకెవ్వరు చెప్తారు?
డబ్బే లోకం అనుకొనే దగుల్బాజి నాయాళ్లు మనుషుల శ్రమ శక్తిని కొల్లగొట్టి నల్ల డబ్బుతో బొక్కసాలు నింపుకోవటం తప్పని దేవర కాకుండా ఎవరు చెప్తారు?
అయ్యకూడా అలాగే చెప్పేవాడు. అవ్వే మాటలు నిత్యం వల్లించేవాడు. తప్పును క్షమించేవాడు కాదు. అక్రమాలను సహించేవాడు కాడు.
మరి-
కొండదేవర దేవుడు, అయ్య పితూరీదారుడూ ఎందుకైనట్టు?
కాల్చి చంపుతారని కొండదేవర గుట్టల్లో దాక్కున్నాడా?
అలా దాక్కుంటే అయ్య కూడా బతికేవాడు కదా?
సమాధానం కొండదేవరే చెప్పాలి. అడవి పుత్రులకు జీవితం నేర్పిన అడవి తల్లిచెప్పాలి. అడవి రహస్యాలను చాటుమాటుగా చూసే సూర్యచంద్రులు చెప్పాలి. మనుషుల్ని చూసి గర్జించే తుపాకులు చెప్పాలి. తుపాకుల మీద అధికారంవున్న పాలకులు చెప్పాలి. పాలకులమీద అధికారం చెలాయించే దళారీలు చెప్పాలి!
బాణావతు దీర్ఘంగా నిట్టూర్చాడు.
కల్లు కుండల వైపు నిర్లక్ష్యంగా చూసి అక్కడ్నించి బయల్దేరాడు.
***
మరి బువ్వ కావాలని ‘వాల్యా’ ఒకటే గోల!
ప్రొద్దుటినుంచి అదే తంతు.
ఏడ్చినవాడు ఏడ్చినట్టే ఉన్నాడు. ఎంత చెప్పినా వినకుండా వరి బువ్వ పెడితేనే తంటానని మంకు పట్టుపట్టాడు.
ఏం చెయ్యాలి?
కొడుకునెలా సముదాయించాలో లక్ష్మీబాయికి తోచలేదు. కోపంతో అసహనానికి లోనౌతున్నది.
ఓట్లకోసం వచ్చిన పట్నం నాగరికులు ఓట్లడిగి వెళ్లకుండా గూడెం వాళ్లకు వరి బువ్వ పెట్టారు. రుచిమరిగిన వాల్యాగాడు మళ్లీ అదే కావాలంటున్నాడు.
వరిబువ్వ అంటే మాటలా!
ఒక్క పూట ఎలక్షన్ బులపాటం కోసం వాళ్ళు వరి బువ్వ వండి పెట్టి ఓట్లు దండుకున్నారు గానీ, రోజూ అదే బువ్వ కావాలంటే ఎలా?
లక్ష్మీబాయికి ఏమీ తోచలేదు. వాల్యా ఏడుస్తూనే ఉన్నాడు. రాగి సంకటి వద్దని, వరీ బువ్వ కావాలనీ మారాం చేస్తూనే ఉన్నాడు.
లక్ష్మీబాయి గుడిసెలో నుంచి బైటికి వెళ్లింది. గౌరారం నుంచి వచ్చే కాలిబాట వైపు చూసింది. భర్త పస్తున్న జాడలేదు.
బాణావతు అజాపజా లేడు.
వాల్యా రాగం పెంచాడు. మళ్లీ గుడిసెలోకి వెళ్లింది. కొడుకుని వళ్లోకి చేర్చుకొని, వాడి కన్నీళ్లు తుడుస్తూ-
వాల్యారాగం పెంచాడు. మళ్లీ గుడిసెలోకి వెళ్లింది. కొడుకుని వొళ్లోకి చేర్చుకొని వాడి కన్నీళ్ళు తుడుస్తూ-
‘‘వరి బువ్వ గావాల్నని ఏడిత్తే నేనేం సెయ్యన్రా కొడకా! అది గొప్పోళ్ళ బువ్వ. దేవుడిచ్చిన బువ్వ. గొప్పోళ్ళకి వరి బువ్విచ్చిన ఆ దేవుడు మనకి రాగి సంకటిచ్చిండు.
‘అదేంటిది?’ అనగాకు.
‘సృట్టి’ యిధాయకవే అసువంటిది!
ధానె్నవ్ గింజలమీద మడుసుల పేర్లు రాత్తాడంటా దేవుడు! ఎవుడే బువ్వదినాల్నో, ఎవుడేడ పండాల్నో, ఎవుడే శబ్బర పని జెయ్యాల్నో, ఎవుడే మంచి పని జెయ్యాల్నో, ఎవుడెవుడ్ని నల్సకతిని మంది సొమ్ము దోసాల్నో..
అంతా నిర్నాయకవ్ జేసేదాదేవుడే!
మన పేర్లాదేవుడు బియ్యపు గింజలమీద రాయలేదు. రాగుల మీన, సద్దలమీనా రాసిండు. సంకటితో కొరికి తినే మీరపకాయల మీనా ఎలిగెడ్డల మీదా రాసిండు.
పండుకోతని రుూతాకుల సాపలమీద, సట్టుబండలమీనా రాసిండు.
సేసేదేవుందిరా.. కొడకా..
నిత్తెవ్ ఎలచ్ఛన్లు బెట్టిసావరా గత్తర్నాయాళ్లు. సంకురేత్తిరికీ శివరేత్తిరికీ బెట్టి ఓట్లు దొబ్బి ఎలిపోతారుగానీ, నిత్తె వరిబువ్వ బెట్టాల్నంటే ఆ నాయాళ్లకి మాత్తరవ్ ఎట్టా కుదురుద్దిరా..అయ్యా!
లెగు.. లెగు.. సచ్చి నీ కడుపున బుడతానింక లెగు!
ఎలిగెడ్డ నంచుకుంటూ మిరపకాయ కొరుక్కుంటా, శారడెంత సంకటి దిన్నావంటే నీ కడుపుగాదు, నా కడుపు నిండుద్ది. లెగు.. లెగు’’ అంటూ లక్ష్మీబాయి ఒడిలోనుంచి కొడుకును ప్రక్కన పెట్టి గబగబా పొయ్యి దగ్గరకి వెళ్లింది.
సంకటి కుండ తెచ్చి వాల్యా ముందు పెట్టి సత్తుకంచం కోసం వెళ్లింది.
అమ్మ అలా అక్కడ్నించి వెళ్లిందో లేదో వాల్యాగాడు సంకటి కుండని బలంగా కాలుతో తన్నాడు.
అది గాల్లోకి ఎగరి దబ్బున క్రిందపడి భళ్ళున పగిలింది.
నేలపాలైన సంకటిమీద దళారీల్లా ఈగలు ముసిరి పీల్చుకొని కడుపులు నింపుకొంటూంటే లక్ష్మీబాయి కడుపు మండింది!
ఎంత పనిచేశళాడు వాల్యా!
జీవన పోరాటంలో నిత్యం పరిస్థితులతో సంఘర్షిస్తూ, ప్రమాదాలను తప్పించుకొంటూ, క్షణక్షణం మృత్యువుతో సయ్యాటలాడుతూ, క్రూర జంతువులతో విషసర్పాలతో ఫారెస్టు అధికారులతో సహజీవనం సాగిస్తూ-
అడవి సంపద తెచ్చి సంతలో తెగనమ్మి కష్టనష్టాలను ఓరుస్తున్నదా సంకటి కోసమే!
నిజారణ్య సంపదను జనారణ్యంలో అమ్మేందుకు కూడా ఎనె్నన్ని అడ్డంకులో!
ఫారెస్టు అధికారుల దాష్టీకం భరించాలి. అడుగులకు మడుగులొత్తుతూ అవసరాలు తీరుస్తూ ప్రసన్నం చేసికొంటేనే వాళ్లు అడవి సంపదను సేకరించేందుకు అనుమతించేది.
అలిగారంటే అవరోధాలు సృష్టిస్తారు. అడవిలోకి వెళ్లనివ్వరు. తుపాకులు చూపిస్తారు. లాఠీలతో బెదిరిస్తారు.
భయపడితే సరే!
‘మేమూ మనుషులమే’ అంటేనే పేచీ!!
అంతా చేసి అడవి సంపద సేకరిస్తే నాగరికులకు అమ్మటంలో కూడా అడవి పుత్రులు నయవంచనకు గురి కావాల్సిందే!
(ఇంకా ఉంది)

-గోపరాజు నాగేశ్వరరావు