డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు-77

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ విధంగా పుణ్యవతి అయిన ఆ కన్యక పంచగంగలలో, వెదురు వనాలలో తపస్సు చేసి తన శరీరాన్ని కృశింపజేసింది. తర్వాత గంగాతీరానికి వెళ్లింది. అనంతరం ఆమె మహామేరువును చేరి అక్కడ ప్రాణాయామంతో నిశ్చలంగా రాయిలా ఉండిపోయింది.తర్వాత హిమవత్పర్వతం చేరింది. తర్వాత ఆమె అనేక తీర్థాలలో తిరిగింది. ఆమె బ్రహ్మయందు భక్తి కలిగి ఉన్నది. ఈ విధంగా తపస్సు చేసి ఆమె పితామహుని సంతోషపెట్టింది. అప్పుడు బ్రహ్మదేవుడు ఆమెతో ఇలా అన్నాడు. ‘‘మృత్యుదేవీ! నీవు ఎన్నో రకాలుగా తపస్సు ఎందుకు చేస్తున్నావు?’’
ఆమె ఇలా బ్రహ్మకు సమాధానమిచ్చింది ‘‘దేవా! ఆరోగ్యంగా ఉండి దుఃఖిస్తూ బాధపడేవారి ప్రాణాలను తీయలేను. నేను నీ నుండీ ఇదే వరం కోరుతున్నాను. అధర్మం చేయడానికి నేను భయపడుతున్నాను.’’
అంత బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు. ‘‘ఈ ప్రజలను సంహరించడం నీకు అధర్మం కాదు. నా మాట ఏ విధంగానూ అసత్యం కాదు. అందువల్ల చెమటనుండి పుట్టేవి (స్వేదజ), నేలను చీల్చుకొని వచ్చేవి (ఉద్బిజ), గుడ్డునుండి వచ్చేవి (అండజ), మావి నుండి పుట్టేవి (జరాయుజాలు) ఈ నాలుగు రకాల ప్రాణులను సంహరించు. సనాతనమైన ధర్మం నిన్ను సదా పవిత్రం చేస్తుంది. ఈ కార్యంలో నీకు లోకపాలకుడైన యముడు, వ్యాధులు సహకరిస్తాయి. నేను నీకు వరం ఇస్తున్నాను. నీవు పాపరహితవు అవుతావు’’. బ్రహ్మదేవుడిలా చెప్పగా ఆమె తలవంచి నమస్కరించి ఇలా అంది.
‘‘నీ ఆజ్ఞను స్వీకరిస్తున్నాను. నా రుూ విన్నపాన్ని వినండి. లోభం, క్రోధం, మోహం, లజ్జాహీనత ఒకరినొకరు నిందించడం - ఈ దోషాలు ప్రాణుల దేహాలను ఛేదించుగాక’’
అప్పుడు బ్రహ్మ ఇలా అన్నాడు - ‘‘మృత్యుదేవతా! ఆవిధంగానే జరుగు తుంది. ప్రాణులను సంహరించు. నీకు ధర్మం లభిస్తుంది. నీ మనస్సులో కలిగే దోషాలను వదిలి నీ ధర్మం ఆచరించు’’.
మృత్యువు బ్రహ్మకు భయపడి ‘సరే’నంది. కాని ఆమె వృద్ధులను వారి ఆయువు తీరిన వారి ప్రాణాలను హరిస్తున్నది. ఆమె నుండే వ్యాధులు పుట్టాయి. వీటివల్ల ప్రాణి అస్వస్థుడు అవుతాడు. ఆయువు తీరిన తర్వాత మృత్యువు ప్రాణులకు కలుగుతుంది.
ఆయువు తీరిన తర్వాత సర్వేంద్రియాలు ప్రాణులతోపాటు పరలోకకానికి వెళతాయి. ఆ లోకంలో కర్మభోగాలు అనుభవిస్తాయి.
ఆ భోగాలు పూర్తి అయ్యాక ఈ లోకాలకి తిరిగివస్తారు.’’
మృత్యువు గురించి నారద మహర్షి చెప్పిన విషయాలు విన్న అకంపన మహారాజు అతనితో ఇలా అన్నాడు. ‘‘మునిశ్రేష్ఠా! నీవు చెప్పిన విషయాలు విని నేను కృతార్థుడనయ్యాను. ఇక పుత్రుని కోసం దుఃఖించను’’ అని పుత్రుని కోసం శోకించడం మానివేశాడు.
ఇంకావుంది...

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి