డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు -112

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్పుడు విశ్వామిత్రుడు ఇలా అన్నాడు - ‘‘ఈ దుర్భిక్ష కాలంలో మరో మాంసం దొరకడం సులభం కాదు. నా దగ్గర డబ్బులేదు. ఆకలి బాధతో ఉన్నాను. గతిలేదు. ఈ కుక్క మాంసం పంచభక్ష్య పరమాన్నం అని తలుస్తాను’’.
ఛండాలుడు ఇలా అన్నాడు - బ్రాహ్మణ, క్షత్రియ, వైశయులు పంచనఖాలు కల ప్రాణులని, ఆపద సమయాల్లో తినవచ్చని శాస్త్రాలు చెప్తున్నాయ. తినదగని వాటిపై మనసు పెట్టవద్దు’’.
ఛండాలుని మాటలకు విశ్వామిత్రుడిలా అన్నాడు. ‘‘ఆకలితో ఉన్న అగస్త్యుడు వాతాపి అనే రాక్షసుని మాంసాన్ని భక్షించాడు. అదే విధంగా ఆపత్కాలం కనుక నేను కుక్క తొడ మాంసం తినవచ్చు’’.
ఛండాలుడు - ‘‘స్వామీ! ఇంకేదైనా భిక్ష తెచ్చుకో. కుక్క మాంసం తినడం నీవంటి వారికి తగదు. లేదా స్వేచ్ఛగా కుక్క తొడను తీసుకొని పో! కాని ఇది మాత్రం నీకు తగని పని’’.
విశ్వామిత్రుడు - ‘‘్ధర్మాచరణకు శిష్టులే కారణము. కనుక వారినే నేనూ అనుసరిస్తాను. కుక్క తొడనే గొప్ప ఆహారంగా భావిస్తాను’’.
ఛండాలుడు ‘‘ఆ సత్పురుషుడు ఎవరో ఆచరించినది సనాతన ధర్మమైపోదు. కనుక నీవు ఇక్కడ చేయరాని పని చేయకూడదు. ఏదో నెపం పెట్టుకుని అశుభకార్యం చేయవద్దు’’.
విశ్వామిత్రుడు - ‘‘ఋషి అయన వాడు ఎవ్వడూ పాతకాన్ని కాని, నిందార్హమైన పనికాని చేయడు. నా దృష్టిలో కుక్క, జింక సమానమే. కనుక కుక్క తొడను తింటాను’’.
చండాలుడు అతని మాటలకు ఆశ్చర్యపోయ మరల అతనిని ఆ కార్యం నుండి మరలించటానికి ఇలా అన్నాడు - ‘‘ఆ సత్పురుషుడు బ్రాహ్మణుల రక్షణ కోసం వారి అభ్యర్థన మేరకు ఆ స్థితిలో చేసిన అసురమాంస భక్షణ ధర్మమే. అది పాపం కొంచెం కూడా లేని ధర్మం. గురువులయన బ్రాహ్మణులను అన్ని ఉపాయాలతోనూ రక్షించాలి’’ అతని మాటలకు విశ్వామిత్రుడు ఇలా అన్నాడు- ‘‘ఈ బ్రాహ్మణుని శరీరం నాకు మిత్రుడు. ఈ శరీరాన్ని కాపాడుట కోసమే నేను మాంసాన్ని అపహరిస్తున్నాను. కనుక ఈ అసుర కర్మ గురించి నేను భయపడను’’.
చండాలుడు అతని మాటలకు నివ్వెరపోయ మరల ఇలా అన్నాడు. ‘‘సత్పురుషులు ప్రాణాన్ని సునాయాసంగా పరిత్యజిస్తారు. కాని తినదగనివి తినటానికి ఇష్టపడరు. అందువల్లనే వారు కోరిన కోర్కెలు తీరుతాయ. కనుక నీవు కూడా ఉపవాసం చేత నీ కోర్కెలను తీర్చుకో.’’
విశ్వామిత్రుడు - ‘‘ఉపవాసాలతో మరణిస్తే తరువాత ఏవౌతుందో ననే అనుమానం. అభక్ష్య భక్షణం వలన నిస్సంశయంగా పుణ్య కర్మలు నశిస్తాయ. కాని శరీరం బ్రతుకుతుంది. అప్పుడు మళ్ళీ వ్రతాలు చేసి శమాదులు అభ్యసించి ప్రాయశ్చిత్తం చేసుకొని పాపాలను తొలగించు కోవచ్చు. ప్రాణ రక్షణ కోసం చేస్తున్నాం. కనుక ఇది పుణ్య కర్మయే. కోరికతో కుక్కమాంసం తింటే అది పాపం, దోషం. నేను ఈ పని చేసినా నీలా ఛండాలుడిని కాదు. ఎందుకంటే ఈ దోషానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను కనుక’’.
అప్పుడు ఛండాలుడు ఇలా అన్నాడు - ‘‘మహర్షివయన నీవు కుక్క మాంసం తినడానికి సిద్ధపడటం చాలా విచారకరమైన విషయం. ఈ పాపం నుండి నిన్ను రక్షించాలి. నేను బ్రాహ్మణుణ్ణి కాను కనుక నీకు పదేపదే సలహా ఇవ్వటం కూడా తప్పే’’.
విశ్వామిత్రుడు- ‘‘తటాకంలో కప్పలు అరుస్తున్నా గోవులు నీరు త్రాగుతూనే ఉంటాయ. ధర్మోపదేశం చేయడానికి నీకు అధికారం లేదు. నిన్ను నీవు ప్రశ్నించుకునే స్థితి కూడా వద్దు’’.
అతని మాటలు విని ఛండాలుడు ఇలా అన్నాడు. ‘‘బ్రాహ్మణా! స్నేహబావంతో నీకు సలహాలి స్తున్నాను. నాకు నీపై జాలి కలుగుతోంది. శ్రేయస్సును కలిగించే నా వాక్కులు వినండి. లోభంతో పాపపు పనులు చేయవద్దు.’’
విశ్వామిత్రుడు - ‘‘నీవు నాకు స్నేహితుడవైతే, నా సుఖాన్ని కోరుకుంటే, ఈ ఆపదనుండి నన్ను రక్షించు. నాకు నా ధర్మమేదో చక్కగా తెలుసు’’.
ఛండాలుడు - ‘ఈ అభక్ష్య పదార్థాన్ని నా చేతులతో నేను ఇవ్వలేను. అలా అని దాన్ని నీవు దొంగిలిస్తూ ఉంటే చూడలేను. ఎందుకంటే అలా చేస్తే ఇస్తున్న నాకూ బ్రాహ్మణుడవై స్వీకరిస్తున్న నీకూ పాపం తగులుతుంది’’.
విశ్వామిత్రుడు - ‘‘ఇప్పుడు నేను పాపకర్మ చేసినా ప్రాణాలు నిలిచిన తర్వాత గొప్ప పవిత్ర కర్మలు చేస్తాను. దానితో నా పాప ప్రక్షాళనం అవుతుంది. నేను మరల ధర్మ ఫలాన్ని పొందుతాను. ఉపవాసాలతో ప్రాణాలు పోగొట్టుకోవడం; జీవించి ధర్మాచరణర చేయడం - ఈ రెండింటిక్ష్మిఊ ఏది మంచిదో చెప్పు?’’
ఛండాలుడు ఇలా సమాధానం చెప్పాడు - ‘‘కులధర్మాలు పాటించే సమయంలో ఎవరికి వారే సాక్షి. ఇక అభక్ష్య భక్షణలోని పాపమేమిటో నీకే తెలుసు. కుక్క మాంసానే్న భక్షణీయ పదార్థంగా అంగీకరించే వానికి ఈ లోకంలో పరిత్యజించదగినది ఏదీ ఉండదు.’’
విశ్వామిత్రుడు - ‘‘నీ దగ్గర దానం తీసుకోవడం, తినకూడనిది తినడం - ఈ రెండూ తప్పే. అయతే శాస్త్రాలలో ఆపత్సమయాలలో పాటింపదగినది వేరుగా ఉంటాయ. ఇక్కడ హింసాదోషం కాని అసత్య దోషం కాని లేవు. ఒక్క అభక్ష్య భక్షణ దోషం మాత్రమే ఉంది. అది కూడా ఆత్మ రక్షణ కోసం చేసినది కనుక తప్పులేదు. ఇంకా దీని వలన మహా పాతకం వస్తుంది. ఆగేందుకు ఏ ప్రమాణం లేదు. అయతే పట్టుబట్టి కావాలని కుక్క మాంసం తింటే దానికి తగిన దండన పొందవలసి వస్తుంది.
విశ్వామిత్రుడు తన సలహా వినకున్నా చండాలుడు తాను చెప్పవలసింది చెప్పి అక్కడినుండి వెళ్లిపోయాడు. విశ్వామిత్రుడు ఆ మాంసాన్ని తీసుకుని అరణ్యంలో తన ఆశ్రమానికి పోయ భార్యతో సహా ఆ మాంసాన్ని తీసుకోబోయాడు. అప్పుడు అతనికి ఒక ఆలోచన కలిగింది. ఆ కుక్క మాంసాన్ని శాస్త్రోక్తంగా దేవతలకు నివేదించి తరువాత తాను తినాలనుకున్నాడు. అప్పుడు అతను వేదోక్త విధానంతో అగ్ని స్థాపన చేసి, ఇంద్రుని అగ్నిని ఉద్దేశించి స్వయంగా చరువును వండి సిద్ధం చేశాడు. తర్వాత దైవ కర్మను, పితృకర్మను ప్రారంభించాడు. ఇంద్రాది దేవతలను ఆవాహన చేసి విధి పూర్వకంగా ఎవరి భాగాన్ని వారికి అర్పించాడు. అదే సమయంలో ఇంద్రుడు జనులందరినీ బ్రతికిస్తూ ఓషధులను ఉద్భవింప చేస్తూ వానలు కురిపించాడు. విశ్వామిత్రుడు కూడా దీర్ఘకాలం చేసిన తపస్సు చేత తన పాపాలను దహింపచేసికొని ఉన్నతమైన స్థితిని పొందాడు. అతను హవిస్సు అయన కుక్క మాంసాన్ని తినకముందే దేవతలనూ, పితరులనూ సంతోషపెట్టాడు. ఈ విధంగా జ్ఞానులు, తాపసులు, ఆపత్కాలంలో దీనత్వానికి లోనుగాక ఉపాయాల ద్వారా తమ్ము తాముఉద్ధరించుకుంటారు అనడానికి ఈ కథ చక్కటి ఉదాహరణ.
-ఇంకావుంది

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి