డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు -100

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మరాజుకు ఒకసారి ఒక సందేహం కలిగింది. ‘‘రాజు ఎవరి ధనానికి స్వామి అవుతాడు. అతని ప్రవర్తన ఏవిధంగా ఉంటే ఆదర్శమైన రాజు అని ప్రజలు అంటారు. ఈ సందేహలకు సమాధానం చెప్పుమని అతను పితామహుడైన భీష్ముని ప్రార్థించాడు. అప్పుడు భీష్ముడు అతనికి ధర్మ సందేహలన్నీ తీర్చి, ఉదాహరణగా ఒక రాజు గురించి ఇలా చెప్పాడు
- ‘‘బ్రాహ్మణులు కాని వారి ధనానికి మాత్రమే రాజు స్వామి అవుతాడు. కర్మ భ్రష్టులైన బ్రాహ్మణులను కూడా రాజు ఉపేక్షించరాదు. ఎవరి రాజ్యంలో ద్విజుడు దొంగ అవుతాడో, ఆ అపరాధం రాజుదే కాని ఇంకొకరిది కాదు. ఆపాపం కూడా రాజుదే అవుతుంది. బ్రాహ్మణులను రక్షించవలసిన బాధ్యత కూడా రాజుదే. ఆ కారణంగా రాజు నకుడి లాంటి రాజర్షులు తప్పక విప్ర రక్షణ కర్తవ్యంగా భావించే వారు. దీని గురించి ఒక కథ ఉంది. పూర్వ కాలంలో కైకయదేశాన్ని పాలించిన రాజు వ్రతశీలి. అతను వేదాధ్యయన చేస్తున్న అతనిని ఒక క్రూర రాక్షసుడు పట్టుకున్నాడు. అప్పుడు ఆ రాక్షసునితో ఇలా అడిగాడు -‘‘నాగ్రామాల్లో దొంగ, లోభి, మద్యం సేవించే వాడు, యజ్ఞం చేయనివాడు కాని లేరు. మరి నువ్వు ఎందుకు నన్ను పట్టుకొన్నావు. అలాగే విద్వాంసుడు కాని బ్రాహ్మణుడు వ్రతనిష్ఠ లేని వాడు, ఆహితాగ్ని కానివాడు, యజ్ఞం చెయ్యని వాడు నా రాజ్యంలో లేరు మరి నువ్వెందుకు నువ్వు నాలో ప్రవేశించావు?
ఇంకా నా రాజ్యంలో బ్రాహ్మణులు భూరి దక్షిణలతో యజ్ఞాలు చేస్తున్నారు. బ్రాహ్మణులు షట్కర్మలలో నిలిచి ఉన్నా వారు వేదం చదువుతారు, చదివిస్తారు. యజ్ఞం చేస్తారు. చేయిస్తారు. దానం చేస్తారు, దానం తీసుకొంటారు. వారు ఇతరులను పూజిస్తారు, పూజింప బడతారు. వారికి వివేకం, జ్ఞానం ఉన్నాయి. వారు సత్యమే పలుకుతారు. ఇలాంటి బ్రాహ్మణులు కల రాజ్యం నాది. మరి నా రాజ్యంలో ఎందుకు ప్రవేశించావు?
ఇంకా నా రాజ్యంలో క్షత్రియులు యాచించరు. సత్యాన్ని ధర్మాన్ని అనుసరిస్తారు. వారు వేదాలు చదువుకుంటారు కాని చదివింపరు. క్షత్రియ ధర్మ నిరతులు వారు యజ్ఞాలు చేస్తారు కాని చేయించరు. వారు బ్రాహ్మణులను కాపాడుతారు కాని భీరువుల్లాగ యుద్ధ భూమినుండి పారిపోరు. మరి నీవు నాలో ఎందుకు ప్రవేశించావు?
ఇంకా నా రాజ్యంలో తక్కినవారి గురించి వివరిస్తాను ఆలకించు. నారాజ్యంలోని వైశయులు వ్యవసాయం, పశుపాలనం, వాణిజ్యం- వీటితో కపట రహితంగా జీవిస్తారు. వారు అధిక ప్రసంగం చేయరు. క్రియాశీలురు సత్యమే మాట్లాడుతారు. వారి ఇంద్రియ నిగ్రహం శుచిత్వం, వివేకం, స్నేహం ఎన్నడూ వదలరు. తమ విధులను కూడా వదలరు అయినా నీవు నాలో ఎందుకు ప్రవేశించావు?
అదే విధంగా నా దేశంలోని శూద్రులు ఏ అసూయ లేకుండా, తమ తమ కర్మలను చేయుటలో శ్రద్ధవహిస్తారు. వారు తక్కిన మూడు వర్ణాలవారిని ఆశ్రయించి ఉంటారు. ఈ విధంగా నా రాజ్యంలో నాలుగు వర్ణాలప్రజలు తమ ధర్మాలను నిర్వహిస్తూ ఉన్నారు అయినా నీవు నన్ను ఆవేశించావు.
నేను వ్యక్తిగతంగా రాజ్యంలోని దీనులు, అనాధలు వృద్ధులు, బలహీనులు, రోగులు, స్తల్రు- వీరందరి పట్ల వివేకంతో ప్రవర్తిస్తాను. దేశ ధర్మాలు, కుల ధర్మాలు విచ్ఛిన్నం అవకుండా కాపాడుతున్నాను. అయినా నీవు నాలో ఎందుకు ప్రవేశించావు?
నా రాజ్యంలో తాపసులు పూజించబడి రక్షింప బడుతారు. వారు నా చేత సత్కరింపబడతారు. నేను ఇతరులకు పెట్టకుండా ఏదీ భుజించను పరస్ర్తిలను తలవను. నారాజ్యంలో బ్రహ్మచారి కానివాడుఎవడూ భిక్షాటన చేయడు. సన్యాసి బ్రహ్మచర్యం పాటిస్తాడు. ఋత్విక్కు కాని వాడు హుతం చెయ్యడు.
అయినా నీవు నాలో ప్రవేశించావు. నేను ఎన్నడూ విద్వాంసులను, తాపసులను వృద్ధులను అవమానించలేదు. నేను ధర్మాన్ని ఆచరిస్తాను. గృహస్థును. అదే విధంగా నా యొక్క పురోహతుడు గొప్ప తపస్సంపన్నుడు. సర్వధర్మాలు తెలిసిన వాడు. నేను దానంతో విద్యను వాంఛిస్తాను. సత్యంతో ధనాన్ని కోరుతాను. సేవించి గురువులను పొందుతాను. మరి ఇలాంటి గుణాలు ఉన్న ననె్నందుకు ఆవహించావు? నాకు నీ వంటి రాక్షసులంటే భయం లేదు.
నా రాజ్యంలో విధవలు లేరు, జూదరి అయిన విప్రుడు లేడు. దొంగ లేడు. అధికారం లేకుండా యజ్ఞం చేయించేవాడు లేడు. ధర్మ కోసం నిరంతరం పోరాడే నాశరీరంలో గాయపడని భాగం లేదు. అలాంటి ధర్మ దత్తమైన నాదేహంలో నువ్వు ప్రవేశించావు. గో, బ్రాహ్మణ, యజ్ఞాలవల్ల నాప్రజలు నిరంతరం నా శుభాన్ని కోరుతారు. మరి నువ్వెలా ప్రవేశించావు’’ రాజు అప్పటి వరకూ విశదీకరించి తన రాజ్యం గురించి, పాలన గురించి, ప్రజలు ధర్మబుద్ధి గురించి, సకల వివరాలు వౌనంగా అతని లోపలకి ప్రవేశించి అన్ని వింటున్న రాక్షసుడు అప్పుడు రాజుతో ఇలా అన్నాడు.
‘స్ర్తీల వ్యభిచారం వలన రాజులు చేసే అక్రమాల వల్ల విప్రుల కర్మ దోషం వల్ల ప్రజలకు భయం కలుగుతుంది. అటువంటి రాజుల రాజ్యంలో వర్షాలు పడవు, ప్రాణం తీసే రోగాలతో ప్రజలు బాధపడతారు. వారు ఎప్పుడూ యుద్ధ భయంతో ఆకలి భయంతో జీవిస్తూ ఉంటారు.
విప్రులు సంయమనంతో ఎక్కడ ఉంటే అక్కడ యక్ష రాక్షస పిశాచాల వల్ల, అసురుల వల్ల ఏ భయమూ ఉండదు. నీవు సర్వావస్థలలోను ధర్మాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలను పాలించావు. కనుక ఓ మహారాజా నీవు ఇంటికి వెళ్ళు.
నీకు శుభమగుగాక. గో, బ్రాహ్మణులను ప్రజలను రక్షించే రాజుకు రాక్షసుల వల్ల అగ్నివల్ల భయం ఎక్కడిది? ఏ రాజు ముందు శుభాశ్శీసులు చేస్తూ పలుకుతూ వేద బ్రాహ్మణులు నడుస్తారో, ఎవరికి బ్రాహ్మణుడు ఒక ముఖ్యమైన బలమో ఎవరి ప్రజలు అతిధులను ఆదరించటంలో ప్రియంకలిగి ఉంటారో, ఆరాజులు స్వర్గాన్ని జయిస్తారు. ఈ మాటలు కైకయ రాజుతో చెప్పి రాక్షసుడు రాజు దేహాన్ని విడిచి పెట్టి వెళ్ళి పోయాడు.
-ఇంకావుంది

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి