డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు-84

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్పుడు అంబ అందరూ చూస్తూ ఉండగా కట్టెలు పేర్పించి అగ్నిని రగిల్చి ఆ చితిలోకి దూకి అగ్నిప్రవేశం చేసింది.
ద్రుపద మహారాజు పట్టమహిషికి సంతానం లేదు. మహారాజు తన పూజలతో శంకరుని సంతోష పరిచాడు. శంకరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా తనకు భీష్ముని చంపే పుత్రుడు కావాలని కోరాడు. అప్పుడు ఈశ్వరుడు ఇలా అన్నాడు. ‘‘రాజా! నీకు మొదట స్ర్తి పుట్టి తర్వాత పురుషునిగా మారుతుంది’’.
కొంతకాలానికి ద్రుపదుని రాణి గర్భవతి అయింది. సరియైన సమయంలో ఆమె ఒక కన్యను ప్రసవించింది. కాని ఆమె తనకు కొడుకు పుట్టాడని అందరికీ చెప్పింది. ద్రుపదుడు ఆమె కన్య అన్న విషయాన్ని రహస్యంగా ఉంచి పుత్రునిగానే పెంచాడు. ద్రుపదునికి తప్ప ఈ విషయం ఇంకెవ్వరికీ తెలియదు. ఆమెకు శిఖండి అని నామకరణం చేశారు. ధనుర్విద్య కోసం శిఖండి ద్రోణునికి శిష్యుడయ్యాడు. అతని రాణి పుత్రునిలాగ పెరుగుతున్న కుమార్తెకు భార్యను తెమ్మని అడుగసాగింది. ద్రుపదుడు వనవతి అవుతన్న కుమార్తెను చూచి చింతించ సాగాడు. అతని భార్య అతన్ని ఓదార్చి శంకరుని వరం ఎప్పటికీ మిథ్య కాదు. ఆమెకు తప్పక భార్యను తేవాలి అని మరీ మరీ చెప్పింది. ఆ దంపతులిద్దరూ చివరకు నిశ్చయించుకొని దశార్ణదేశపు రాకుమారితో వివాహం జరిపించారు. దశార్ణదేశరాజు గొప్ప సైనిక బలం కలవాడు.
వివాహం అయిన తర్వాత ఆ రాకుమారిని కాంపిల్యానికి తెచ్చారు. కొద్దిరోజుల్లోనే శిఖండి పురుషుడు కాదని ఆ రాజకుమారికి తెలిసిపోయింది. అప్పుడు ఆ రాకుమారి తన చెలికత్తెలతో శిఖండి పురుషుడు కాదని తనలాంటి కన్యయే అని చెప్పింది. దాదులు ఈ విషయాన్ని దశార్ణరాజుకు తెలియపరిచారు. ఇది విన్న రాజుకు ఆగ్రహం కలిగింది. కోపంతో అతను ఒక దూతను ద్రుపదుని దగ్గరకు పంపాడు. ఆ దూత ఏకాంతంలో రాజుతో ఇలా అన్నాడు ‘‘రాజా! వివాహ విషయంలో నీచేత మోసగింపబడిన మా రాజు నీతో ఇలా చెప్పమన్నాడు. ‘‘నా కూతురిని నీ కూతురు కోసం యాచించావు. నన్ను అవమానించావు. ఇదంతా నీ కుత్రంతమే. ఈ మోసానికి తగ్గ ఫలితం అనుభవించు. నిన్ను నీ ప్రజలతో సహా పెకిలించివేస్తాను జాగ్రత్త!’’ అన్నాడు.
ద్రుపదుడు ఈ సందేశంతో వణికిపోయి పైకి గంభీరంగా అటువంటిదేమీ లేదని వియ్యంకునికి దూత ద్వారా వార్త పంపాడు. కాని దశార్ణరాజు ద్రుపదుని కూతురు స్ర్తియే అని కచ్చితంగా తెలిసికొని అతనిపై యుద్ధానికి వచ్చాడు. ద్రుపదుడు తీవ్రమైన భయాన్ని పొంది భార్యతో ఇలా అన్నాడు. ‘‘దేవీ! నీ కుమార్తె కన్యయే అని దశార్ణరాజుకు తెలిసింది. ఈ శిఖండిని స్ర్తిలాగానే ఉంటుంది. ఈ కష్టం తీరే ఒకే ఒక్క ఉపాయం చెప్పు’’ ద్రుపదునికి నిజం తెలిసినా ఇతరుల దృష్టిలో తన నిర్దోషిత్వం నిరూపించుకునేం దుకు పైకి అలా అన్నాడు.
అప్పుడు రాణి అతనితో ఇలా అంది - ‘‘ప్రభూ! శిఖండి కన్యయే. కాని సవతులకు భయపడి పుత్రుడని చెప్పాను. ఆమెను అలాగే పెంచాము. ముందు కన్యగా పుట్టి తర్వాత పురుషు డౌతాడని చెప్పడం వలన పెళ్ళి కూడా చేశాము’’.
ఈ విషయం ద్రుపదుడు మంత్రులకు వివరించాడు. అతను భగవంతుని నమ్ముకొని పూజలు మొదలుపెట్టాడు. రాణి కూడా అతన్ని మంత్రులతో కలిసి దైవప్రార్థన చేయమంది. ఇలా బాధపడుతున్న వారిద్దరినీ చూసి వారి కుమార్తె శిఖండిని వారిద్దరూ తన వలన ఇంత దుఃఖాన్ని పొందుతున్నారని చింతించిం ది. ఆమె ప్రాణత్యాగం చేయ నిశ్చయించింది. ఇలా అనుకొని ఆమె ఒక నిర్జనమైన అరణ్యంలోకి ప్రవేశించింది. ఆ అడవిని స్థూణాకర్ణుడనే యక్షుడు కాపాడుతున్నాడు. అక్కడ అతని భవనం ఉంది.
శిఖండి అందులోకి ప్రవేశించి, తిండి తినకుండా శరీరాన్ని కృశింపజేసింది. స్ణూణాకర్ణునికి ఆమెను చూస్తే జాలి వేసింది. అతను ఆమెతో ఇలా అన్నాడు. ‘‘అమ్మారుూ! ఎందుకు ఈ వ్రతం చేస్తున్నావు? నీకు ఏం కావాలో చెప్పు వెంటనే చేస్తాను. నేను కుబేరుని అనుచరుడను. ఏదైనా చేయగలను’’.
అప్పుడు ఆమె ఇలా అంది. ‘‘యక్షా! నా తండ్రికి కొడుకులు లేరు. కొలదికాలంలోనే నాశనం కాబోతున్నాడు. నా మామ అతనిపైకి దండెత్తి వస్తున్నాడు. నా తల్లిదండ్రులకు అతని బారినుండి రక్షించు. నా కోరిక తీరుస్తానన్నావు కదా! నేను ఏ లోపమూ లేని పురుషుడిని కావాలి. ఆ రోజు మా నగరాన్ని సమీపించకముందే నన్ను అనుగ్రహించు’’.
శిఖండి మాటలు విన్న యక్షుడు కొంచెంసేపు ఆలోచించి ఆమెతో ఇలా అన్నాడు. ‘‘నీ కోరిక తీర్చుతాను. నా పుంసత్వం నీకు ఇస్తాను. నీ స్ర్తిత్వం నేను తీసుకుంటాను. కాని కొద్దికాలానికి మాత్రమే ఇస్తాను. ఈ గడువులోపల నీవు రావాలి. ఇది సత్యమని, మాట తప్పనని మాట ఇవ్వు. నీవు ఆలా చేయకపోతే నేను ఏమైనా చేయగలను.’’
అప్పుడు శిఖండి ఇలా అంది - ‘‘సువ్రతా! తప్పకుండా నీ పుంసత్వాన్ని తిరిగి ఇస్తాను. దశార్ణరాజు వెళ్ళిపోగానే నేను కన్యనైపోతాను. నీవు పురుషుడవు అగుదువు’’. ఇలా వారిద్దరూ ప్రమాణాలు చేసుకున్నారు. తర్వాత వారిద్దరూ తమ చిహ్నాలను మార్చుకొన్నారు. శిఖండి తేజోరూపుడైన పురుషునిగా మారిపోయాడు. ఈ విధంగా పుంసత్వం పొంది శిఖండి నగరానికి పోయి తండ్రికి అంతా వివరంగా చెప్పాడు. ద్రుపదుడు చాలా సంతోషించాడు.
తర్వాత ద్రుపదుడు దశార్ణపతికి ‘‘నా సుతుడు పురుషుడే. మీరు నా మాట విశ్వసించండి’’ అని వార్త పంపాడు. కాని దశార్ణరాజు ఆ మాటను మన్నించక ద్రుపదునిపైకి యుద్ధానికి వెళ్ళాడు. ఈ విషయం తెలిసి ద్రుపదుడు వియ్యంకుని దగ్గరకు ఒక బ్రాహ్మణుని దూతగా పంపాడు. ఆ దూత రాజుతో ఈ విధంగా చెప్పాడు.
ఇంకావుంది...

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి