డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు -111

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

త్రేతా ద్వాపర యుగాల సంధికాలంలో ఒకసారి ఘోర అనావృష్టి కలిగింది. అది పండ్రెండు సంవత్సరాల దాకా ఉంది. త్రేతాయుగం సమాప్తం అయ ద్వాపర యుగం ప్రారంభం అయ్యే సమయానికి జన సంఖ్య బాగా పెరిగిపోయంది. వర్షాలు లేకపోవటం వలన తినడానికి ఏ ఆహారపదార్ధాలు పండలేదు. ఇంద్రుడు వానలు కురిపించలేదు. గురువు వక్రించాడు. చంద్రుడు దక్షిణ మార్గాన సంచరించసాగాడు. ఆ సమయాన మేఘాలు లేవు. ఇక వానలు ఎక్కడివి? నదులలో నీరు ఇంకిపోసాగింది. కొన్ని నదులు కన్పించకుండా పోయాయ. సరస్సులు, నదులు, సెలయేళ్లు, బావులు, నీరు లేక తమ శోభను కోల్పోయాయ. వ్యవసాయం, గోరక్షణ పాడైపోయాయ. ఎక్కడ చూసినా ఆకలితో ఉన్న ఆర్తనాదాలే. ఇళ్ళు, గ్రామాలు పాడైపోయాయ.. ఈ కారణాల వల్ల నేలమీద జనం తగ్గిపోయారు. ఆవులు, గొర్రెలు, మ్ఢేఁలు లేకుండాపోయాయ. జనులు ఆహారం కోసం పరస్పరం కొట్టుకుంటున్నారు. ఇలాంటి భయానక సమయంలో ధర్మం నశించింది.
ఆ సమయంలో విశ్వామిత్ర మహర్షి ఆకలి బాధను తట్టుకోలేక, అగ్నినీ, ఆశ్రమాన్ని వదిలి తినడానికి ఏదైనా ఆహారం దొరుకుతుందేమో అని వెతుకుతూ తిరుగసాగాడు. అలా తిరుగుతూ విశ్వామిత్రుడు ఒక ఛండాలుర వాటికను చేరాడు. అక్కడ ఇంటి ముందు కుండలు అన్నీ పగిలి పడి ఉన్నాయ. శవాల గుడ్డ పీలికలు ఇళ్ళలో వ్రేలాడుతున్నాయ. శవాల నిర్మాల్యంతో ఆ ఇళ్ళు అలంకరించబడి ఉన్నాయ పాము కుబుసాలు మూలల్లో ఆ ఇళ్ళకు వ్రేలాడుతున్నాయ. కోడి కూతలు, గాడిద అరుపులు బాగా విన్పిస్తున్నాయ. అక్కడి జనులు పెద్దపెద్దగా అరుస్తూ పరస్పరం కలహించుకుంటున్నారు. అక్కడి దేవాలయాలో గుడ్లగూబల అరుపులు విన్పిస్తున్నాయ. ఆ మొత్తం వాతావరణం అంతా చూసేవారికి రోత కలిగిస్తున్నది. భయం కలిగిస్తున్నది.
ఆ ప్రదేశంలో తినడానికి ఏదైనా దొరుకుతుం దేమోనని విశ్వామిత్రుడు వెతుకసాగాడు. ఎక్కడ యాచించినా మాంసము ముక్కకాని, అన్నంకాని, చివరకు ఒక పండు కూడా దొరకలేదు. ఆకలికి తాళలేక నీరసంతో విశ్వామిత్రుడు నేలపై పడిపోయాడు. అతను ఇలా ఆలోచించసాగాడు’’. ఇప్పుడు నేను ఏం తిని ప్రాణం నిలబెట్టుకోవాలి? చావు నుండి ఎలా తప్పించుకోవాలి?’’ అదే సమయంలో ఆ చండాలుని ఇంటిలో కత్తితో నరకబడిన కుక్క తొడ మాంసపు ముక్కలు విశ్వామిత్రుడు చూచాడు. అతను ఇలా ఆలోచించాడు. ‘‘ఈ ముక్కను నేను ఇప్పుడు దొంగతనం చేయాలి. ప్రాణ రక్షణ కోసం బ్రాహ్మణుడు ఇలా గొప్పవారి దగ్గరైనా హీనుల దగ్గరైనా దొంగతనం చేయటం అధర్మం కాదు. కనుక ఈ ఛండాలుని ఇంట కుక్క మాంసం దొంగిలించటం పాపం కాదు’’ ఇలా నిర్ణయంచుకుని అతను అర్ధరాత్రి ఛండాలుని ఇంటిలోకి ప్రవేశించాడు. అక్కడ అతను కుక్కతొడ మాంసం ముక్కను చూశాడు. వాటికలో అంతా నిద్రిస్తున్నారు.
ఛండాలుడు కూడా నిదురించినట్లున్నాడు. అతని ఆకారం చూడడానికి భయంకరంగా ఉంది. అతను మేల్కొనే ఉన్నాడు. అతను ముని రాకను గమనించి కఠినంగా ఇలా అన్నాడు. ‘‘్ఛండాల వాటిక అంతా నిదురపోతోంది. ఎవరు ఇప్పుడు కుక్కతొడను దొంగిలిస్తున్నాడు. మరొక నేను మేల్కొనే ఉన్నాను. నిదురపోలేదు. నువ్వు దారుణంగా చస్తావు.’’
అతని మాటలు విని విశ్వామిత్రుడు తను చేస్తున్న హీనకర్మకు సిగ్గుపడి, తలదించుకుని మెల్లగా ఇలా అన్నాడు ‘‘చిరంజీవీ! నేను విశ్వామిత్రుడను. చాలా ఆకలితో నీ ఇంటికి వచ్చాను. నన్ను అర్ధం చేసుకో, చంపకు’’.
మహర్షి మాటలువిన్న ఛండాలుడు కంగారుపడి లేచి విశ్వామిత్రుని దగ్గరకు వెళ్ళి నమస్కరించాడు. ఇలా అడిగాడు- ‘‘మహాత్మా! ఇంత రాత్రి వేళ ఇక్కడికి ఏంపని మీద వచ్చారు?’’
మహర్షి మెల్లగా ఇలా అన్నాడు - ‘‘నేను చాలా ఆకలితో ఉన్నాను. ప్రాణాలు పోతున్నాయ. కుక్కతొడను అపహరిస్తున్నాను. ఆకలి బాధతో ఈ నీచ కార్యానికి దిగాను. ఆకలి తీర్చుకోవడానికి ఏ పని చేయడానికి సిగ్గు ఉండదు. స్పృహ తప్పేటట్లు ఉంది. కనుక తినదగినదేదో, తినకూడనిదేదో అన్న ఆక్ష్మిఊచన కూడా లేదు. ఇది అధర్మమని తెలుసు. అయనా కుక్క తొడను దొంగిలిస్తున్నా. అగ్ని దేవతలకు పురోహితుడు. పవిత్ర యాగ ద్రవ్యాలను గ్రహించేవాడు అయనా సర్వ భక్షకుడు అయ్యాడు. అలాగే బ్రాహ్మణుడనైన నేను ఆకలి తీర్చుకోవటానికి సర్వ భక్షకుడనౌతాను, కాని ధర్మాన్నిబట్టి నేను బ్రాహ్మణుడనే’’.
అప్పుడు చండాలుడు అతనితో నమ్రతగా ఇలా అన్నాడు-
‘‘మహర్షీ’’! నా మాటవిని నీ ధర్మం చెడని విధంగా కర్తవ్యాన్ని నిర్ణయంచుకో. నేను చెప్పే ఈ ధర్మ వచనం ఆలకించు. కుక్క నక్క కన్నా హీనమైనదని పండితులు అంటారు. దాని శరీరంలో తొడ భాగం అన్నిటికన్న హీనం. నీవు చేస్తున్న పని తగనిది. తినదగని దానిని దొంగిలించడం ధర్మనిందితమైన పని. నీ ప్రాణాలు రక్షించుకోవడానికి ఇంకో మార్గం వెతుకు. మాంస లోభంతో నీ తపస్సును నష్టపరచకు. నీవు ధర్మాత్ములలో శ్రేష్ఠుడవు’’.
చండాలుడు ఇలా అనగానే ఆకలితో ఉన్న విశ్వామిత్రుడు ఇలా సమాధానం ఇచ్చాడు - ‘‘ఆహారం లేకుండా ఇలా తిరుగుతూ చాలాకాలం గడిపాను. ప్రాణాలు నిలుపుకునేందుకు నాకు ఒక ఏ ఉపాయం తోచటం లేదు. ఆకలితో చనిపోతున్నవాడు ఏదో మరొక ఉపాయంతో ప్రాణాన్ని రక్షించుకోవాలి. తర్వాత ధర్మం ఆచరించవచ్చు. క్షత్రియులకు పరిపాలన ధర్మం, బ్రాహ్మణులకు అగ్నికి సంబంధించినది ధర్మం. బ్రహ్మ స్వరూపమైన అగ్ని నా బలం. కనుక ఆకలి తీరడానికి అగ్నిలాగ నేను ఏదైనా తింటాను. బ్రతకటానికి ఏది అవసరమో అది చేయాలి. మరణం కన్న జీవనం మేలైనది. జీవించి ఉంటేనే ధర్మం ఆచరించగలం. అందువల్ల నేను బ్రతకాలనుకుంటున్నాను. తర్వాత నేను నా తపస్సుతో, విద్యతో ఈ అశుభకర్మలను నశింపచేస్తాను’’.
ఛండాలుడు ఇలా అన్నాడు.‘‘దీనిని తినటం ద్వారా నీకు దీర్ఘాయువు కలుగదు. ప్రాణాలూ నిలువవు. తృప్తి కలుగదు. మరేదైనా భిక్ష కోరుకో. కుక్కను తినకూడదు. కుక్క మాంసంపై మనసు పడకు. బ్రాహ్మణులు కుక్క మాంసం తినకూడదు’’.
-ఇంకావుంది

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి