డైలీ సీరియల్

అనంతం-46

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమె పరుగులంకించుకుంది.
వెంట పడి తరుముతూ పిలుస్తూనే ఉన్నాడు.
పిల్చినకొద్దీ వేగం పెంచి పరుగుతీస్తున్నది.
‘‘శాందినీ...శాందినీ’’ అంటూ తరుముతూనే ఉన్నాడు.
ముందు చాంద్‌నీ... ఆమె వెనుకే రాగ్యా..
ఇద్దరూ పరుగు పందెంలో జయించి తీరాలన్నట్టు పరుగులు తీస్తూనే ఉన్నారు!
అడవి పక్షులు కళ్ళువిప్పార్చి, వింతగా చూస్తున్నాయి.
ఉడుతలూ, కుందేళ్ళూ పొదల్లో నక్కి వాళ్ళనే చూస్తున్నాయి.
అది పరుగు పందెంకాదని, జీవన్మరణ పోరాటం అనీ వాటికి తెలియదు!
‘‘శాందినీ’’ అని పిలుస్తూ రాగ్యా క్షణక్షణానికీ దగ్గరికొస్తున్నాడు.
సర్వశక్తులూ కూడగట్టుకొని చాంద్‌నీ పరుగులు తీస్తూనే ఉంది.
రాగ్యా దగ్గరికొస్తున్నాడు!
ఇప్పుడేం చెయ్యాలి?
రాగ్యానెలా తప్పించుకోవాలి?
ఇంకా లోతట్టు అడవిలోకి వెళ్ళాలి. రాగ్యాకి చిక్కకండా పారిపోవాలి. అడవిలో అదృశ్యం కావాలి!
ఒకవేళ అడవిలో క్రూరమృగాలు తారసపడితే?
రాగ్యానుంచి వచ్చే ప్రమాదంకన్నా, క్రూరమృగాల ప్రమాదం పెద్దదేమీకాదు!
రాగ్యాకి చిక్కితే మానం, మర్యాద పోతాయి.
క్రూర మృగాలకు చిక్కితే కేవలం ప్రాణంపోతుంది!
ఇంకా పరుగువేగం పెంచింది చాంద్‌నీ..
బాణంలా దూసుకొని పోతోన్నది చాంద్‌నీ.
లాభం లేదు!
రాగ్యాదగ్గరికొస్తున్నాడు..
క్షణమో- అరక్షణమో!
దగ్గరికొచ్చాడు.. పట్టుకుంటాడు..
ఇక, అరక్షణం కూడా ఆలస్యం లేదు..
రాగ్యా చెయ్యి పట్టుకోపోతే, అతనికా అవకాశం ఇవ్వకుండా ప్రక్కకు దూకింది.
ఓ చెట్టుకొమ్మకి వ్రేలాడుతున్న తేనెపట్టును గాఢంగా కౌగిలించుకుంది!
ఆ హఠాత్సంఘటనకి రాగ్యా విస్తుపోయాడు!
అది అతను ఊహించని పరిణామం!
తేనెటీగలు చాంద్‌నీ శరీరమీద మూగాయి అప్పటికే!
ములుకులతో ఆమె వొళ్ళంతా తూట్లు పొడుస్తున్నాయి!
శరీరం రక్తంతో తడిసిపోతోన్నది!
ఆమెకప్పుడు ఎంత హాయిగా ఉందో!?
జోగినిగా మారి, కాముకులైన మానవ మృగాలకు శరీరాన్ని అప్పగించి, రసికులకు సుఖాలు అందిస్తూ, నికృష్టంగా బ్రతికేకన్నా, - పవిత్రంగానే రుూ భౌతిక దేహం తేనెటీగలకు ఆహుతి కావాలి!
మైల పడకూడదు.
అంతకన్నా హాయి, ఆనందం ఏముంటుంది?
రాగ్యా నిస్సహాయంగా నిలబడి పోయాడు!
అతని కళ్ళవెంట కన్నీళ్ళు ధారాపాతంగా కార్తున్నాయి. ఏమీచెయ్యలేక, చూస్తూ ఉండలేక కుమిలిపోతున్నాడు.
అప్పుడప్పుడూ తేనెటీగలు రాగ్యామీద కూడా దాడిచేస్తున్నాయి.. కసితీరా కుడుతున్నాయి! చాంద్‌నీ దగ్గరికే వెళ్ళనివ్వటం లేదు.
చాంద్‌నీని రక్షించే మార్గమేదీ లేదు!
ప్రాణ సమానమైన చాంద్‌నీ కళ్ళముందే తేనెటీగల బారినపడి,- శరీరమంతా తూట్లుపడుతూ... రక్తం వోడుతూ.. మాంస ఖండాలు రాలిపడుతూ..
ఎంత దారుణంగా వుందో- ఆ దృశ్యం!
చాంద్‌నీ బాధతో కనీసం ఆర్తనాదాలు చెయ్యదేం?
రక్షించమని ప్రాధేయపడదేం?
ఒక్క మూలుగైనా మూలగదేం?
నీచం కన్నా మరణం మేలనుకున్నదా చాంద్‌నీ?
తేనెటీగలకు దూరంగా కూర్చొని, అశ్రునయనాలతో అటువైపే చూస్తూ హృదయ విదారకంగా రాగ్యా ఏడుస్తున్నాడు.
క్షణాలు దొర్లిపోతోన్నాయి. నిమిషాలు గడచిపోతోన్నాయి..
మంచివాడి మనసులా కాలం కరిగిపోతోన్నది!
***
ఎమ్మెల్లే, గరుడాచలం గుడారంలోనే ఉన్నారు.
వాళ్ళకి రక్షణగా కొంతమంది అక్కడే వుండి, మిగిలిన వాళ్ళంతా నల్లకొండ దగ్గరికి వెళ్ళారు.
అక్కడ ఏం జరుగుతున్నదో వార్తలు అందుతున్నా వాళ్ళకింకా తృప్తి తీరటం లేదు.
అక్కడికి వెళ్ళి స్వయంగా అన్నీ పరిశీలించాలని వుంది!
కానీ, సెక్యూరిటీ దృష్టిలో వుంచుకొని ఆగారు.
ఎమ్మెల్లే విషయం ఎలావున్నా, గరుడాచలం మనసంతా కొండ దగ్గరే వుంది! ఆలోచనలతో సతమతవౌతున్నాడు!!
కానిస్టేబులు కనకయ్య బాగా నటించాడా?
అతనికి దేవర పూనాడంటే జనం నమ్మారా?
చాందినీని జోగిన్ని చెయ్యటానికి ఒప్పుకున్నారా?
రాగ్యా ఏమంటున్నాడో?
అత్యాశకుపోయాడు! చాంద్‌నీ అతనికే స్వంతం కావాలనుకున్నాడు. అందుకోసం వెంపర్లాడాడు.
ఆ వెంపర్లాటలో స్థాయి మరచిపోయి పెద్దవాళ్ళతో చేతులు కలిపాడు. చెప్పిందిచేశాడు.. తనవంతు పాత్ర పోషించి సహకరించాడు.
చాంద్‌నీని జోగిన్ని చెయ్యాలంటే ఒద్దనే్లదు రాగ్యా!
అది వాడి తప్పేకదా!
ప్రణాళిక సిద్ధంచేసి, ఎమ్మెల్లే సహకారం పొంది, కర్చుకూ శ్రమకూ ఓర్చి, దాన్ని జోగిన్ని చెయ్యటం రాగ్యాకి అప్పగించటానికా?
కనె్నరికం వాడుపెట్టి, ఎంగిలిపడ్డ చాంద్‌నీని అనుభవించటానికి పిచ్చివాడ్నికాదు!
పైగా, దానికి ఇవ్వాల్సిన బంగారం, బట్టలు, డబ్బు- అంతాతనే ఇచ్చాడు!
ఇతరుల డబ్బుతో సుఖాలు పొందాలనుకోవటం రాగ్యా తప్పుకాదూ?
పాపం-
రాగ్యాగాడు ఖంగుతిని ఉంటాడు!
గరుడాచలం కనె్నరికం పెట్టాలని దేవర పూనకంలో వున్న కనకయ్య అడవి పుత్రులకు చెప్పగానే రగిలిపోయి ఉంటాడు!
జరిగిన మోసం తెలుసుకొని ఏమీచెయ్యలేక, చాందినీని వొదులుకోలేక, సతమతమయ్యుంటాడు!
ఏం చేస్తున్నాడో? ఎక్కడున్నాడో రాగ్యా?
జాలివేస్తున్నది.
జాలి పడకూడదనీ అనిపిస్తున్నది!
గరుడాచలం ఉన్నట్టుండి పెద్దగా నవ్వాడు.
‘‘ఎందుకలా నవ్వావు’’ ఎమ్మెల్లే అడిగాడు.
‘‘రాగ్యా గుర్తొచ్చి.’’
‘‘వాడొచ్చి, నాకు ఫిర్యాదుచేస్తే ఏంచేస్తానో తెలుసా?’’
‘‘తెలుసు’’అన్నాడు గరుడాచలం నవ్వుతూ.
‘‘ఏం తెలుసు.’’
‘‘తీవ్రంగా ఖండిస్తావు.’’
‘‘అంతేనా’’.
‘‘విచారణకి కమిటీ వేస్తావు.’’
(ఇంకా ఉంది)

-గోపరాజు నాగేశ్వరరావు