డైలీ సీరియల్

అనంతం-55

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అతన్ని మాట్లాడనివ్వకుండా ఆమే అన్నది-
‘‘నా మాఁవ రెడ్డియా నాయక్‌ని సంపారు.. ఇపుడు పెనిమిట్ని సంపి ముండమోపిచ్చారు.. చిగిరెట్లు, సీపు లిక్కర్లూ మప్పి తండా పిలగోళ్ళని శబ్బరోళ్ళని జేశారు. సివరాకరికి కొండదేవర్నికూడా అడ్డవెట్టుకొని అసత్తేలు జెప్పిచ్చి శాందినీని సంపారు.. టుపాకుల్తో గాల్సి తండా పెద్దల్ని సావనూకారు.
మడుసులఁవ్ బోతుండావు. ఆశారాలు బోతుండయ్యి. అడివి తల్లిచ్చిన జాగా గూడా పోనూక్కొని యాడ బతకాలంట?
ఇంత జరిగినాక గూడా సర్కారోళ్లని నిలదియ్యకుండా రగెస్య తావరాల్లో దాంకుంటే ఏటొరుగుద్దంట?
నావల్లగాదు! తండా యిడ్చిపెట్టి రగస్యె తావరానికి బోవటవ్ నాతో గాదు.
వత్తేరా నియ్యండా టుపాకుల పోలీసోళ్ళని.. రానియ్యండా సర్కారోళ్ళని.. ప్రెపంచకవ్ మొత్తవ్ గల్సొచ్చినా నేను మాత్తరవ్ రానా రగస్యె తావరానికి! నా రగతం వీడే బారాల. నేనీడే సావాల’’ అన్నది లక్ష్మీబాయి ఆవేశంగా.
రాగ్యాకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు!
భర్తని చంపారన్న బాధతో, తండా విడిచిపెట్టి వెళ్లాల్సిన పరిస్థితి కలిగిందన్న ఆవేదనతో ఆమె అలా అన్నది కానీ, పిడికెడంత మంది పిడికిళ్ళు బిగించి పోరాడినంత మాత్రాన పాలకవర్గాలకు పోయేదేముంది?
మూలకారణాలను పరిశీలించి పరిష్కరించకుండా, అలాంటివన్నీ తిరుగుబాట్లనీ, కుట్రలనీ, భారత సార్వభౌమాధికారానికి సవాళ్లనీ చెప్పి, క్రూరంగా అణచివేస్తారే తప్ప ప్రయోజనం ఉండదు.
ఆర్పలేనన్ని నిప్పు కణాలు తగులుకోవాలి. రగిలి రగిలి జ్వలిత జ్వాలలై మండాలి.
కొమ్ముల వాడి చూసుకొని పులిమీద దాడి చేస్తే జింక పిల్ల హతవౌతుంది! వేలాది జింక పిల్లల చురకత్తి కొమ్ములు చుట్టుముడితేనే జింక పిల్లలకి పులి లొంగేది!
తొందరపాటు ప్రదర్శిస్తుందేమిటి లక్ష్మీబాయి?
పరిస్థితి అర్థం చేసుకొని విజ్ఞత ప్రదర్శించకుండా ప్రవర్తించటం ప్రమాదమని గ్రహించదేవిటి?
రాగ్యా అయమయంగా చూశాడు!
కడుపులో వున్న బాధని అలా మాటలతో తీర్చుకున్న తర్వాత లక్ష్మీబాయి ఆవేశం కొంత చల్లారింది!
ఒకవైపు పోలీసుల బాధైతే, మరోవైపు రాగ్యాతో పెద్ద బాధ!
ఎంతవరకు వాడ్ని నమ్మాలి?
వాడు చెప్తున్నది నిజమేనా?
ప్రక్కనే వున్న స్ర్తిని అదే అడిగింది లక్ష్మీబాయి!
‘‘రాగ్యాగాడు నిజ్జవే సెప్పిండో-అబద్ధవే సెప్పిండో! ఆడెంట యల్లటంలో మనకి నష్టంలేదు..’’ అన్నదామె.
‘‘శబ్బర్నాకొడుకు’’ లక్ష్మీబాయి అన్నది.
‘‘ఐతే ఏంటిదంట?’’
‘‘నమ్మి ఆడెంట బోతే..’’
‘‘ఏవీగాదు! రాగ్యా కాడ సిన్న లాటీ కర్ర గూడా లేదు. అంత ప్రెవాదవనుకుంటే సేతుల్తోనే సావనూకొచ్చు! టుపాకులండ పోలీసులొస్తే ప్రెవాదవ్’’ అన్నది మళ్లీ ఆమె.
అంతలో-
ఎవ్వరో అడవి పుత్రుడు పొదల్లోకి పరుగెత్తుతూ ‘‘పోలీసోళ్ళు’’ అంటూ పెద్దగా అరిచాడు.
అడవి ఎండుటాకుల్ని నలిపివేస్తూ అడుగులు వేస్తున్న ఇనుప నాడాలబూట్ల చప్పుళ్ళు అదే సమయంలో వినిపించాయి!
అప్పటికే ఓ నిర్ణయానికొచ్చింది లక్ష్మీబాయి!
హడావుడిగా తయారై వాళ్ళంతా రాగ్యా వెంట బయల్దేరారు.
క్షణాల్లోనే అడవిలో అదృశ్యమయ్యారు!

***
పట్నంలో ప్రభుత్వ ఆస్పత్రి ముందు పోలీసు వాహనాలు ఆగాయి!
కాల్పుల్లో చనిపోయిన వాళ్ళనీ, క్షతగాత్రుల్నీ తరలిస్తున్నట్లు ముందుగానే ఆస్పత్రి వర్గాలకు వర్తమానం అందింది.
డాక్టర్లు, నర్సులు, యితర సిబ్బంది హడావుడి పడుతున్నారు.
వాహనాలిచ్చి ఆగగానే, ముందుగా క్షతగాత్రుల్ని ఎమర్జన్సీ వార్డుకు తరలించారు.
పోస్టుమార్టం నిమిత్తం శవాలను సిద్ధం చేస్తున్నారు!
ఆస్పత్రి వాతావరణం గంభీరంగా ఉంది!
లాఠీఛార్జిలో, కాల్పుల్లో స్వల్పంగా గాయపడ్డవారికి ప్రథమ చికిత్స చేసి ఆస్పత్రినుంచి విడుదల చేస్తున్నారు డాక్టర్లు.
విడుదలైన వాళ్ళని విడుదలైనట్టే వాహనాల్లో ఎక్కించి స్టేషన్లకు తరలిస్తున్నారు పోలీసులు!
ఇన్‌పేషెంట్లుగా వున్నవాళ్ళ దగ్గర పోలీసు కాపలా వుంది!
గాయాలు మానిపోయి విడుదల కావటమే ఆలస్యం! వాళ్లనీ స్టేషన్లకు తరలించే ఏర్పాట్లు జరిగాయి.
మీడియావాళ్ళు, ప్రజా సంస్థల నాయకులూ వచ్చారు.
అందుబాట్లో దొరికిన ఓ పోలీసు ఉద్యోగిన్ని, ‘‘ఇంతకూ ఏమైంది’’ అని మీడియా ప్రతినిధిని అడిగాడు.
‘‘పోలీసు శిబిరాలమీద దాడి జరిగింది’’ చెప్పాడా అధికారి.
‘‘ఎవ్వరా దాడి చేసింది?’’ మీడియా మరో ప్రశ్న!
‘‘అడవిపుత్రులు’’
‘‘ఎందుకలా దాడి జరిగింది’’
‘‘అధికారం కోసం అడవి పుత్రులు కుట్ర చేసి దాడి చేశారు’’
‘‘ఎంతమంది పోలీసులు గాయపడ్డారు’’
‘‘అప్రమత్తంగా ఉన్నందున ఎవ్వరూ గాయపళ్లేదు’’
‘‘కాల్పులెందుకు జరిగాయి’’
‘‘అధికార రక్షణ కోసం’’
‘‘ముందుగా గాల్లోకి కాల్పులు జరిపారా’’
‘‘అనుకున్నాం! వాళ్ళకలాంటి అవకాశం ఇవ్వలేదు’’
‘‘అడవిపుత్రులా’’
‘‘అవును’’
‘‘గుండెకి గురిచూసి కాల్చారా’’
‘‘ప్రత్యేకించి గురిపెట్టి కాల్చలేదు’’
‘‘ఐనా గుండెలకే తగిలాయంటారు తూటాలు’’
‘‘చెప్పలేం.. పోస్టుమార్టం రిపోర్టు రావాలి’’
‘‘మేనేజ్ చేసే అవకాశం వుందా’’
‘‘నో కామెంట్’’
‘‘శవాలను చూడొచ్చా’’
‘‘పోస్టుమార్టం తర్వాత’’
‘‘చాంద్‌నీ ఎవ్వరు’’
‘‘కలప దొంగ’’
‘‘కాల్చి చంపారా’’
‘‘ఎర్రచందనం దొంగిలించబోతే తేనెటీగలు కుట్టి చచ్చింది’’
‘‘కానిస్టేబులు కనకయ్యని ఎవరు చంపారు?’’
‘‘నగ్గూరాం’’
‘‘ఎందుకు చంపాడు?’’
‘‘రాజ్యాధికారం కోసం’’
‘‘గరుడాచలం?’’
‘‘గొప్ప మేధావి.. పరిశోధకుడు’’
(ఇంకా ఉంది)

-గోపరాజు నాగేశ్వరరావు