డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు -94

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేను మాట తప్పను. నీవు నీ మాట పాటించు. అసత్యమాడకు. నేను ఇస్తానన్నాను కనుక నీవు స్వీకరించవలసిందే. నీవు అడిగిన మాట మీద స్థిరంగా ఉండు. ఎందుకంటే అసత్యవాదులకు ఇహపరాలు రెండూ ఉండవు. అతడు పితరులను, భవిష్యతరాలను కూడా తరింపచేయలేడు. ఎన్ని తపస్సులు ఎంత చేసినా అవి సత్యాన్ని మించిపోలేవు. సత్యమే అక్షర బ్రహ్మ. సత్యమే నశించని తపస్సు. సత్యమే అక్షర యజ్ఞం. సత్యమే అక్షర వేదం. సత్యం యొక్క ఫలమే సర్వ శ్రేష్ఠమైన ఫలం. ఈ జగత్తు అంతా సత్యం మీద ఆధారపడి ఉన్నది. సత్యమే వేదం. సత్యమే వేదాంగాలు. సత్యమే సర్వవిద్యలు.
సత్యమే విధి
సత్యమే ఓం కారం
సత్యం వల్లనే గాలి వీస్తున్నది
సత్యం వల్లనే సూర్యుడు ఉదయస్తున్నాడు, అగ్ని దహిస్తున్నది
స్వర్గం సత్యమందే నిలిచి ఉంటుంది.
వేదాలు, యజ్ఞాలు, తపస్సు, మంత్రాలు, సరస్వతి - ఇవన్నీ సత్య స్వరూపాలే. ధర్మం సదా సత్యం వైపే ఉంటుంది.
కనుక రాజా! అసత్యమైన కర్మని చేయకు. యాచన ఇష్టం లేని వాడివి ‘దేహి’ అని నా తప్ఫఃలం యాచించావెందుకు? నేను ఇచ్చినది స్వీకరించకపోతే ధర్మభ్రష్ఠుడవై తిరుగుతూ ఉంటావు. మాట ఇచ్చి దానం చేయనివాడూ దానం అడిగి స్వీకరించనివాడు - ఇద్దరూ అసత్యవాదులే అవుతారు. కనుక ఈ విషయాన్ని అసత్యం చేయకు’’.
రాజు ఇలా అన్నాడు - ‘‘ప్రజారక్షణము, యుద్ధము- ఈ రెండూ క్షత్రియ ధర్మాలే కదా! మరి నీవు ఇచ్చే దానాన్ని ఎలా స్వీకరించను?’’
బ్రాహ్మణుడు - ‘‘దానం స్వీకరించమని నేను నీ దగ్గరకు వచ్చి ప్రాధేయ పడలేదు. నీవే నా జప ఫలాన్ని దానంగా ఇమ్మని అడిగావు. మరెందుకు స్వీకరించవు?’’
అప్పుడు ధర్ముడు వారి మధ్యకు వచ్చి ఇలా అన్నాడు -
‘‘మీ ఇద్దరూ వాదించుకోవద్దు. సాక్షాత్తు ధర్ముడను మీ ముందు ఉన్నాను. రాజు తపః ఫలాన్ని స్వీకరించవచ్చు.’’
అప్పుడు సశరీరంగా స్వర్గమే వచ్చి వారి ముందు నిలిచి ఇలా అంది - ‘‘మీరిద్దరూ ఆ ఫలితాన్ని సమానంగా పొందండి’’
అప్పుడు రాజు ఇలా అన్నాడు - ‘‘నాకు స్వర్గంతో పనిలేదు. విప్రుడు వెళ్ళదలిస్తే నేను సంపాదించిన పుణ్యాన్ని కూడా స్వీకరించవచ్చు’’.
దానికి బ్రాహ్మణుడు ఇలా అన్నాడు - ‘‘నేను చిన్నతనంలో తెలియక చేయ జాపి ఉండవచ్చు. కాని ప్రస్తుతం నేను గాయత్రీ మంత్రం జపిస్తూ నివృత్తి మార్గంలో ఉన్నాను. కనుక నన్ను ప్రలోభపెట్టవద్దు. నా పని నేను సాధించుకోగలను. నీ ఫలితం నాకు అవసరం లేదు. నేను తపస్సు నందు, స్వాధ్యాయమందు లగ్నమైనవాడిని. ప్రతి గ్రహాన్ని విడిచి పెట్టినవాడిని.’’
అప్పుడు రాజ ఇలా అన్నాడు - ‘‘నీవు నీ జప ఫలాన్ని పరిత్యజిస్తే ఇలా చేద్దాం. మనం ఇద్దరం సాధించిన పుణ్యఫలాన్ని సమానంగా అనుభవిద్దాం. క్షత్రియులు దానం చేయగలిగినవారు, బ్రాహ్మణులు దానం గ్రహించేవారు. కనుక ఫలితాన్ని సమానంగా అనుభవిద్దాము. నీ కిష్టం లేకపోతే అలా చేయవలసిన పని లేదు. నా పుణ్యఫలాన్ని స్వీకరించు’’.
ఆ సమయంలో వికృత రూపులైన ఇద్దరు పురుషులు అక్కడికి వచ్చారు. వారు మలిన వస్త్రాలు ధరించి ఒకరి నొకరు కౌగిలించు కొన్నారు. నీవు నాకు బాకీ లేదు అని ఒకడు, కాదు బాకీ ఉన్నాను అని రెండవ వాడు వాదించు కుంటున్నారు. వారిద్దరూ రాజు దగ్గరకు వచ్చి తమకు సరియైన తీర్పు ఇవ్వమని కోరారు. అందులో ఒకడు విరూపుడు, రెండవ వాడు వికృతుడు.
విరూపుడు ఇలా అన్నాడు ‘‘రాజా! నేను వికృతుడికి ఒక గోదాన ఫలం బాకీ ఉన్నాను. నేను బాకీ తీరుస్తాను అంటే అతను స్వీకరించడం లేదు.’’
అప్పుడు వికృతుడిలా అన్నాడు - ‘‘నాకు అసలు విరూపుడు బాకీయే లేడు. నేనెలా స్వీకరిస్తాను?’’
రాజు విరూపుడు వికృతునికి ఏమి బాకీ ఉన్నాడో చెప్పుమనగా అతను ఇలా చెప్పాడు - ‘‘రాజా! బాకీ గురించి చెప్తాను విను. వికృతుడు తపస్స్వాధ్యాయ సంపన్నుడైన బ్రాహ్మణునికి ఒక గోవును దానం చేశాడు. నేను వికృతుని ఇంటికి పోయ ఆ గోదాన ఫలాన్ని యాచించాను. అతను నాకు ఆ ఫలితాన్ని నాకు దానం చేశాడు. తర్వాత నేను ఒక బీద బ్రాహ్మణునికి రెండు కపిల గోవులు దానం చేశాను. ఆ గోదాన ఫలితాన్ని వికృతునికి ఇవ్వదలిచాను. నేను స్వీకరించిన దానికి రెట్టింపు ఫలాన్ని ఇస్తున్నాను. ఇందులో దోషి ఎవరో మీరే నిర్ణయంచాలి. మాకు న్యాయం చేయాలి. అతను దానమిచ్చినట్లే నేను కూడా దానమిస్తున్నాను. మరి అతను ఎందుకు స్వీకరించడం లేదు?’’
రాజు వికృతుని అడిగాడు - ‘‘వికృతా! నీవు అతని దానాన్ని ఎందుకు స్వీకరించడం లేదు? నీది అతను తీసుకున్నట్లే అతను ఇచ్చింది నీవు తీసుకో!’’
వికృతుడు ఇలా అన్నాడు - ‘‘విరూపుడు నాకు బాకీ ఉన్నానని అంటున్నాడు. కాని నేను దానమిచ్చాను కనుక బాకీ ప్రసక్తి లేదు. కనుక నాకు ఏమీ ఇవ్వనక్కర్లేదు’’.
రాజు - ‘‘అతను ఇస్తానంటే నీవు వద్దంటున్నావు అది తప్పు. నిన్ను శిక్షించవలసి వస్తుంది.’’
వికృతుడన్నాడు - ‘‘రాజర్షీ! నేను అతనికి దానం చేసిన దానిని తిరిగి ఎలా తీసుకుంటాను, ఇచ్చిన దానిని మళ్ళీ తీసుకోలేను. కనుక నన్ను శిక్షించండి.’’
విరూపుడు - ‘‘నేను ఇచ్చిన దాన్ని నీవు స్వీకరించకపోతే రాజు నిన్ను శిక్షిస్తాడు’’.
వికృతుడు - ‘‘నేను నీకు ధనాన్ని అప్పుగా ఇవ్వలేదు. దానంగా ఇచ్చాను. కనుక నువ్వు నాకు ఏమీ బాకీ లేవు. నీవు వెళ్ళవచ్చు.’’
వారి వాదన విన్న బ్రాహ్మణుడు రాజుతో ఇలా అన్నాడు - ‘‘రాజా! వీరిద్దరి మాటలు విన్నావు కదా! ఇప్పుడు నిస్సంకోచంగా నా దానాన్ని స్వీకరించు’’.
ఇంకావుంది...

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి