డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు -91

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘నేను ధర్మాన్ని, నీతినీ ఆశ్రయించి లోకాన్నంతా జయించాను. కాని నీవు నీ గుణాల చేత నన్ను జయించావు. నేను నీ బుద్ధిని కాని పౌరుషాన్ని కాని కించపరచను. అలాగే నేను జయించానని నిన్ను అవమానించను. నీవు విజయం పొందిన వీరునిలా నడుచుకో. నా యింటికి వచ్చి నా చేత సత్కారాలు, పూజలు అందుకో’’.
ఆ తరువాత వారిద్దరూ స్నేహితుల్లాగ ప్రవర్తించి, బ్రాహ్మణులను పూజించి ఎవరి గృహాలకు వాళ్లు వెళ్లారు. విదేహరాజు కోసలరాజకుమారుని తన యింటికి తీసుకొని వెళ్ళి అర్ఘ్యపాద్య మధుపర్కాలతో పూజించాడు. అతనికి తన కుమార్తెనిచ్చి కల్యాణం జరిపించి అనేకమైన రత్నాలను కానుకగా ఇచ్చాడు. రాజులకు ఇదే పరమధర్మం, తక్కినవి అనిత్యం. రాజకుమారుడు భార్యతో, రాజ్యంతో సంతోషంగా జీవించి ధర్మపరిపాలన చేశాఇడు.
ఋషభగీత
పూర్వం హైహయ వంశానికి చెందిన సుమిత్రుడు అనే రాజు ఉండేవాడు. అతను ఒకరోజు వేటాడడానికి అరణ్యానికి వెళ్లాడు. అక్కడ అతను ఒక సూదిమొన గల బాణంతో ఒక లేడిని కొట్టాడు. కాని ఆ మృగం వేగంగా పరుగెత్తి బాణంతో సహా పారిపోయింది. రాజు కూడా ఆ మృగాన్ని అనుసరించాడు. ఆ మృగం వేగంగా పల్లం వైపు పరుగెత్తింది. అది అలా పరుగెత్తి సమతల ప్రదేశానికి వెళ్లిపోయింది. రాజు యువకుడు; వేట అంటే ఉత్సాహం కలవాడు. అందువల్ల ధనుర్బాణాలతో ఆ మృగాన్ని వెంబడించాడు. అతివేగంతో పరుగెత్తే ఆ లేడి నదీనదాలను, వనాలను దాటుకుంటూ ముందు ముందుకు సాగిపోయింది. ఆ మృగం కొంతదూరం ముందుకు పరుగెత్తుతూ మళ్ళీ వెనక్కు రాజుదగ్గరకు వస్తూ మళ్లీ ముందుకు పోసాగింది. అలా దగ్గరగా వచ్చినప్పుడు దాన్ని బాణంతో కొట్టగా దాని శరీరం అంతా బాణమయం అయింది. అయినా ఆ మృగం దూరం వెళ్తూ మళ్లీ దగ్గరకు వచ్చింది. అప్పుడు రాజు ఒక వాడి బాణాన్ని దానిపై సంధించాడు. మృగం రెండు కోసుల దూరం పరుగెత్తి అక్కడ నవ్వుతున్నట్లు నిలుచుంది. ఆ వాడి బాణం కింద పడగానే ఆ మృగం అరణ్యంలోకి పారిపోయింది. రాజు కూడా దాన్ని వెంబడించాడు. అలా అతను ఆ మృగాన్ని వెంబడిస్తూ ఆ మహారణ్యంలో తాపసులు నివసించే ఆశ్రమాన్ని చేరుకున్నాడు. అలసిపోయిన రాజు అక్కడ ఇక పరుగెత్తలేక కూర్చుండిపోయాడు. విల్లు ధరించి వచ్చిన రాజును చూసి ఋషులు అతన్ని సమీపించి అతనికి అతిథి సత్కారాలు చేశారు. వారి ఆతిథ్యాన్ని స్వీకరించి రాజు వారి తపస్సు గురించి, ఆశ్రమ జీవనం గురించి కుశలప్రశ్నలు వేశాడు. వారు అతనికి సరియైన సమాధానాలు చెప్పి అతని రాకకు కారణమడిగారు. వారు అతనితో ఇలా అన్నారు ‘‘నరేశ్వరా! నీవు ఏ సుఖం ఆశించి, కత్తి, ధనస్సు, బాణాలు చేతబూని ఈ తపోవనానికి వచ్చావు? ఎక్కడి నుంచి వచ్చావు? నీవు ఏ వంశంలో జన్మించావు? నీ పేరేమిటి? మాకు నీ గురించి వినాలని కోరికగా ఉంది. కనుక వివరించు’’.
అప్పుడు రాజు ఎంతో నమ్రతగా వారందరికీ నమస్కరించి తన పరిచయం ఇలా చేశాడు. ‘‘నేను హైహయ వంశంలో పుట్టాను. నా పేరు సుమిత్రుడు. నేను అరణ్యానికి వేటకోసం వచ్చి మృగాలను బాణాలతో గాయపరుస్తూ విహరిస్తున్నాను. నా బాణం తగిలి ఒక మృగం బాణంతోపాటు రుూ వైపుగా పారిపోయింది. దానిని వెంబడిస్తూ నేను ఇలా వచ్చాను. అలసట వలన నా శోభ తగ్గిపోయింది. నా కోరిక భగ్నం కావడం వలన కలిగిన దుఃఖం, రాజలాంఛనాలన్నీ వదలడం చేత కాని, పట్టణం వదలడం వలన గాని కలుగలేదు. మహాపర్వతం హిమాలయం గాని, అగాధమైన జలరాశి, సముద్రం గాని, తమ వైశాల్యం చేత ఆశతో సమానం కావు. ఓ తాపసశ్రేష్ఠులారా! అంతులేని ఆకాశంలా ఆశకు కూడా అంతం లేదు. ఈ విషయం మీకు కూడా తెలుసు. మీరు తపోధనులు. సర్వజ్ఞులు. కనుక నా సందేహాన్ని అడుగుతున్నాను. ఆశావాది అయిన పురుషుడా? అంతరిక్షమా? ఈ రెండింటిలో మహత్త్వం వలన ఏది గొప్పదని మీరు భావిస్తారు? ఈ తత్త్వం వినాలని ఉంది. ఇక్కడ దుర్లభమైనది ఏదీ లేదు. ఇది మీరు చెప్పడానికి రహస్యం కాకపోతే నాకు వివరించండి. ఆశకు గల కారణాన్ని సామర్థ్యాన్ని తత్త్వపరంగా తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరంతా నిత్యం తపస్సు చేసేవారు. మీరంతా కలిసి నాప్రశ్నకు సమాధానం ఇవ్వండి.
రాజు అడిగిన ప్రశ్నలను విన్న ఆ ఋషులందరిలోనూ ఋషిసత్తముడు అయిన ఋషభుడనే తాపసి ఇలా అన్నాడు. ‘‘ఓరాజసింహమా! కొంతకాలం క్రిందట నేను తీర్థాటనం చేస్తూ నారాయణాశ్రమాన్ని చేరుకొన్నాను. అక్కడ చాలా అందమైన రేగుచెట్లు చాలా ఉన్నాయి. వైహాయస కుండం ఉంది. అక్కడ హయగ్రీవుడు వేదాలను పఠిస్తూ ఉంటాడు. ఆ కుండంలో శాస్త్రోక్తంగా పితరులకూ దేవతలకూ తర్పణాలిచ్చి తర్వాత ఆశ్రమంలోకి వెళ్లాను. నిత్యమూ అక్కడ నర నారాయణులనే ఋషులు తపస్సు చేస్తూ నివసిస్తూ ఉంటారు. దానికి దగ్గరలోనే ఇంకొక ఆశ్రమం ఉంది. అక్కడ నివసించడానికి అనుమతి ఇవ్వండి అని ఆశ్రమ తాపసిని కోరడానికి వెళ్లాను. ఆ ఆశ్రమానికి ‘తనువు’ అనే తపోధనుడు వచ్చాడు. అతను నారచీర, చర్మం ధరించి, పొడవుగా సన్నగా కృశించి ఉన్నాడు. అతని శరీరం తక్కినవారికంటే ఎనిమిది రెట్లు పొడవు వుంది. శరీరం కృశించి ఉంది. అటువంటి కృశత్వమును ఎక్కడా చూడము. అతని శరీరం చిటికెన వ్రేలంత సన్నగా ఉంది. తల, మెడ, చేతులు, పాదాలు, వెంట్రుకలు అన్నీ అబ్బురంగా కన్పించాయి. తల, చెవులు, చేతులు అన్నీ శరీరానికి తగినట్లుగానే ఉన్నాయి. అతన్ని చూసి నేను భయపడి, లోలోపల చాలా బాధపడ్డాను. కాని అతని మాట, చేష్ట మామూలుగానే ఉన్నాయి. నేను అతని పాదాలకు నమస్కరించి ఎదురుగా నిలబడ్డాను. నా తల్లిదండ్రుల గురించి, నామగోత్రాల వివరాలు చెప్పాను. అతను ఆసనం చూపగా నేను నెమ్మదిగా దానిపై కూర్చున్నాను.
ఇంకావుంది...