డైలీ సీరియల్

అనంతం-23

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విడతలవారీగా హోరుగాలులు వీస్తున్నట్టు అంతరంగాన్ని అల్లకల్లోలం చేస్తున్నాయి ఆలోచనలు!
చాంద్‌నీకి అదే శిక్షవెయ్యాలి! అది నికృష్టంగా బ్రతకాలి! నికృష్టంగా చావాలి!
అడవిన కాచే వెనె్నల్ని, పూచే పువ్వునూ, వీచే గాలినీ ‘నాది’ అని ప్రకటించకుండా ‘మనది’ అని అందరూ అనుభవించినట్టే చాంద్‌నీని అంగడి బొమ్మని చేసి అందరూ అనుభవించాలి!
దాన్ని ఊరుమ్మడి ఆస్తిగా మార్చాలి.
గొప్పవాళ్ళని ధిక్కరించిన నేరానికి జోగినిని చెయ్యాలి!
అపుడు దాని శరీరంమీద అందరికీ హక్కు ఏర్పడుతుంది.
అలా అది- రసికుల కోర్కెలు తీర్చే యంత్రమై కాముకుల కౌగిళ్ళలో నలుగుతూ మనసు చంపుకొని విటుల కోర్కెలు తీరుస్తూ దంత, నఖక్షతాలకు రక్తం వోడుతూ కూడా,
అర్థరాత్రీ, అపరాత్రీ తలుపు తట్టే కాముకులను ఆహ్వానించాలి.
ఎంత ధైర్యం దానికి!
బాధల్ని దాచుకోవటానికే దానికి చెరువంత గుండె వుంది!
అనుభవిస్తుంది!
విచ్చలవిడి శృంగారం లజ్జారహిత సంభోగం ఊరుమ్మడి వ్యభిచారం- జోగిని ఆధ్యాత్మిక విధి అని దైవ కార్యమనీ చెప్పి-
ఆ పవిత్ర దైవకార్యాన్ని నిష్టగా నిర్వర్తిస్తూ- కామ దహన హోమంలో శరీరాన్ని సమిధగా మారుస్తూ, సుఖ రోగాలతో పుచ్చిపోతూ కూడా-
ఆధ్యాత్మిక విధిని నిర్వర్తించే ఓర్పు, ఓపిక చాంద్‌నీకిక ఆ దేవుడే ఇవ్వాలి!
గరుడాచలం ఏమంటాడో?
చాంద్‌నీని రాగ్యా కోరుకొంటున్నపుడు, దాన్ని జోగినిగా మార్చటానికి ఒప్పుకుంటాడా?
ఒకవేళ ఒప్పుకోకపోయినా, అనుకున్నది అమలు చేసే శక్తి తనకుంది. ఎమ్మెల్యే హోదా వుంది. సమాజంలో పలుకుబడి వుంది.
ఆ విషయం తెలిసిన గరుడాచలం ఆఫ్ట్రాల్ ఒక అనాగరిక అడవి పుత్రుడికోసం వ్యతిరేకిస్తాడా తనను?
వ్యతిరేకించడు.. అవకాశం లేదు!
నాగరిక-అనాగరిక విభజనలో గరుడాచలం నాగరికుల ప్రయోజనాలే కాపాడుతాడు తప్ప, రాగ్యా పక్షం వహించడు!
అడవి వాతావరణం ఆనుపానులూ తెలుసు కనుక-
పక్షి జాతులమీద పరిశోధనలో రాగ్యా అవసరం గరుడాచలానికి వుంది. మందుకూ విందుకూ సాదరు ఖర్చులకూ గరుడాచలం అవసరం రాగ్యాకుంది.
అది- కార్యకారణ సంబంధం తప్ప ఆ అనుబంధం పరీక్షకు నిల్చేది కాదు!
పేచీ అల్లా ఇక రాగ్యాతోనే!
వాడు చాంద్‌నీని కోరుకుంటున్నాడు. మనసా వాచా కర్మణా ఆరాధిస్తున్నాడు. దానితోడితే జీవితంగా భావిస్తున్నాడు. కలువరిస్తూ పలువరిస్తూ పరితపిస్తూ చాంద్‌నీ ధ్యానంలోనే కాలాన్ని వెళ్లదీస్తున్నాడు.
దాన్ని జోగిన్ని చెయ్యటానికి ఒప్పుకోడు!
ఒప్పుకోక చెయ్యగలిగిందేమీ లేదు గానీ, రాగ్యాతో వివాదం పెట్టుకుంటే అసలు పని కుంటుపడొచ్చు!
ఓ అడవి పిల్లమీద ప్రతీకారం తీర్చుకొందుకు కీ.శే.పెద్దిరెడ్డి కొడుకు ఎమ్మెల్యే పెంటారెడ్డి, ప్రభుత్వ పథకాన్ని వమ్ముచేశాడంటే-ఎంత నామర్దా!?
నయానో భయానో బుజ్జగించో మభ్యపెట్టో రాగ్యా దూరం కాకుండా లౌక్యంగా కార్యం సాధించాలి.
అందుకు సమర్థుడు గరుడాచలం.
అతనికోసం ఎదురుచూస్తూ ఒంటరిగా కూర్చొని, ఊసుపోక ‘ప్రగతి పథంలో ఆంధ్రప్రదేశ్’ చదువుతున్నాడు. కీ.శే.పెద్దిరెడ్డికొడుకు ఎమ్మెల్యే పెంటారెడ్డి!
కొంత సమయం గడిచింది.
అనుమతితో గరుడాచలం లోపలికొచ్చాడు. ఎమ్మెల్యే ఎదరగాకుర్చీలో కూర్చున్నాడు.
‘‘అభవృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్’’ అవతల పెట్టి సొంత విషయంలో కొస్తూ-
‘‘రాగ్యా రాలేదా?’’ అని అడిగాడు.
గరుడాచలం పరధ్యానంగా వున్నాడు. మాట్లాడలేదు.
ఎమ్మెల్యే అతని వైపు చూశాడు!
గరుడాచలం వాలకం ఏదోలా వుంది! నీరసించాడు. ఏదో బాధతో వున్నట్టు చెప్పకనే చెప్తోంది అతని మొహం!
‘‘అలా ఉన్నావేం?’’ ఎమ్మెల్యే అడిగాడు.
గరుడాచలం తేరుకొని రుూ లోకంలోకొచ్చాడు. జీవంలేని నవ్వు నవ్వూరుకున్నాడు.
‘‘నీకోసమే ఎదురుచూస్తున్నాను. నువ్వూ రాగ్యా కలిసి అడవికి వెళ్లారని తెలిసింది..’’ ఎమ్మెల్యేనే అన్నాడు.
‘‘తండా బాట ఎలా జరిగింది’’ గురుడాచలమే అడిగాడు.
‘‘ఏదో అలా జరిగిందిలే!’’
‘‘నీ మాటల్లో ఏదో గూడార్థం వున్నట్టుంది’’
‘‘అలాంటిదేమీ లేదు.. హైదరాబాద్ నుంచి కబురొచ్చింది. ఎంత త్వరగా రెడ్డియా నాయక్ తండా ఖాళీ చేయిస్తే అంత మంచిది..’’
‘‘అనుకున్నదే కదా! నొప్పించకుండా చేయించాలని’’
‘‘పరిస్థితి యిప్పుడలా లేదు. తండా వాళ్ళు తీవ్రవాదులతో సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఆలస్యం చేస్తే అనర్థాలు జరగొచ్చు!’’
‘‘గరుడాచలం ఆలోచనలో పడిపోయాడు!
‘‘ఏమిటలా ఆలోచిస్తున్నావ్?’’ ఎమ్మెల్యే అడిగాడు.
‘‘నిజమే! త్వరగా ఖాళీ చేయించటమే మంచిదని నాకూ అనిపిస్తున్నది. ఒక్క రాగ్యా తప్ప ఆ తండాలో అందరూ అందరే! ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా బలిసిపోయారు..’’
‘‘అలాగా?’’ అంటూ ఆశ్చర్యం ప్రకటించాడు ఎమ్మెల్యే.
‘‘మీరన్నట్టు వాళ్ళకి తీవ్రవాదులతో సంబంధాలుంటే అవ్వి ఖచ్చితంగా చాంద్‌నీ ద్వారా ఏర్పడి ఉండాలి’’
గరుడాచలం వైపు అదోలా చూశాడు ఎమ్మెల్యే!
అతనలా అన్నాడంటే, చాంద్‌నీ మీద ఎందుకో కోపంతో ఉన్నట్టే! లేకపోతే ఆమెకు తీవ్రవాదులతో సంబంధాలున్నాయనడు.
మొత్తానికి ఏదో జరిగింది! అదేంటో తెలుసుకొంటేనేగానీ గరుడాచలంతో ఏం మాట్లాడాలో? ఎలా మాట్లాడాలో అర్థం కాదు!
(ఇంకా ఉంది)

-గోపరాజు నాగేశ్వరరావు