డైలీ సీరియల్

అనంతం-31

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాళ్ళంతా స్థాణువుల్లా నిల్చుండిపోయారు.
‘‘బుస్ బుస్’’మంటోన్న శబ్దం లీలగా వినిపించింది.
అపుడు గమనించారు వాళ్ళు-
ప్రక్కనేవున్న గుబురు పొద వెనుక రెండు పెనుబాములు కలుస్తూ, విడిపోతూ- మళ్లీ మళ్లీ కలిసి విడిపోతూ, తోకమీద లేచి క్రింద పడుతూ, మళ్లీ లేస్తూ తుళ్ళింతలు పడుతూ ఆడుకొంటున్నాయి!
రాగ్యా దారి చూపిస్తే, వాళ్ళు పాములకు దూరంగా వెళ్ళారు. హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.
గురుడాచలం గుండెవేగంగా కొట్టుకుంటున్నది!
భయంనుంచి తేరుకొందుకు జేబులో నుంచి ఓ విస్కీ బాటిల్ బైటికి తీశాడు. గటగటాకొంత తాగి, రాగ్యాకిచ్చాడు.
రాగ్యా కూడా తాగాడు. కొంచెం మత్తుగా వుంది.
ఆ మత్తులో రాగ్యాగి పెనుబాములతోపాటు చాంద్‌నీ గుర్తొచ్చింది!
గరుడాచలం పరిస్థితి కూడా అలాగే వుంది! అతని మనసు తెరమీద చాంద్‌నీ రూపం కనిపించింది!
ఎంత అందగత్తె చాంద్‌నీ!
దాన్ని అనుభవించందే జీవితం వృధా!
కామకేళిలో నిమగ్నమై స్వేచ్ఛగా ఆనందాలు జుర్రుకున్న ఆ పెనుబాముల్ని వరించిన అదృష్టం తననూ వరిస్తే ఎంత బాగుంటుంది! తనూ చాంద్‌నీ ఆ పెనుబాములకు మల్లేనే పెనవేసుకుపోతే ఎంత హాయిగా వుంటుంది!
అడవి సుమ సౌరభాల్ని మోసుకొచ్చే గాలి తరంగాల్లో, అడవి వెనె్నల్లో, పచ్చిక బయళ్ళమీద కోర్కెల పరాకాష్టలో తుళ్ళింతలు పడుతూ, అలసిపోయేదాకా, అమర సుఖాలు జుర్రుకుంటే ఎంత ఆనందగా ఉంటుందో!
‘‘యల్దావా సారూ’’ అన్నాడు రాగ్యా.
ఆలోచనలకు అంతరాయం కలిగింది.
మనసు తెరమీద నుంచి చాంద్‌నీ చిత్రం చెరిగిపోయింది.
‘‘వెళ్దాం’’ అన్నాడు గరుడాచలం.
అంతలో-
వింత పక్షి అరుపు దూరం నుంచి వినిపించింది!
‘‘అదే కలివికోడి’ అని పెద్దగా అరిచాడు గరుడాచలం.
అందరూ అటువైపు చూశారు.
‘‘అదేనా’’ అనుమానంగా చూస్తూ రాగ్యా అన్నాడు.
‘‘అదే! సందేహం లేదు’’ అన్నాడు గరుడాచలం.
‘‘యట్టా సెప్తుంటారు’’
‘‘గతంలోనే దాని అరుపులు రికార్డయ్యాయి. చాలాసార్లువిన్నాను’’
‘‘అదేనంటారా సారూ’’
‘‘అనుమానం లేదు’’ అన్నాడు గరుడాచలం.
‘‘ఇప్పుడేవి సెయ్యాలి’’
‘‘నా వెంట నడవండి! నేలమీద జాడలు చూస్తూ ముందుకు వెళ్దాం’’ అని గరుడాచలం పరీక్షగా నేలవైపు చూస్తూ నడువసాగాడు.
వాళ్ళు అతన్ని అనుసరించి వెళ్తున్నారు.
గరుడాచలం ఒకచోట ఆగాడు.
నేలమీద కొంత పరిధిలో గుండ్రంగా తిరుగుతూ అణువణువూ పరీక్షగా చూశాడు.
‘‘కలివికోడి జాడలు దొరికాయ్’’ అని పెద్దగా అరిచాడు.
రాగ్యా, సెక్యూరిటీ సిబ్బంది ఆసక్తి అణచుకోలేక, వాళ్ళూ ముందుకు వంగి నేలను చూసారు.
నిజమే!
అన్నిపక్షుల పాదముద్రలకు భిన్నంగా అక్కడి నేలమీద పాద ముద్రలు కనిపించాయి. గరుడాచలం చెప్పింది నిజమన్న నిర్థారణకొచ్చారు.
***
కలివికోడి అడుగుజాడల్ని బట్టి, అవ్వి సంచరిస్తున్న ప్రాంతాల్ని గుర్తించాడు. ఏఏ ప్రాంతాల్ని కలుపుతూ ముళ్ళ కంచె వేసి రక్షిత ప్రాంతాలుగా ప్రకటించాలో నిర్ణయమైంది.
ప్రాజెక్టు రిపోర్టు జిల్లా కలెక్టరుకు అందించటానికి ప్రొద్దునే్న ఎమ్మెల్యే వెళ్లాడు.
గుడారాల దగ్గర పండగ వాతావరణం కనిపిస్తోంది!
గరుడాచలం ఆనందం అంతా యింతా కాదు..
రెండు చేతులతో రాగ్యా భుజాలు పట్టుకొని కదుపుతూ ‘‘రాగ్యా! నీ సహకారంతోనే సాధించగల్గాను! రాబోయే కీర్తిప్రతిష్ఠలకు కారణం నువ్వే! ఏం చేసి నీ రుణం తీర్చుకోగలనూ’’ అని అని అభినందిస్తూ ఆనందాతిరేకంతో పొంగిపోయాడు గరుడాచలం!
రాగ్యా ఆనందం కూడా వర్ణనాతీతంగా వుంది!
‘‘సారూ! కోడి యవ్వారవ్ తెగింది! ఇంక నా యిసయవ్ ఆలోసిచ్చండి’’ అని అడిగాడు రాగ్యా.
గరుడాచలంఏదో మాట్లాడబోయాడు.. ఆగాడు.
అంతలో కొంతమంది ప్రభుత్వ అధికారులు అభినందించేందుకు వచ్చారు. బొకేలిచ్చారు. దండలు వేశారు. కరతాళ ధ్వనులు చేశారు.
అభినందనల జల్లులు కురిసాక అందరూ సుఖాసీనులయ్యారు.
విందు ఏర్పాట్లు జరిగాయి!
నెమలి మాంసం ఆ రోజు కూడా స్పెషల్!
గ్లాసుల గలగలలతోపాటు విడతలవారి అభినందనలు, జోకులు, నవ్వులూ, సిగరెట్ల దహనాలు, మాంసం తిని ఎముకలు విసరటాలు, నంగిమాటలు, అరమోడ్పు కళ్లూ..
షరా మామూలే!
‘‘కలివికోడి గురించి వివరిస్తారా’’ ఎవ్వరో గరుడాచలాన్ని ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధిలా అభినయిస్తూ అడిగాడు.
‘‘కలివికోళ్ళతో భారతదేశం సుసంపన్నవౌతుంది’’
‘‘విదేశాల వైఖరి ఎలా ఉంటుందంటారూ’’
‘‘అసూయతో రగిలిపోతారు’’ అన్నాడు గరుడాచలం.
(ఇంకా ఉంది)

-గోపరాజు నాగేశ్వరరావు