డైలీ సీరియల్

అనంతం-50

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అంత భయమైతే ఎలా? రక్షణ కోసం నా రివాల్వరు నీ దగ్గరుంచుకో! అవసరమైతే కాల్పులు జరుపు... రెండు పెగ్గుల విస్కీ లాగించావంటే ధైర్యం అదే వస్తుంది’’అని నవ్వుతూ గరుడాచలం చేతికి తన రివాల్వరు అందించాడు ఎమ్మెల్లే.
‘‘బైటేం జరుగుతున్నదో చూసి వెంటనే వచ్చేయ్’’అని ఎమ్మెల్లేతో చెప్పాడు గరుడాచలం.
ఎమ్మెల్లే అలా బైటకి వెళ్ళాడో లేదో తన గుడారంలోకి వెళ్ళాడు గరుడాచలం.
ఎమ్మెల్లే చెప్పింది నిజమే!
రెండుపెగ్గులకే అతనికి కొండంత ధైర్యం వచ్చింది!
ఆఫ్ట్రాల్...
అడవి పుత్రులు ప్రభుత్వ అధికారులు, ఎమ్మెల్లే బస చేసిన గుడారాల మీదే దాడిచేస్తారా? అది జరిగే పనేనా?
గుడారాలకు కాపలావున్న పోలీసు సిబ్బంది దగ్గర తుపాకులున్నాయి!
గుడారాల దగ్గరికి రాగానే కాల్పులు జరుపుతారు.
ఇక, భయపడటం ఎందుకూ?
ఇంకొంచెం ధైర్యంకోసం యింకొంచెం విస్కీ తాగుతూ కూర్చున్నాడు గరుడాచలం.
ఎమ్మెల్లే బైట్నించి ఇంకా లోపలికి రాలేదు.
ఐతేనేం!
ఇప్పుడు తనదగ్గర రివాల్వరుంది. అవసరమైతే కాల్పులు జరిపి తప్పించుకునే అవకాశం వుంది.
అలాంటప్పుడు భయం ఎందుకూ!
మళ్లీ గ్లాసులోకి మందు వొంపుకొని తాగాడు గరుడాచలం.
ఎమ్మెల్లే కూడా గుడారాల బైటికి వెళ్ళాడు. పోలీసు సిబ్బందిని సందర్భాన్నిబట్టి ప్రోత్సహిస్తాడు.
నిజంగా దాడి జరిగితే పోలీసు కాల్పులు జరిగి తీర్తాయి.
కాల్పుల శబ్దం వినిపించగానే తను అలెర్ట్ కావాలి. అంతవరకు కల్పించుకోవటం అనవసరం అనుకొన్నాడు.
జేబులోనుంచి రివాల్వరు బైటికి తీశాడు. టీపాయ్ మీద అందుబాట్లో పెట్టుకొని తాపీగా విస్కీ తాగుతూ కూర్చున్నాడు.
బైట్నించి ఏదో అలజడి మళ్ళీ వినిపించింది!
కొంతసేపటికి ఎమ్మెల్లే గొంతు విప్పి, పెద్దగా-
‘‘ఎవ్వర్నీ విడిచిపెట్టొద్దు! ప్రభుత్వం అంటే ప్రతివాడికీ అలుసై పోయింది! తడాఖా చూపించాలి! తుపాకులు ఎక్కుపెట్టండి’’అంటూ అరుస్తున్నాడు.
గరుడాచలానికి సందేహం కలిగింది!
ఎమ్మెల్లే అలా అరుస్తూ ఆజ్ఞలు జారీచేస్తున్నాడంటే, బైట పరిస్థితి తీవ్రంగా ఉన్నట్టే!
ఇంకా పోలీసులు కాల్పులు జరుపరేం?
అడవిపుత్రుల ఆర్తనాదాలు వినిపించవేం?
రివాల్వరు అందుకున్నాడు గరుడాచలం. పైకి లేచాడు.
గబగబా నడుస్తూ బైటికి వెళ్లి, చుట్టూ చూసాడు!
గుండె నీరయ్యింది!
అడవి పుత్రులు జట్లుజట్లుగా అప్పటికే గుడారాలను చుట్టుముట్టారు. వలయంలా పొంచివస్తోన్న మృత్యువులా కనిపించారు!
గరుడాచలం వెన్నులో చలి మొదలయ్యింది.
ఏం చెయ్యాలి? పోలీసులు కాల్పులు ప్రారంభించరేం? అని మనసులోనే అనుకుంటూ ఎమ్మెల్లేకోసం చూసాడు!
కీ.శే.పెద్దిరెడ్డి కొడుకు ఎమ్మెల్లే పెంటారెడ్డి అప్పటికే గుడారాల్ని దాటి గుబురు పొదల్లోనుంచి దూరంగా పారిపోతూ కనిపించాడు!
‘‘షిట్’’అని పెద్దగా అరిచాడు గరుడాచలం.
భయంనుంచి బైట పడేందుకు రివాల్వర్తో ఒక రౌండు గాలిలోకి కాల్చాడు.
పోలీసు సిబ్బంది ఉలిక్కిపడి చూసారు!
అతను చేసిన తప్పు అదే!
గరుడాచలాన్ని చూసిన అడవి పుత్రులు ఆవేశంతో రెచ్చిపోతూ గుడారాల్లోకి ప్రవేశించారు.
దాడి మొదలైంది.
గరుడాచలం తన గుడారంలోకి వెళ్ళాడు.
‘‘్ఛర్జ్’’అని అరిచాడో పోలీసు అధికారి.
ముందుగా లాఠీఛార్జ్ మొదలుపెట్టారు!
లాఠీ దెబ్బలకు శరీరాలమీద వాతలు తేలుతూ గాయాలౌతున్నా అడవి పుత్రులు వెనక్కు తగ్గటంలేదు. దెబ్బదెబ్బకూ మరింత రెచ్చిపోతూ విరుచుకొని పడుతున్నారు.
క్షణంలో గుడారాల దగ్గర పరిస్థితి గందరగోళంగా తయారైంది!
పోలీసు సిబ్బంది అరుపులు, తోపులాటలూ, అడవి పుత్రుల హాహాకారాలూ...
పరిసరాలు దద్దరిల్లిపోతోన్నాయి.
అన్నివైపులనుంచి అడవి పుత్రులు చుట్టుముట్టారు.
కనిపించిన వాళ్ళను కనిపించినట్టే లాఠీలతో కొడుతూ పరిస్థితి అదుపులోకి తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు పోలీసులు.
వాళ్ళోపట్టాన లొంగేట్టు లేరు.
తెగబడ్డారు. రుూగల్లా మూగుతూ దాడులు చేస్తున్నారు.
అప్పుడు జరిగిందో సంఘటన!
రాగ్యా, నగ్గూరాం, బాణావతు పోలీసుల దృష్టిమళ్ళించి గరుడాచలం గుడారంలోకి దూసుకొనిపోయారు.
అతను వాళ్ళని చూశాడు.
భయంతో వొణికిపోయాడు.
రివాల్వర్ గురిచూసి కాల్పులు ప్రారంభించాడు.
గరుడాచలం దగ్గర రివాల్వరు ఉందన్న విషయం వాళ్ళు గమనించలేదు!
ఎంతకూ అతన్ని మట్టుపెట్టాలన్న ధ్యాసే తప్ప పరిస్థితిని వాళ్ళు గమనించలేదు.
నగ్గూరాం గుండెలోనుంచి తూటాలు దూసుకొని వెళ్ళాయి!
అక్కడే కుప్పకూలి, గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు విడిచాడు..!
గరుడాచలం యింకా కాల్పులు జరుపుతూనే ఉన్నాడు.
రాగ్యా వేటకొడవలితో విజృంభించాడు!
తూటాల్ని తప్పించుకొంటూ, పిల్లిమొగ్గలు వేస్తూ, గాల్లోకి ఎగిరి, పులిలా గరుడాచలం మీదికి దూకాడు.
ఒకేఒక్క వేటు!
గరుడాచలం కనీసం ఆర్తనాదమైనా చెయ్యకుండానే నేలమీదికి దొర్లాడు. శరీరం రక్తం వోడుతోంది.
క్షణాల్లోనే గరుడాచలం ప్రాణాలు వొదిలాడు.
రివాల్వరు కాల్పుల శబ్దం విని అవ్వి పోలీసు కాల్పులని అడవిపుత్రులు ముందుగా భావించారు.
అంతలో ఎవ్వరో వచ్చారు. జరిగింది చెప్పారు.
(ఇంకా ఉంది)

-గోపరాజు నాగేశ్వరరావు