డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు -97

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కురుక్షేత్ర యుద్ధానంతరంవిజయం పొందిన పాండవులు తిరిగి నగర ప్రవేశం చేస్తున్నారు. రాజమార్గంలో నాలుగు వైపులా వీధులన్నీ అలంకరించారు. అక్కడ నిలుచున్న స్ర్తీలు ద్రౌపదిని, ఆమె చేసిన సేవలను ప్రశంసించారు. వారు రాజమార్గాన్ని దాటి రాజమందిరం చేరుకున్నారు. అక్కడ వేదపండితులు, బ్రాహ్మణులూ ధర్మరాజును ఆశీర్వదించారు. అతను వారిని యథోచితంగా సత్కరించాడు.
ఆ సమయంలో ఆ బ్రాహ్మణులలో కపటబ్రాహ్మణ రూపంలో ఉన్న చార్వాకుడు అనే రాక్షసుడు కూడా ఉన్నాడు. అతను దుర్యోధనుని మిత్రుడు. భిక్షుకుని రూపంలో ఉన్నాడు. రుద్రాక్షలు పిలక ధరించినాడు. ఆ కపటవిప్రుడు వేలమంది బ్రాహ్మణులు ధర్మరాజును ప్రశంసిస్తుం టే ఓర్వలేక ఇలా అన్నాడు ‘‘ఓ రాజా! ఈ విప్రులంతా నన్ను ఇలా చెప్పమన్నారు. ఛీ!్ఛ ఈ రాజు దుర్మార్గుడు జ్ఞాతులందరినీ వధించాడు బంధువులనందరినీ నాశనం చేసిన నీవలన ధర్మం ఎలా నిలుస్తుంది? చుట్టాలను, గురువులను వధించిన నీవు చావడమే మేలు నీవు బ్రతికి ఉండకూడదు’’.
దుర్మార్గుడైన ఆ రాక్షసుడు సిగ్గు లేకుండా ధర్మరాజును తిడ్తూ ఉంటే అక్కడ చేరిన బ్రాహ్మణులు భయపడిపోయారు. వారు చాలా బాధపడ్డారు. ధర్మరాజు ఆ రాక్షసుని మాటలతో సిగ్గుపడ్డాడు. అప్పుడు ధర్మరాజు వినయంగా ఇలా ప్రార్థించాడు ‘‘విప్రోత్తమా! దయచేసి నన్ను అనుగ్రహించండి. నా తమ్ముల కోసమే ఈ రాజ్యము. నన్ను దూషించకు.
అప్పుడు అక్కడ ఉన్న విప్రులు ఇలా అన్నారు ‘‘రాజా! అవి మా మాటలు కావు, నీకు సంపద కలగాలి’’ అని అక్కడ ఉన్న తపస్వులు తమ జ్ఞానదృష్టితో వానిగురించి తెలుసుకొని ధర్మరాజుతో మరల ఇలా అన్నారు ‘‘వీడు దుర్మార్గుడైన దుర్యోధనుని స్నేహితుడు, చార్వాకుడు అనే రాక్షసుడు. సన్యాసి వేషంలో వచ్చి నిన్ను దూషించి దుర్యోధనునికి శాంతి కలిగించాలని తలుస్తున్నాడు. ఈ భయం నీకు తొలగుగాక, నీ తమ్ములకు శుభమగుగాక’’ అలా ధర్మరాజుతో అని వారు క్రోధంతో ఆ రాక్షసుని నిందిస్తూ చంపేశారు. బ్రహ్మవేత్తలైన ఆ పండితుల తపస్సుల తేజస్సుతో వాడు మరణించాడు. తరువాత పాండవులూ, శ్రీకృష్ణుడు బంధువులు విశ్రాంతిగా కూర్చుని ఉన్న సమయంలో శ్రీకృష్ణుడు వారందరికీ చార్వాకుని వృత్తాంతం చెప్పాడు.
‘‘పూర్వం కృతయుగంలో చార్వాకుడనే రాక్షసుడు బదరీవనంలో చాలా సంవత్సరాలు తీవ్రంగా తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమై అతన్ని వరం కోరుకోమన్నాడు. అప్పుడతను సర్వ భూతాలవల్ల తనకు మరణ భయం లేకుండేటట్ల వరం కోరాడు. ‘ద్విజులను నువ్వు అవమానించనంత కాలం నీకు సర్వ భూతాల నుంచి ఏ భయం లేదు’ అని బ్రహ్మ అతనికి వరమిచ్చాడు. చార్వాకుడు ఆ వరబలంతో తీవ్రమైన ఘోర కృత్యాలు చేస్తూ దేవతలను హింసించ సాగాడు. అతని చేత పీడింపబడిన దేవతలు బ్రహ్మతో ఆరాక్షసుని వధింపుమన్నారు. అపుడు బ్రహ్మ అతని మరణం ఇప్పటికే నిశ్చయమై పోయింది. త్వరలోనే అతను మరణిస్తాడు అని చెప్పాడు. ఇంకా ఇలా అన్నాడు - మానవులలో దుర్యోధనుడనే రాజుతో ఇతను స్నేహం చేస్తాడు. ఆస్నేహం వల్ల ఇతను బ్రాహ్మణులను అవమానిస్తాడు. విప్రులు కోపించి ఇతన్ని దహించి వేస్తారు. దానితో ఇతను నశిస్తాడు. ఆవిధంగా చార్వాకుడు బ్రహ్మదండం చేత హతమొందాడు. చార్వాకుని వధ ఈ విధంగా జరిగింది.
ఇంకావుంది...

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి