డైలీ సీరియల్

అనంతం-48

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘శాందినీ మీన ఆశతో!’’
‘‘మరి, గరుడాశలఁవ్తో కనె్నరికఁ వెట్టియ్యాలల్నాడుగా, దేవర’’
‘‘అదే మాయ.. అదే గరుడాశలఁవ్ మాయ! శాందినీ మీద వాడికీ కన్నుంది. దేవర నాటకం ఆడిపిచ్చి వాడు కనె్నరికఁ వెట్టాలని కనకయ్యతో చెప్పిచ్చాడు. నన్నుగూడా మోసం జేసిండు. శాందినీని జోగిన్ని సెయ్యాలని దేవరేఁవీ సెప్పడు. సెప్పింది కనకయ్యగాడు’’ అని రాగ్యా చెప్పాడు.
‘‘నినె్నట్టా నమ్మాలి’’అని కాళీచరణ్ అడిగాడు.
‘‘కనకయ్యగాడికి సీపులిక్కర్దాపిచ్చింది నేను. సీకుల్దినిపిచ్చింది నేను.. కావాల్నంటే పొదెనకఁవాల సూడండి- ఎన్ని ఖాళీ సాసాలుండయ్యో’’ అన్నాడు రాగ్యా.
ఎవ్వరో పొదవెనక్కు వెళ్ళారు. ఖాళీ సీసాలు వెదకి తెచ్చారు.
‘‘రాగ్యాసెప్పింది నిజ్జఁవే’’ అన్నారు, వాటిని చూపిస్తూ.
భయంలో ఆందోళనలో దేవర అప్పుడొక తప్పుచేశాడు!
‘‘అయ్యన్నీ నేన్దాగిన సీసాలు గాదు- రాగ్యాగూడా తాగిండు’’ అన్నాడు.
అనాలోచితంగా కనకయ్య అన్న మాటల్లోనే బలమైన సాక్ష్యం దొరికింది! అతనికి దేవర పూనింది అబద్ధం అని తేలిపోయింది.
దాని పర్యవసానమే చాంద్‌నీ మరణం!
దాని పర్యవసానమే చాంద్‌నీ బలిదానం!!
అడవి పుత్రులు ఆవేశంతో రెచ్చిపోతోన్నారు.. సాంప్రదాయక ఆయుధాల మీద పిడికిళ్ళు మళ్ళీ బిగుసుకొంటున్నాయి.
కనకయ్య పరిస్థితి అర్థమైపోయింది! క్షణం ఆలస్యంచేసినా అంతంకావటం తప్పదన్న నిర్ణయానికొచ్చాడు. కానిస్టేబుళ్ళకి సైగ చేసాడు!
కానిస్టేబుళ్ళు తేరికొని ఆయుధాలు ఎక్కుపెట్టేలోగా-
ప్రతిధ్వనిస్తున్న ధ్వని తరంగాలకు నల్లకొండ సుళ్ళుతిరుగుతూ ఫెటేల్ ఫెటేల్మని పేలిపోతోన్నదా,
యముని మహిషపు లోహ ఘంటల గర్జారావం వినిపిస్తున్నదా,
యుగాంత జ్వాలల్లో దహనమయ్యే అడవి అగ్నికీలకు ఆహుతౌతూ క్రూరమృగం చేస్తున్న ఆర్తనాదమా,
అన్నట్టు-
బీభత్స భయానకంగా నగ్గూరాం నోటివెంట పొలికేక వినిపించటం,-
ఆ వెంటనే కానిస్టేబులు కనకయ్య తల మొండెంనుంచి తెగిపడి నేలమీద దొర్లటం కనిపించింది!
‘‘బలెన్నిఁవ్ గలపండి’’అన్నాడు నగ్గూరాం.
అందరూ అతనివైపు చూసారు!
నగ్గూరాం చేతిలో వున్న వేట కొడవలి రక్తాశ్రువులు రాలుస్తున్నది!
రాగ్యా శరీరంనుంచి రక్తం పిచికారి చిమ్ముతున్నది.
ఏం జరిగిందో అర్థమయ్యేలోగా-
డప్పులు మ్రోగుతున్నాయి..
తప్పెట్లు తాళాలూ వినిపిస్తున్నాయి.
కొమ్ము బూరాలు ధ్వనిస్తున్నాయి.
హాహాకారాలు చేస్తూ అడవిపుత్రులు కోపావేశాలతో వూగిపోతూ, ఆయుధాలు గాల్లోతిప్పుతూ, రణన్నినాదాలు చేస్తూ..
జన సంద్రం పోటెత్తింది!
‘‘ఇదంతా అడవుల్నించి మనల్ని యళ్ళనూకే పతకంలో ఒకటి. శాందినీని ఇయ్యాళ అట్టాజేసినోళ్ళు, రేపు యింకోర్ని సెయ్యరన్న నమ్మకఁవేటి? అడవి మనది. అడివి సంపద మనది. మన బాధలు మనవి.. ఎవ్వురో వొచ్చి మన పిలకాయల్ని సంపుతా, జీవనఁవ్ లేకుంటా శాత్తావుంటే వూకుంటే లాభం లేదు.. యల్దాఁవ్ పదండి. గరుడాశలఁవ్ యవ్వారఁవ్ గూడా తేల్సాలి’’అన్నాడు అప్పుడే అక్కడికి చేరుకున్న గోపీనాయక్.
‘‘నిజ్జిఁవే! ఇది మనల్ని యళ్లనూకే పతకఁవే’’ అన్నారందరూ.
దండు కదిలింది.
అడవి పుత్రుల దండు కదిలింది.
డప్పులు తప్పెట్లు తాళాలు కొమ్ముబూరాలు రణసంగీతంలా ధ్వనిస్తూ, శరీరంమీది రోమాలు నిక్కపొడుచుకొంటుంటే-
వాళ్ళంతా సాగరకెరటాలై ఎగసిపడుతూ, జలపాతమై దూకుతూ, ప్రభంజనమై హోరెత్తుతూ- గుడారాల వైపుకుపోతోన్నారు.
అదో అద్భుత ఘట్టం..
పులుల్ని గోవులు ధిక్కరించే అపూర్వ ఘట్టం.
సింహాలను చిట్టెలుకలు ఎదిరించే సాహస ఘట్టం.
తరాల చరిత్ర తిరగరాసే పోరాట ఘట్టం...
ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవ్వరి ఊహలకూ అందటం లేదు. ఎవరు ముందుగా ఎవరి మీద ఆయుధాలు ప్రయోగిస్తారో అంచనాలకు దొరకటం లేదు.
కనకయ్యకు రక్షణగా మఫ్టీలోవున్న పోలీసు ఉద్యోగులు జన సంఖ్యను చూసి, తమ బలం బలగం చాలదని అడవిపుత్రుల జోలికివెళ్ళే సాహసం చెయ్యలేదు.
వాళ్ళందరూ పొదల్లోదాక్కొని దొంగచూపులు చూస్తూ పరిస్థితులు గమనిస్తున్నారు.
నెమలిగుట్ట దగ్గరికి చేరారు. అడవి పుత్రులు.
ఎర్ర నెమళ్ళు స్వాగతం పలికినట్టుంది!
అడవి పుత్రులు సందేహిస్తూ, ఎందుకో రాగ్యా వైపు చూసారు!
‘‘అయ్యి గూడా గరుడాశలఁవ్ గాడి పతకఁవే! తెల్లకాకులు, ఎర్ర నెమిళ్ళూ దేవర అంపిచ్చినయ్యిగాదు’’ అన్నాడు రాగ్యా.
‘‘పతకఁవేత్తే అయ్యెట్టాగొత్తయ్యి’’అని బాణావతు అడిగాడు.
‘‘రుూరబ్రెహ్వఁవ్‌గోరు సెప్పినయ్యిగావా’’అని కాళీచరణ్ అడిగాడు.
‘‘కాకుల్నీ, నెమిళ్ళనీ పోలీసోళ్ళే వలపన్ని పట్టుకుండారు.. కాకులకి తెల్లరంగూ నెమిళ్ళకి ఎర్ర రంగూ పూసి అడివిలో యిడ్సిపెట్టారు. దేవరాగాదు, రుూరబ్రెహ్వఁవ్‌గోరుగాదు- గరుడాశఁవే సెప్పిండు’’అని చెప్పాడు రాగ్యా.
అందరూ జరిగిన ద్రోహం వంచన తెలుసుకొని ఆవేశంతో రెచ్చిపోతూ అక్కడ్నించి ముందుకుసాగారు.
అప్పుడే-
అడవి పైని ఆకాశం నిండా కారుమబ్బులు క్రమ్ముకున్నాయి.
సన్నగా నూగుల్లా మొదలైన వాన జడివానగా మారింది.
చీకట్లు క్రమ్ముకున్నాయి. మెరుపుల వెల్తుర్లో దారి చూసుకుంటూ అడవి పుత్రుల దండు గుడారాలను సమీపించింది.
* * *
వార్తాహరుడు ఉరుకుపరుగుల మీద ఎమ్మెల్లే గుడారానికి చేరుకున్నాడు.
అతని మొహంలో ఆందోళన, భయం స్పష్టంగా కనిపించింది!
‘‘ఏం జరిగింది’’ అని అడిగాడు ఎమ్మెల్లే.
‘‘చాంద్‌నీని జోగిన్ని చేశారా’’ అని గరుడాచలం అడిగాడు.
‘‘జోగిన్ని చెయ్యటం కాదు, చాంద్‌నీ చచ్చిపోయింది.’’
‘‘వ్వాట్..?’’ గరుడాచలం అదిరిపడ్డాడు.
ఎమ్మెల్లే మొహం పాలిపోయింది.
‘‘ఏం జరిగిందో అంతా వివరంగా చెప్పు’’ ఎమ్మెల్లే అడిగాడు.
(ఇంకా ఉంది)

-గోపరాజు నాగేశ్వరరావు