డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు-76

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూర్వం కృతయుగంలో అకంపనుడు అనే రాజు ఉండేవాడు. అతన్ని యుద్ధరంగంలో శత్రువులు జయించారు. అతని పుత్రుడు హరి. అతను నారాయణునితో సమాన బలం కలవాడు. అతన్ని యుద్ధంలో శత్రువులు సంహరించారు. అకంపనుడు పుత్రునికి ఉత్తరక్రియలు జరిపించి రాత్రింబవళ్లు పుత్రునికోసం దుఃఖిస్తూ ఉండేవాడు. అతని దుఃఖవిషయం తెలిసి నారదమహర్షి అతన్ని చూడడానికి వచ్చాడు. రాజు అతన్ని పూజించి తన కుమారుని మరణవార్త తెలిపాడు. అతను నారదునితో ఇలా అడిగాడు. ‘‘నా కుమారుడు మహావీరుడు. ఇంద్రునితో సమానమైనవాడు. అతన్ని శత్రువులు చంపారు. పూజ్యుడా! ఈ మత్యువు ఎవరు? ఆయన బలం ఏపాటిది? నేను తెలుసుకోవా లనుకుంటున్నాను’’.
అప్పుడు నారదమహర్షి అతనికి పుత్రశోకాన్ని పోగొట్టే మృత్యూపాఖ్యానాన్ని వివరించాడు.
‘‘రాజా! ఈ సృష్టి ప్రారంభంలో బ్రహ్మ ప్రజలను సృష్టించాడు. కాని వారెవరూ ఎప్పటికీ చనిపోకపోవడం చూసి దీని సంహారవిషయంలో బ్రహ్మకు తీవ్రమైన చింత కలిగింది. ఎంత ఆలోచించినా అతనికి మార్గం కన్పించలేదు. అప్పుడు ఆయనకు ఆగ్రహం కలిగింది. ఆ క్రోధం వలన అతని ఇంద్రియాలనుండి అగ్ని పుట్టింది. ఆ అగ్ని సర్వాన్ని దహించదలచి అన్ని దిక్కులకు వ్యాపించింది. అప్పుడు భూమ్యాకాశాలలో ప్రంచడమైన అగ్ని జ్వాలలు వ్యాపించాయి. అగ్నిదేవుడు తన జ్వాలలతో సమస్తాన్ని దహించి వేయసాగాడు. అప్పుడు రుద్రుడు పరమేష్ఠి అయిన బ్రహ్మదేవుని శరణుకోరాడు. అప్పుడు బ్రహ్మ రుద్రుని ఇలా అడిగాడు. ‘‘పుత్రా! నీ కోరిక ఏది నెరవేర్చాలి? చెబితే నీకు ఇష్టమైనది చేస్తాను’’.
అప్పుడు శంకరుడు బ్రహ్మతో ఇలా అన్నాడు. ‘‘దేవా! నీవు అన్ని రకాల ప్రాణులనూ సృష్టించావు. అవి వృద్ధి చెందాయి. కాని వాటినే నీ క్రోధాగ్ని అన్ని వైపులనుంచీ దహించి వేస్తున్నది. అది చూసి నాకు బాధ కలుగుతున్నది. ఆ ప్రాణులమీద దయ చూపండి’’. అప్పుడు బ్రహ్మ అన్నాడు. ‘‘రుద్రా! ఈ జగత్తు అంతా సంహారం కావాలని నా కోరిక కాదు. దీనికి మేలు చేయాలనే నా ఉద్దేశ్యం. ఇంతమంది జీవులతో ఈ భూమికి భారం ఎక్కువ అవుతున్నది. భూమి ఈ భారం భరించలేక నన్ను ప్రార్థించింది. ఇంత విశాలమైన భూమి భారం దించడానికి నాకు ఏ ఉపాయం తోచడం లేదు. అందువల్ల నాకు ఆగ్రహం కలిగింది’’.
రుద్రుడు మరల ఇలా అన్నాడు. ‘‘పితామహా! ఈ ప్రాణులను నాశనం చేయకు. ఈ జగత్తు భూత, భవిష్యత్, వర్తమానాలు అని మూడు రీతులుగా ఉండుగాక. నీ కోపంలోంచి అగ్ని పుట్టి ఈ జగత్తును దహిస్తున్నది.
ఈ జగత్తు కాలి బూడిద ఐపోతున్నది. నీవు శాంతించు. ఇదే నిన్ను నేను కోరే వరం.’’
రుద్రుని మాటలు విని ప్రజాపతి మన క్రోధాన్ని తనలోనే దాచుకున్నాడు. కోపం వల్ల కలిగిన అగ్నిని ఉపసంహరిస్తున్న బ్రహ్మదేవుని అగ్ని ఇంద్రియాల నుండి ఒక స్త్ర ఆవిర్భవించింది. ఆమె శరీరం నలుపు ఎరుపు రంగులలో ఉన్నది. ఆమె కన్నులు, నాలుక, పచ్చని ఎర్రని రంగుల్లో ఉన్నాయి. ఆమె సువర్ణ ఆభరణాలు ధరించింది. ఆమె బయటకు వచ్చి దక్షిణ దిక్కుని ఆశ్రయించి వారిద్దరినీ చూసి నవ్వింది. అప్పుడు బ్రహ్మదేవుడు ఆమెను దగ్గరకు పిలిచి ‘‘మృత్యువా!’’ అని సంబోధించి, ‘‘నీవు ఈ సమస్తలోకాలను సంహరించు. ఇది నా ఆజ్ఞ’’ అన్నాడు. బ్రహ్మదేవుని మాటలు విన్న ఆమె వెకి వెక్కి ఏడ్వసాగింది. బ్రహ్మ ఆమెను శాంతపరచి ఓదార్చాడు. అప్పుడు ఆమె అతనికి నమస్కరిస్తూ ఇలా అన్నది ‘‘దేవా! నీవు సృష్టంచిన స్త్ర అన్నీ తెలిసి కూడా లోకానికి మేలు చేయని ఇలాంటి కౄరకర్మ ఎలా చేయగలదు? ఇలాంటి అధర్మకార్యాన్ని చేయడానికి నేను భయపడుతున్నాను. జనులకు ఇష్టమైన పుత్రులను, భర్తలను, సోదరులను చేను చంపుతూ ఉంటే అందరూ నాకు కీడు కలగాలని దైవాన్ని ప్రార్థిస్తారు. కనుక నాయందు దయ ఉంచి నేను యముని నివాసానికి వెళ్లకుండా ఉండేటట్లు అనుగ్రహించు. మీరు అనుగ్రహిస్తే తపస్సు చేసుకోవా లనుకుంటున్నాను. దేవా! జీవులకు చాలా ఇష్టమైనది వారి ప్రాణాలు. వారు రోదిస్తూ ఉండగా ఆ ప్రాణాలు తీయడానికి అశక్తురాలను. ఈ అధర్మం చేయకుండా నన్ను రక్షించు’’.
అప్పుడు బ్రహ్మ ఇలా అన్నాడు - ‘‘మృత్యువా! ప్రజలను సంహరించడానికే నిన్ను సృష్టించాను. కనుక వారిని సంహరించు. ఇది ఇలాగే జరగాలి. నీకు లోక నిందరాదు. నా ఆజ్ఞను పాలించు.’’
బ్రహ్మదేవుడు అలా చెప్పగానే ఆమె మనసులో సంతోషించింది. తర్వాత బ్రహ్మకు కోపం తగ్గి ప్రసన్నుడయ్యాడు. మృత్యుదేవత బ్రహ్మతో ఏమీ అనకుండా ధేను కార్యక్రమానికి వెళ్లింది. అక్కడ ఆమె ఉత్తమమైన వ్రతాన్ని చేపట్టింది. ఆమె ఇంద్రియాలను నిగ్రహించి ఒంటికాలి మీద నిలిచి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసింది. మరల కొన్ని వేల సంవత్సరాలు తపించింది. మరల కొన్ని వేల సంవత్సరాలు మృగాలతో కలిసి సంచరించింది. మరల ఆమె నందానది దగ్గరికి వెళ్ళి ఆ నదీజలంలో ఎనిమిది వేల సంవత్సరాలు గడిపింది. ఆ విధంగా ఆమె దోషరహిత పాపరహిత అయింది. తర్వాత ఆమె కౌశికీనది తీరానికి వెళ్లి అక్కడ నియమాలు పాటిస్తూ గాలిని, నీటిని ఆహారం తీసుకొని జీవించింది.
ఇంకావుంది...