డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు-83

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవతలు కూడా భీష్ముని వారించారు. ‘‘ఇక ఈ యుద్ధం ఆపు. గురువైన పరశురామునితో యుద్ధం తగదు. రాముడిని యుద్ధంలో జయించడం నీకు న్యాయం కాదు. ఆ బ్రాహ్మణుని గౌరవించు’’.
మరల పరశురామునితో ఇలా అన్నారు ‘‘్భష్ముడు వసువులలో ఒకడు. వసువుని ఎలా జయించగలవు? అతను దేవతలందరిలో పూర్వుడు. సనాతనుడు అయిన నరుడు అర్జునుడిగా పుట్టి ఇతని మృత్యువుకు కారణవౌతాడని బ్రహ్మ విధించాడు’’.
అప్పుడు పరశురాముడు ఇలా అన్నాడు. ‘‘నేను యుద్ధ్భూమి నుండి ఎన్నడూ వెనుకడుగు వేయను. కనుక గాంగేయుని యుద్ధం నుండి తొలుగమనండి’’.
అప్పుడు మునులు, నారదుడు వచ్చి భీష్మునితో ఇలా అన్నారు. ‘‘నాయనా! ఈ యుద్ధాన్ని ఇక మాను. ఆ బ్రాహ్మణోత్తముని గౌరవించు’’.
అప్పుడు భీష్ముడు వారితో ఇలా అన్నాడు. ‘‘నాకొక వ్రతం ఉంది. యుద్ధం నుంచి వెనుక బాణాలు తగులుతుంటే ఎప్పుడు మరలిపోను. లోభం వల్ల కాని, భయం వల్లకాని, ధనం కోసం కాని శాశ్వతమైన ధర్మాన్ని విడిచిపెట్టను’’.
అప్పుడు నారదుడు, మునులు, గంగాదేవి అందరూ యుద్ధరంగం మధ్యలోకి వచ్చారు. భీష్ముడు అలాగే విల్లుతో నిల్చుని ఉన్నాడు. అప్పుడు వారందరూ పరశురాముని సమీపించి అతన్ని ఇలా వేడారు. ‘‘రామా! శాంతించు. యుద్ధం నుండి విరమించు. నీవు భీష్ముని చంపలేవు. భీష్ముడు నిన్ను చంపలేడు’’ ఇలా అంటూ పితరులందరూ అతనిచేత అస్తస్రన్యాసం చేయించారు.
అప్పుడు భీష్మునికి మళ్ళీ వసువులు కన్పించారు. వారు అతనితో ఇలా అన్నారు. ‘‘మహాబాహూ! నీ గురువైన గురువు దగ్గరికి వెళ్ళు. లోకహితం చెయ్యి’’ వారి మాట విని భీష్ముడు పరశురాముని దగ్గరకు వెళ్ళి అతనికి నమస్కరించాడు. పరశురాముడు అతన్ని దీవించి ఇలా అన్నాడు. ‘‘్భష్మా! నీతో సమానమైన వీరుడు ఈ లోకంలో ఇంకొకడు లేడు’’ ఇలా అని అతను భీష్ముని సమక్షంలోనే కాశీరాజు కుమార్తెను పిలిచి ఇలా అన్నాడు. ‘‘అమ్మా! నేను నా శక్తికొద్దీ యుద్ధం చేశాను. ఎన్నో అస్త్రాలను ప్రయోగించినప్పటికీ భీష్ముని జయించడానికి నేను సమర్థుడను కాను. నా శక్తి ఇంత మాత్రమే. భీష్ముడు నన్ను యుద్ధంలో జయించాడు. ఇక భీష్ముడినే శరణు పొందు. ఇక నీకు వేరే గతి లేదు’’.
అప్పుడు కాశీరాజు కుమార్తె అతనితో ఇలా అంది. ‘‘్భగవన్! మీకు చేతనైనంతవరకు నా కోసం యుద్ధం చేశారు. యుద్ధంలో భీష్ముని దేవతలు కూడా జయించలేరు. నేను భీష్ముని వద్దకు ఎట్టి పరిస్థితిలోనూ వెళ్ళను. నేను స్వయంగా భీష్ముని పడగొట్టే స్థాయికి చేరుకొనే చోటికి వెళ్తాను’’ ఇలా రోషంగా అని తపస్సు చేయడానికి అంబ అక్కడి నుండి బయలుదేరింది. పరశురాముడు కూడా మహేంద్రపర్వతానికి వెళ్ళిపోయాడు. భీష్ముడు తిరిగి నగరంలో ప్రవేశించి తల్లికి విషయాలన్నీ వివరించాడు.
భీష్ముడు చారులను పంపి అంబ ఎక్కడికి వెళ్తుందో ఏమి చేస్తోందో కనుక్కుని రమ్మని పంపాడు. వారు వచ్చి అంబ తపస్సు కోసం అరణ్యానికి వెళ్లిందని వార్త చెప్పారు. అతను ఈ విషయం వ్యాసుని కి, నారద మహర్షికి తెలిపాడు. వారిద్దరూ అతనితో ఇలా అన్నారు. ‘‘్భష్మా! కాశిరాజు కూతురి విషయమై నీవు చింతించకు. విధి నిర్ణయాన్ని పురుష ప్రయత్నంతో మార్చ డానికి ఎవరు ప్రయత్ని స్తారు?’’
అంబ యమునాతీరం చేరి తీవ్రమైన తపస్సు చేయసాగింది. ఆమె ఆహారం తీసుకోవడం ఆపేసింది. ఆమె శరీరం కృశించి పోయి కట్టెలా మారింది. ఆమె కాలి బొటనవ్రేలిపై నిలబడి ఒక సంవత్సరం పాటు తపస్సు చేసింది. ఈ విధంగా పనె్నండు సంవత్సరాలు ఆమె తీవ్రంగా తపస్సులు చేసింది. తరువాత ఆమె సిద్ధులు, తాపసులు, ఆశ్రమాలు ఉండే వత్సదేశానికి చేరింది. అక్కడ ఉన్న ఉలూకాశ్రమం, చ్యవనాశ్రమం, దిలీపుని ఆశ్రమం మొదలైన ఆశ్రమాలు దర్శించి అక్కడి తీర్థాలలో స్నానం చేసి కఠిన నియమాలతో జీవించింది.
అప్పుడు గంగ ఆమెను ‘‘ఎందుకు అంత కఠిన నియమాలతో శరీరాన్ని కృశింప జేసుకుంటున్నావు?’’ అని ప్రశ్నించగా ఆమె ఇలా చెప్పింది. ‘‘పరశురాముడు యుద్ధంలో భీష్ముని చేతిలో ఓడిపోయాడు కనుక భీష్ముని నాశనం చేయడానికి ఈ తపస్సు చేస్తున్నాను’’.
అప్పుడు గంగ ఆమెతో ఇలా అంది. ‘‘నీవు భీష్ముని నాశనం కోరి ఈ వ్రతం చేస్తే ఈ శరీరాన్ని విడిచి నదిగా మారిపోతావు. అది వంకరటింకరగా ప్రవహించేది, కేవలం వర్షపునీటితో నిండేదిగా ఉంటుంది. నిన్ను వర్షాకాలపు నదిగానే గుర్తిస్తారు. మిగతా నెలలు నీ జాడ ఎవరికీ తెలియదు’’.
అంబ ఆమె మాటలు లెక్కచేయక మళ్ళీ తీర్థాలలో తిరగాలనే ఆశతో తిరుగుతూ పడిపోయింది. వత్సభూమిలో ఆ నది అంబ అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. అది వర్షాకాలంలో మాత్రమే ఉంటుంది. ఆమె తన తపస్సుతో వత్సరాజ్యంలో అర్ధశరీరం నదిగా వెలసి, అర్ధశరీరంతో కన్యగా పుట్టింది. ఆ జన్మలో కూడా తపస్సు చేయాలని అనుకుంది. తక్కినవారు ఆమెను వారించారు. కాని ఆమె వారి మాట వినలేదు. భీష్ముని చంపితేనే తనకు శాంతి కలుగుతుందని చెప్పింది. తనకు స్ర్తిత్వంపై విరక్తి కలిగిందని పురుషునిగా జన్మించి భీష్మునిపై పగ తీర్చుకుంటానని చెప్పింది. అప్పుడు ఆమె ముందు శంకరుడు ప్రత్యక్షమై వరం కోరుకొమ్మనగా ఆమె భీష్ముని నాశనం కోరుకుంది. అప్పుడు శంకరుడు ‘‘్భష్ముని చంపగలవు’’ అని వరమిచ్చాడు. అప్పుడు ఆమె శంకరునితో స్ర్తిగా తాను ఎలా భీష్ముని నాశనం చేయగలను? అని అడిగింది. శంకరుడు ఇలా అన్నాడు ‘‘నా మాట సత్యవౌతుంది. స్ర్తిగా పుట్టి పురుషునిగా మారి యుద్ధంలో భీష్ముని చంపుతావు. నీవు ద్రుపదుని వంశంలో పుట్టి మహారథిగా పేరుపొందుతావు’’. అప్పుడు అంబ అందరూ చూస్తూ ఉండగా కట్టెలు పేర్పించి అగ్నిని రగిల్చి ఆ చితిలోకి దూకి అగ్నిప్రవేశం చేసింది.
ఇంకావుంది...

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి