డైలీ సీరియల్

అనంతం-9

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఏం ఖనిజఁ వుందంట?’’ బాణావతు అడిగాడు.
‘‘బాక్‌సయిటు అంటారంట దాన్ని’’
‘‘అదిగూడా కానిస్టేబులే జెప్పిండా?’’
‘‘సెప్పిండు.’’
‘‘ఇంకా ఏటన్నాడేఁవిటి?’’
‘‘ఒక్క ఖనిజఁవేగాదు, రుూ సుట్టుపక్కల అడివిలో కలివికోళ్ళు ఉండయ్యంట. అయ్యి గొప్ప జాతకోళ్ళంట. సత్తే యింక దొరకవంట... అంశాత, కోళ్ళకోసరఁవ్ గూడా కొంత అడివిని కేటాయిచ్చి రచ్చణ గల్పిత్తారంట...’’
‘‘కోళ్ళ కోసరఁవ్, ఖనిజఁవ్ కోసరం మనల్ని యళ్ళ నూకుతారంటనా?’’
‘‘అంతే... అంతే’’
‘‘యాడికి బోవాల్నంట మనఁవ్?’’
‘‘అడిగినా...’’
‘‘కానిస్టేబులేఁవి జెప్పిండు.’’
‘‘సంతగౌరారఁవ్ కాడ మనకి ఇళ్ళు కట్టిత్తారంట... ఎంట్రీ బల్పులెట్టి, సర్కారోళ్ళే గబ్బుదొడ్లుగూడా కట్టిత్తారంట.’’
‘‘మనవేఁవి జెయ్యాల్నంట.’’
‘‘అడివికి బొయ్యే పనే్లదంట’’
‘‘బతికే దెట్టాగంట’’
‘‘అడిగా... అడిగా’’
‘‘కానిస్టేబులేఁవన్నాడేటి?’’
‘‘సింతపొండుకీ, సిదుగులకీ సర్కారు రగస్సెఁవ్ జెప్పేదిగాదన్నడు.’’
‘‘సెప్పలేదా’’
‘‘నానూకుంటానా! కానిస్టేబులుల కళ్ళన్నీ తేనె సీసాల మీనే వుంటే, ఆడి కడుపులో వుండ మనమం గ్రహిచ్చి ‘సర్కారు రగస్సెఁవ్ నాకూ - తేనె సీసా నీకా’ అన్నానంతే!
ఆడు తేనె సీసా సంచిలో దోపుకుంటా ‘గొప్పదేశాలవోళ్ళు’ కంపిణీలు బెట్టి మనకి ఉద్దోగా లిత్తారని సెవులో జెప్పిండు’’ అని నగ్గూరాం చెప్పాడు.
బాణావతు మొహం వాడిపోయింది.

* * *
యధాప్రకారం రోజులు నిర్వేదంగా గడిచిపోతున్నాయి. ఆశించినవి కానీ, అనుకోనివి కానీ ఎలాంటి సంఘటనలూ జరగలేదు.
అడవి సంపద సేకరించటం, గౌరారం వెళ్ళి సంతలో అమ్మటం... వారానికి సరిపడా చిల్లర సరుకులు కొని తేవటం... పట్నంలో షావుకారుకి బాకీ పడటం... పడ్డ బాకీ తీర్చటం... మళ్ళీ బాకీలు పెట్టటం-
‘‘రేపట్నించి మంచిరోజులొస్తాయి’ అని ఏ రోజుకారోజు అనుకొంటూ ఆత్మానందం, పొందటం...
అంతేకానీ, నగ్గూరాంకు కానిస్టేబులు చెప్పిందేమీ జరగలేదు.
నిజమే ఐతే అడవికి రాక పోకలు చెప్పిందేమీ జరగలేదు.
నిజమే ఐతే, అడవికి రాకపోకలు సాగిస్తున్నప్పుడు ఫారెస్టు గార్డులైనా ఒక మాట అనేవాళ్ళు.
అలాంటిదేమీ జరగలేదంటే ఏమిటి అర్థం?
పైగా, నగ్గూరాంతో అలా చెప్పిందో పోలీసు ఉద్యోగి... ఎంతవరకు నమ్మొచ్చు?
అలా చెప్పి, నగ్గూరాం భయపెట్టి ఉద్దెరగా అడవి సంపదను కొట్టెయ్యాలని చెప్పాడేమో
అంతే అయ్యుండాలి. లేకపోతే ఇప్పటికీ విషయం బైటికి పొక్కెది
అడవి పుత్రులు ఆ విషయం పూర్తిగా మరిచిపోయారు. నగ్గూరాం కూడా మళ్లీ అనే్లదు. ప్రభుత్వం నుంచి హెచ్చరికలు అందలేదు
కానిస్టేబులు చెప్పిందంతా అబద్ధం అనుకొని అడవి పుత్రులు నిర్భయంగా ఉన్నారు. రోజులు గడిచిపోతున్నాయి.
***
శనివారం
తెల్లవారితే గౌరారంలో జరిగే సంతలో తేనె అమ్మాలని ఇంటి నుంచి బాణావతు బయల్దేరాడు.
నల్లకొండ దగ్గరున్న తెరచాపంత తేనె పట్టును కొడితే కనీసం రెండు పెద్దల బుంగల పెద్ద తేనె దొరుకుతుంది. దానికి మంచి గిరాకీ ఉంది దళారులు తేనె కోసం ఎగబడుతున్నారు.
సరుకు ధర నిర్ణయించేది దళారులే అయినా సంతలో రేపు అమ్మే తేనె విషయంలో మాత్రం అలా జరగదు. తనుచెప్పిన ధరకు దళారులు కొంటారు. వాళ్ల అవసరం అలాంటిది.
తేనె మీద చాలా లాభం వస్తుంది. కష్టానికి తగిన ప్రతిఫలం రావటం అంటే లాభం రావటడమే అనుకొన్నాడు బాణావతు.
గతంలో ఎప్పుడూ లాభం రాలేదు!
రేపైనా సరుకులతో పాటు లక్ష్మీబాయికి ఎర్ర రిబ్బను కొనాలనుకొన్నాడు. రిబ్బన్ని చూసి మురిసిపోయే భార్య మొహాన్ని ఊహించుకొని తానే మురసిపోయాడు.
కబురంది కాళీచరణ్ వచ్చాడు.
‘రెడీనా..’ ఉత్సాహం ఉరకులు వేస్తుంటే అతన్ని ఇంగ్లీషు లో అడిగాడు బాణావతు.
‘అవుల్రైటుగా’ అన్నాడు కాళీచరణ్
మొలకు వేటకొడవల్లు వేలాడుగట్టి గట్టిగా తలగుడ్డలు చుట్టి, ఇద్దరూ రెండు మట్టి బుంగల్ని మోసుకొంటూ బయల్దేరారు. భుజాల మీద కంబళ్లున్నాయి.
నల్లకొండ వైపుకు సాగి పోతున్నారు.
భుక్యా తండా ఎట్టుందో ఊసుపోక దారిలో కాళీచరణ్ణి బాణావతు అడిగాడు.
‘్భక్యా తండానా’ మూడు బేదుల్లూ ఆరుడోకలులు గుందంట! ఒకటే జొరాలంట’ చెప్పాడు కాళీచరణ్
‘మందుగోలీ లిత్తన్నారా’
‘ఏంటికిత్తారు?’
‘మనవూ మడుసులనే గదా’
‘సర్కారోళ్లనుకొవాలా మనకి మనవ్ అనుకుంటే ఏటిసుకం’
‘అదీ నిజ్జవే’ అని పెద్దగానవ్వాడు బాణావతు
‘నగుతావేం’ కాళీచరణ్ అడిగాడు.
‘దేవుడి పంది యిసయం దెల్సానీకు ’ బాణావతు అడిగాడు
‘దేవుడి పందా’ ఆశ్చర్యపోయాడు కాళీచరణ్
‘భక్తవరాహం’ అన్నార్లే
అంటే
‘మహత్తు లుండే పందట’
‘పందిగూడా మహత్తే ఎంటయ్యా’
‘ఆ పంది కుందంతే’
‘పందులకి దేవుడా’
‘మడుసులకే’
‘ఎట్టెట్టా’
‘మడుసుల్లాగానే పొద్దుగాల నిదర ‘లెగసి పియ్యెరిగి తానం జేసేదంట. గుళ్ళో దూరి దేవుడి సుట్టూ తిరిగేదంట’
‘ఏంటికంట’
‘మహత్తెవంటే అదే మరి ’
‘పందికే ఉందా అసువంటి మహత్తెవ్ ’
‘రావసిలకలకీ , కాకులకీ గెద్దల గూడా ఉంది’
‘పంది యిసయం జెప్పు’
‘దానికి జొరవొచ్చింది.’
‘దేవుడి పందికి జొరవాకాళీచరణ్ ఆశ్చర్యపోయాడు ఉత్తుత్తినే! ఒక్కోపాలి దేవుడట్టా పరీచ్ఛలు బెడతాడు’
‘పందికా’
‘మడుసులకే ’
(ఇంకా ఉంది)

-గోపరాజు నాగేశ్వరరావు