డైలీ సీరియల్

జాపకోపాఖ్యానము-93

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సావిత్రీ దేవి ‘అట్లే జరుగుతుంది’ అని దీవించింది. ఆ దేవి ఇంకా ఇలా అన్నది - ‘ద్విజశ్రేష్ఠులు పొందే సాధారణ లోకాలకు నీవు వెళ్ళవు. అనిందితమ్మ, అనిమిత్తమ్మ అయన బ్రహ్మ పదాన్ని నీవు పొందగలవు. నీవు కోరుకున్నది జరుగుతుంది. నియతితో, ఏకాగ్ర చిత్తంతో సాధన చేయ. ధర్ముడు నిన్ను సేవిస్తాడు. కాలుడు, మృత్యువు, యముడు - నీ సన్నిధిలో ఉంటారు. వారిలో నీకు ధర్మపరంగా చర్చ జరుగుతుంది.’’ ఈ విధంగా పలికి సావిత్రీ దేవి అదృశ్యమయంది. బ్రాహ్మణుడు శ్రద్ధగా తన జపాన్ని కొనసాగించాడు. ఆ విధంగా నూరు దివ్య సంవత్సరాలు జరిగిపోయాయ.
అతను ఎల్లప్పుడు అసూయ లేకుండా, ఇంద్రియ నిగ్రహంతో, క్రోధం లేకుండా, సత్యసంధతతో ప్రవర్తించేవాడు. అతను నియమిత కాలం జపం చేసిన తర్వాత ధర్ముడు ప్రసన్నుడై అతని మొందు సాక్షాత్కరించాడు. ధర్ముడు అతనితో ఇలా అన్నాడు. ‘‘విప్రోత్తమా! నేను ధర్ముడను. నీ కోసం వచ్చాను. నీ జప ఫలితం చెప్తాను విను. నీవు దివ్య మానుష లోకాలనన్నిటినీ జయంచావు. నీవు దేవ లోకాలకు వెళ్ళగలవు. నీకిష్టమైన లోకానికి ఈ శరీరాన్ని విడిచి వెళ్ళు’’.
అప్పుడు బ్రాహ్మణుడు ఇలా అన్నాడు - ‘‘్ధర్మా! ఆ లోకాలు నాకెందుకు? నేను ఈ శరీరంతో ఎన్నో కష్టాలను, సుఖాలను అనుభవించాను కనుక దీనిని విడువలేను’’
ధర్ముడు - ‘‘మునివరా! నీవు శరీరాన్ని త్యజించు. అలా చేస్తేనే ఏ క్ష్మిఊకానికైనా వెళ్ళగలవు’’
‘‘అవసరం లేదు, నాకు ఇచ్ఛ లేదు॥
ధర్ముడు - ‘‘ఈ దేహం మీద అంత కోరిక ఉండకూడదు. దేహాన్ని వదిలితేనే రజోహీనమైన దేవలోకాన్ని పొందగలవు. అక్కడ దుఃఖం ఉండదు.’’
బ్రాహ్మణుడు - ‘‘దేవా! నేను జపం చేస్తేనే ఆనందంగా ఉండగలను. ఆ లోకాలు నాకు అక్కర్లేదు. సశరీరంగా స్వర్గానికి వెళ్ళగలనో లేదో చెప్పు.’’
ధర్ముడు - ‘‘బ్రాహ్మణా! నిన్ను చూడడానికి కాలుడు, మృత్యువు, యముడు వచ్చారు.’’
వారు ముగ్గురు బ్రాహ్మణుని దగ్గరకు వచ్చి, యముడు అతనితో ఇలా అన్నాడు - ‘‘నీవు చక్కగా చేసిన తపస్సుకు, నీ సత్ప్రవర్తనకే తగిన ఫలితం లభించింది.’’
కాలుడిలా అన్నాడు - ‘‘నీకు ఇది స్వర్గానికి వెళ్ళవలసిన సమయం. అది చెప్పటానికే నేను నీ దగ్గరకు వచ్చాను.’’
బ్రాహ్మణుడు - ‘‘మీ అందరికీ స్వాగతం. నేను మీ కోసం ఏమి చేయాలో ఆదేశించండి. నా శక్తికి తగినట్లుగా మీకు సేవ చేస్తాను. చెప్పండి’’.
అదే సమయంలో తీర్థయాత్రలు చేస్తూ ఇక్ష్వాకు మహారాజు అక్కడికి వచ్చాడు. ఆ రాజర్షి వారందరినీ కుశలమడిగి అక్కడ వారితో పాటు ఆసీనుడయ్యాడు. బ్రాహ్మణుడు అతనికి కూడా అతిధి సత్కారాలు చేసి రాజు కోసం తానేమి చేయాలో చెప్పుమన్నాడు. అప్పుడు రాజు ఇలా అన్నాడు. ‘‘నేను రాజును. నీవు వేద వేదాంగ పారంగతుడివైన బ్రాహ్మణుడివి. కనుక నీకు కొంత ధనమివ్వదలిచాను. నీకెలాంటి ధనం కావాలో కోరుకో’.
