డైలీ సీరియల్

అనంతం-8

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘వాల్యాగాడ్ని తెత్తానుండు’’ అని బైటికి దారితీసాడు బాణావతు.
* * *
ఎన్నో తరాలుగా నిర్మలంగా పవిత్రంగా గంగా జలంలా వున్న అడవి పుత్రుల్లో ఇప్పుడు చాలామంది సంతబేరం కోసం గౌరారం వెళ్లటం, నాగరికులతో కలవటం పరిచయాలు పెంచుకోవటంవల్ల సహజత్వం కోల్పోయి అపవిత్రమై పోతున్నారన్నదే తండా పెద్దల బాధ!
ప్రాచీన ఆచారాలు అలవాట్లు కట్టుబాట్లు ఆమోదయోగ్యమైన జీవన విధానం ఒదులుకోలేక, కొత్త తరం భావజాలాన్ని భరించలేక- పాత కొత్తల మధ్యని లింకుల్లా మిగిలిపోయిన వృద్ధతరం విషయం అలా వుంచి, యువతరం బాగా చెడిపోయిందన్నదే వాళ్ల ఆవేదన!
పట్నపు వాసనలు మరిగారు. ఉచ్ఛ నీచాల పట్టింపులను విస్మరించి సుఖమయ జీవితం కోసం అక్రమదారులు తొక్కుతున్నారు.
బలాదూరుగా తిరగటం- రూపాయి పని చెయ్యకుండా, ఉద్యోగాలు వెలగబెట్టకుండా పెద్దలు కూడబెట్టిన అక్రమార్జనలో నుంచి వందలూ వేలూ బార్లలో వెదజల్లుతూ, వారకాంతల మురిపాలు తీరుస్తూ, విలాసవంతంగా జీవించడం నాగరకులకే చెల్లుతుందిగానీ, కాయకష్టం చెయ్యందే రాగి సంకటి దొరకని అడవిబిడ్డలకెట్టా చెల్లుతుంది?
అవకాశం చిక్కితే చాలు పట్నం చేర్తున్నారు. నాగరకుల పిల్లల్తో కలిసి జల్సాలు చేస్తున్నారు. సంత బేరంలో వచ్చే డబ్బంతా మందుకీ పొందుకీ తగలేసి చెవులు ఝాడించుకొంటూ తిరిగి తండాకి చేర్తున్నారు.
అడవి సంపదని హారతి కర్పూరంలా తగలేస్తూ, చెడు తిరుగుళ్ళలో వళ్ళూ ఇళ్ళూ గుల్ల చేసికొంటూ, ఆచరణ యోగ్యమైన తండా కట్టుబాట్లను కూడా ధిక్కరిస్తున్నారు.
తప్పనిసరై అప్పుచేసినా పచ్చని చెట్టు సాక్షిగా వాగ్దానం చెయ్యటం తప్ప రాతపోత లెరుగని అడవి పుత్రులిప్పుడు ప్రామిసరీ నోట్లు రాసి నాగరికుల దగ్గర అప్పులు తెస్తున్నారు.
అంతలో ఎంత మార్పూ...!
తండా పెద్దలు చాలాసార్లు హితవు చెప్పారు -
‘‘వల్లగానంతగా ప్రేనఁవ్ బీకితే సెట్టుతల్లి కల్లు దాగండి గానీ సారా బ్రాందీలు వొద్దు. అయ్యన్నీ లాభం కోసరఁవ్ పట్నవోళ్ళు తయారు జేసే యిసాలు!
అయినా పట్నపోళ్ళతో మీకేంటికిరా సగవాసఁవ్?
మనఁవ్ నిదరలెగిత్తే అడవికి బోవాల. సెట్టూ పుట్టా ఎక్కాల. కాయకట్టఁవ్ జెయ్యాల. కాయాగసురు దేవాల కట్టంమీనే బతకాల... సెడు సగవాసాలింక సాలిచ్చండిరా - అయ్యలూ’’ అని బ్రతిమాలారుకూడా.
అవ్వేమీ చాలామంది చెవికెక్కలేదు.
వాళ్ళ కర్మానికి వాళ్ళను విడిచిపెట్టడం తప్ప చేసేదేమీ లేదు అన్న నిర్ణయానికొచ్చారు వాళ్ళు!
క్రమంగా వస్తున్న మార్పులను గురించి ఆలోచిస్తూ, దారిలో ఎదురైన వాళ్ళను ఆప్యాయంగా పలుకరిస్తూ వాల్యాకోసం నగ్గూరాం నాయక్ ఇంటికి వెళ్ళాడు బాణావతు.
చాంధ్‌నీ వాల్యాలో కలసి ఎక్కడ ఆటపాటల్లో ములిగి వుందోగానీ, అక్కడ ఎవ్వరూ కలినిపంచలేదు.
‘‘చాందినీ...! అరే... వాల్యా...’ అని, గొంతెత్తి ఒకటికి రెండుసార్లు పిల్చాడు. సమాధానం లేదు.
అప్పుడు తలెత్తి దూరంగా చూశాడు!
నగూరాం ఇంటికి కొంచెం దూరంగా ‘మాలచ్చిఁవిసెట్టు’ అనబడే వేపచెట్టుకింద అడవి పుత్రులు చాలా మంది కనిపించారు. వాళ్ళల్లో నగ్గూరాం కూడా ఉన్నాడు.
కొంచెం తలెత్తి దూరంగా చూశాడు!
నగూరాం ఇంటికి కొంచెం దూరంగా ‘మాలచ్చిఁవి సెట్టు’ అనబడే వేపచెట్టు కింద అడవి పుత్రులు చాలామంది కనిపించారు. వాళ్ళల్లో నగ్గూరాం కూడా ఉన్నాడు.
కొంచెం దగ్గరికి వెళ్ళి చూశాడు!
వాళ్ళంతా ఎందుకో ఆందోళనగా ఉన్నట్టుంది. ఏదో కొంపలు ములిగినట్టు, తేల్చే అవకాశం లేనట్టూ - పాలిపోయిన మొహాలతో వౌన గంభీరంగా కనిపించారు.
ఏం జరిగింది?
వాళ్ళెందుకిలా ఉన్నారు?
ఏదో పెద్ద ఉపద్రవం సంభవించిక పోతే వాళ్ళంతగా ఆందోళనకు గురికారు. భేల మొహాలు వేసి వౌనంగా కూర్చోరు.
‘జననం మరణం ఒక్కటే’ అన్నంత నిర్భయంగా నిర్వికారంగా నిర్వేదంగా ఉండే అడవి పుత్రులారా ఎందుకు ఉన్నట్టు?
‘పెద్ద ఆపదే వచ్చుండాలి’ అనుకొన్నాడు బాణావతు... అదేమిటో అతని ఊహక్కూడా తట్టటం లేదు.
అడవిలో క్రూర మృగాలు వెంట పడినపుడూ, అడవి సిబ్బంది అధికారం ప్రదర్శిస్తూ మామూళ్ళ కోసం చావబాది నప్పుడూ, విష జ్వరాలతో జనం పిట్టల్లా రాలిపోతోన్నప్పుడూ, మందు గోలీలిచ్చే నాగరిక డాక్టర్లు అడవికి రానప్పుడూ - వాళ్ళలా అదే చెట్టు క్రింద గుమికూడి చర్చించుకుంటారు. ఒకళ్ళ నొకళ్ళు ఓదార్చుకుంటారు.
అడవి పుత్రులలా గుమికూడి కూర్చున్నారంటే ఏమిటి అర్థం?
అప్పుడు బాణావతును చూశాడు నగ్గూరాం. కేకవేసి పిల్చాడు.
‘‘ఏంటదంట?’’ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాడు బాణావతు
‘‘కూసో’’ అన్నాడు నిగ్గూరాం.
‘‘తొందరగా బోనాల’’
‘‘ఏంటి కంత తొందర’’
‘‘వాల్యాగాడు బువ్వదినే్లదు. అలిగిండంట...’’
‘‘మేఁవూదినే్లదు’’ అన్నాడు నగ్గూరాం.
‘‘ఈ వర్దాకా బువ్వ దినే్లదా?’’
‘‘తినబుద్దిగాలేదు’’
బాణావతు ఆశ్చర్యంగా చూశాడు.
‘‘అడివి ఎవుర్ది?’’ నగ్గూరామే అడిగాడు.
‘‘మనదే’’
‘‘తండా ఎవుర్ది?’’
‘‘మనదే’’
‘‘ఖాళీ జెయ్యాల్నంట... ఈడ్నించి ఎలిపోవాల్నంట’’
‘‘ఎవురన్నారూ?’’
‘‘సంతలో పోలీసాయన’’
‘‘సెతురుకేఁవో...’’
‘‘సేతురుగ్గాదు...’’
‘‘నమ్మినావా?’’
‘‘నాకాడ నూకిన సింతపొండు మన ఒట్టేసిండు.’’
‘‘ఏంటికి ఖాళీ సెయ్యాల్నో అడిగినావా?’’
‘‘అడిగినా’’
‘‘ఏం జెప్పిండు?’’
‘‘నల్లకొండ సుట్టుపక్కల వందల యేల ఎకరాల్లో అదేంటిదో ఖనిజఁవ్ వుందంట. ‘గొప్ప’ దేశాల వాళ్ళకది గావాల్నంట. అమ్రికా వోడు ఢిల్లీవోడ్ని, మన ఢిల్లీవోడు రాట్రం వోడ్నీ ఒప్పిచ్చి అడివి సుట్టూ కంచెగట్టి ఖనిజాన్ని తొవ్వుతారంట. దానికోసరఁవ్ మనఁవంతా అడివి ఖాళీ సెయ్యాల్నంట’’ అని చెప్పాడు నగ్గూరాం.
(ఇంకా ఉంది)

-గోపరాజు నాగేశ్వరరావు