అప్పుడు బ్రాహ్మణుడు ఇలా సమాధానం చెప్పాడు.
‘‘రాజా! ధర్మాలు రెండు రకాలు. దానిని బట్టి బ్రాహ్మణులు కూడా ప్రవృత్తులు, నివృత్తులు అని రెండు రకాలు. నేను ప్రతి గ్రహం (దానం పట్టడం) నుండి నివృత్తుడను. కనుక ప్రవృత్తి ధర్మంలో ఉన్నవారికి దానం ఇవ్వు. నేను దానం ఇస్తాను. నీకేది కావాక్ష్మిఊ చెప్పు. నా తపశ్శక్తితో అది నీకు ఇస్తాను’’.
రాజు ఇలా అన్నాడు. ‘‘నేను క్షత్రియొడను. నాకు దానం ఇవ్వటమే తప్ప స్వీకరించడం తెలియదు. యుద్ధాన్ని మాత్రమే మేము యాచిస్తాము’.
బ్రాహ్మణుడు ఇలా అన్నాడు - ‘‘రాజా నీవు నీ ధర్మంతో తృప్తి పడినట్లే నేను నా ధర్మంతో తృప్తిపడతాను. మనం ఇద్దరుం ఒకలాంటి వారమే. నీకేది ఇష్టమైతే అది చెయ్య.’’
రాజు ఇలా అన్నాడు - ‘‘నీ శక్తిని అనుసరించి దానం చేస్తానని చెప్పావు. కనుక యాచిస్తున్నాను. నీ జప ఫలాన్ని నా కివ్వు’’.
అప్పుడు బ్రాహ్మణుడు ఇలా అన్నాడు - ‘‘మరి నీవు యుద్ధాన్ని మాత్రమే యాచిస్తానని చెప్పావు కదా! మరి నాతో యుద్ధాన్ని ఎందుకు యాచించటం లేదు?’’
రాజు - ‘‘విప్రోత్తమా! ద్విజులకు మాటయే వజ్రం వంటి ఆయొధం. క్షత్రియులు బాహుబలంతో జీవిస్తారు. ప్రస్తుతం నాకు నీతో జరుగుతున్నది వాగ్యుద్ధమే.’’
బ్రాహ్మణుడు - ‘‘ఇప్పటికీ నా ప్రతిజ్ఞ అదే. నా శక్త్యానుసారం నీకు కావలసింది ఇస్తాను. కనుక ఏం కావాలో కోరుకో’’.
రాజు - ‘‘నాకు దానమివ్వాలనుకొంటే, నూరు సంవత్సరాలు నీవు చేసిన జప ఫలితాన్ని నాకు ఇమ్ము’’.
బ్రాహ్మణుడు - ‘‘నా జపంలో కలిగిన ఫలితంలో అర్ధ్భాగం నీవు తీసుకో. లేదా ఇంకా కావాలంటే నా మొత్తం జప ఫలితాన్ని స్వీకరించు!’’
రాజు ఇలా అన్నాడు ‘నేను యాచించిన జప ఫలం నాకు లభించినట్లే. ఈ లభించిన జపఫలం ఏమ్పిఊ చెప్పు’.
అప్పుడు బ్రాహ్మణుడు ఇలా అన్నాడు. ‘‘నేను చేసిన జపం యొక్క ఫలితమేమిటో నాకు తెలియదు. కాని ఆ జప ఫలం అంతా నీకు ఇచ్చివేశాను. దీనికి ఈ ధర్ముడు, కాలుడు, యముడు, మృత్యువే సాక్షులు.’’
రాజు - ‘‘ఫలితమేమిటో తెలియని నీ జపం నాకు ఏం మేలు చేస్తుంది? కనుక ఫలితాన్ని చెప్పలేకపోతే ఆ ఫలితమంతా నువ్వే ఉంచుకో’’.
అప్పుడు బ్రాహ్మణుడు రాజుతో ఇలా అన్నాడు - ‘‘రాజర్షీ! నేను ఇప్పటిదాకా చేసిన జపఫలం నీకిచ్చేశాను. దానికి మన సంభాషణే ప్రమాణం. నీకు ఎన్నడూ జపం చేసే సమయంలో దాని ఫలాపేక్ష లేదు. కనుక ఆ జపఫలం నాకెలా తెలుస్తుంది? ఇవ్వమని నువ్వు అడిగావు, నేను ఇచ్చాను అంతే!’’
ఇంకావుంది...

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి