డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు -126

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుర్వకాలంలో జాజలి అనే పేరు కల ద్విజుడు అరణ్యంలో తపస్సు చేసుకుంటూ అక్కడే నివసించేవాడు. ఆ ముని నియమంగా ఆహారం తీసుకొంటూ నార చీరలు, జింక చర్మాలు ధరించి తపస్సు చేశాడు. కొన్ని సంవత్సరాలు శరీరంపై మలాన్ని, బురదనూ ధరించాడు. సముద్ర తీరంలో జలంలో నిలిచి తపస్సు చేస్తున్న అతనికి సముద్ర పర్యంతం ఉన్న భూమిని చూడాలన్న కోరికతో, ఆ భూమినంతా చూసివచ్చి మరల జలంలో నిలిచి ఇలా అనుకున్నాడు. ‘‘ఈ ప్రాణులందరిలో నాతో సమానమైన వాడు లేడు. నాలా సంచరించగలవాడు లేడు’’.
అతని అంతర్గతం తెలుసుకున్న రాక్షసులు అతనితో ఇలా అన్నారు. ‘‘ద్విజోత్తమా! నీవిలా మాట్లాడకూడదు. వారణాసిలో గొప్ప యశస్వి అయన తులాధరుడున్నాడు. అతను కూడా ఎన్నడూ ఇలా మాట్లాడలేదు.’’
అప్పుడు జాజలి అతన్ని చూడాలని కోరాడు.
రాక్షసులు ఇలా అన్నారు. ‘‘సాగర తీరాన ఇదే మార్గంలో వెళితే కాశీలో ఉన్న అతన్ని నీవు చూడగలవు.’’
విప్రుడు అదే విధంగా ప్రయాణం చేసి తులాధరుని దగ్గరకు చేరాడు. ఇక్కడికి రాక ము నుపు జాజలిమహర్షి ఘోర తపస్సు చేశాడు. వానప్రస్థ విధులన్నీ నియమంగా పాటించేవాడు. వానాకాలంలో పైకప్పు లేకుండా పడుకునేవాడు. హేమంతంలో నీటిలో నిలిచి తపస్సు చేసేవాడు. వర్ష ఋతువులో పైనించి పడుతున్న నీటి ధారలను తలపై ధరించేవాడు. అందువల్ల అతని జటలు ముడిపడ్డాయ. స్థాణువులాగా కదలకుండా నిల్చుని తపస్సు చేయటంతో, అతని తలపై పిచ్చుకల జంట గూడు కట్టుకొన్నది. తలమీద గడ్డిపోచలతో కట్టిన గూడును ముని దయతో ఏమీ చేయలేదు. అతను కదలక ఉండడంతో పిచ్చుకలు అక్కడే హాయగా నివసించసాగాయ/ శరత్కాలం రాగానే అవి జాజలి మహర్షి తలమీదే గ్రుడ్లు పెట్టాయ. పక్షులు తన తలమీద గ్రుడ్లు పెట్టడంతో వాటిని ఇబ్బంది పెట్టకూడదని మహర్షి స్థిరంగా నిలిచాడు. పక్షులు ప్రతిదినం ఆహారం కోసం వెళ్ళి, మరల వచ్చి అతని తలమీదే నివసించసాగాయ. కొంత కాలానికి ఆ గ్రుడ్ల నుంచి పిల్లలు బయటకు వచ్చాయ. పిల్లలతో పాటు తల్లి పక్షి అక్కడే ఉండసాగింది. రెక్కలు వచ్చిన తర్వాత పిల్ల పక్షులు ఎగిరిపోగా మరల తమ గూటికి వచ్చేవి. అలా ఆ పక్షులన్నీ తిరిగి సాయంకాలం మరల గూటి దగ్గరకు వచ్చేవి. కొంతకాలానికి పక్షులు తిరిగి, తిరిగి వారం రోజులకు గూటికి వచ్చేవి. అవి బాగా పుష్టిగా తయారయ్యాయ. ఒకసారి అలా ఎగిరిపోయన ఆ పక్షులు నెలరోజులైనా తిరిగి రాలేదు. అప్పుడు జాజలి అక్కడ నుంచి కదిలాడు. ఆ పక్షులు మరి కనిపించకుండా పోయాయ. జాజలికి తాను సిద్ధి పొందినట్లు భావం కలిగింది. దానితో అతనిలో అహంభావం ప్రవేశించింది. ఆ ము ని వెళ్ళిన పక్షులను తలచుకొని, తన సిద్ధిని తానే పొందినట్లు భావించుకొని ఆనందపడ్డాడు. అగ్నిని రగిల్చి, సూర్యుని ఉపాసించాడు. చప్పట్లు చరుస్తూ ‘‘నేను ధర్మాన్ని సాధించాను’’ అని గట్టిగా అరిచాడు. అప్పుడు అంతరిక్షం నుండి ఇలా వినబడింది.
‘జాబాలీ! ధర్మ విషయంలో నీవు తులాధారునితో సమానం కావు. అతను వారణాసిలో ఉన్నాడు. గొప్ప బుద్ధిమంతుడు.’’
అప్పుడు జాజలి తులాధరుని చూడటానికి బయలుదేరాడు. వారణాసి చేరి తులాధరుని చూచాడు. అతను సరుకులు అమ్ముకుంటున్నాడు. జాజలి రాకను చూసి అతను సంతోషంగా మునికి స్వాగతం పలికాడు. ఇలా అన్నాడు. ‘‘నీవు వస్తున్నట్లు నాకు ముందే తెల్సు. నీవు సాగరతీరంలో తీవ్ర తపస్సు చేశావు. నీ తలమీద పక్షులు గ్రుడ్లు పెట్టాయ. పిల్లలు రెక్కలు వచ్చిన తర్వాత ఎగిరిపోయాయ. ఆ పక్షులను ఆదరించిన ధర్మానే్న నీవు గొప్పగా భావించావు. అప్పుడు ఆకాశవాణి నా గురించి తెలిపింది. దానితో నా దగ్గరకు వచ్చావు. చెప్పు నీకు నేను ఏం చేయాలో!’’
తులాధరుడు ఇలా అనగానే జాజలి అతన్ని ఇలా ప్రశ్నించాడు. ‘‘వణిజా! సర్వ రసాలను, గంథాలను, ఫలాలను, ఓషధులను నీవు అమ్ముతున్నావు. అలా చేస్తూనే నీ నైష్ఠిక బుద్ధిని ఎలా సంపాదించుకొన్నావో నాకు చెప్పు’’.
అప్పుడు తులాధరుడు ఇలా సమాధానం చెప్పాడు. ‘‘జాజలీ! నాకు గూఢ రహస్యాలతో కూడిన సనాతన ధర్మం తెలుసు. ఆ ధర్మం సర్వ భూతహితం కోరుతుంది. మైత్రిని కలిగిస్తుంది. అదే ప్రాచీన ధర్మం. ప్రాణులకు ద్రోహం చేయకూడదు. నేను ఆ ధర్మ మార్గంలో జీవిస్తున్నాను. ఎలాగంటే ఇతరులు నరికిన కొయ్యతో ఇల్లు కట్టుకున్నాను.
లక్క, పద్మకం, తుంగ మొదలైన వస్తువులను కొని కొంచెం లాభానికి అమ్ముతాను. నేను ఎవ్వరి వెంటపడను. ఎవ్వరితో గొడవ పెట్టుకోను. ఎవరినీ ద్వేషించను. ఎవరినీ ప్రేమించను. సర్వ ప్రాణులను సమానంగా చూస్తాను. నా త్రాసు అందరి విషయంలో ఒకలాగే ఉంటుంది. వృద్ధులూ, రోగులూ, విషయ యంలో రోగాలపై అనాసక్తులైనట్లే నాకు కూడా అర్థ కామాలపై కోరిక తొలగిపోయంది. మనకు రాగం, ద్వేషం ఉండకూడదు. అప్పుడే బ్రహ్మత్వం సాధ్యపడుతుంది. సర్వభూతాలపట్ల మనసా, వాచా, కర్మణా పాప భావన లేకుంటే బ్రహ్మత్వం లభిస్తుంది. శాస్త్రానుసారం ప్రవర్తించే వారినే నేను అనుసరిస్తాను.’’
తులాధరుడు ఇంకా ఇలా అన్నాడు - ‘‘జాజలీ! జితేంద్రియుడైన ప్రాజ్ఞుడు, సజ్జనులూ ఆచరించిన ధర్మానే్న నేను ఆచరిస్తాను. అనాచార మోహం వలన శాశ్విత ధర్మం నశిస్తుంది. తీరం దగ్గరకు చేరి కోలాహలం చేసేవాళ్ళను చూసి చేపలు బెదరినట్లు కొందరిని చూసి క్రూరమృగాన్ని చూసినట్లు భయపడుతారు. అలాంటి వారు సర్వ ప్రాణుల నుండి భయానే్న పొందుతారు. దీని కారణంగా అభయదానమనే ఆచారం ప్రారంభమైంది. ఈ అభయ దానం చేసే వారినే పండితులు కీర్తిస్తారు. తపస్సు, యజ్ఞాలు, దానాలు - వీటి ద్వారా పొందే ఫలాలు అన్నీ అభయదానం ద్వారా పొందవచ్చు. ఇంకా - అహింసను మించిన ధర్మం ఇంకేదీలేదు.
మహామునీ! ఎవరి వలన ఏ ప్రాణీ ఏ రీతిగానూ భయపడదో, అతను అందరివలన అభయాన్ని పొందగలడు. కోపంతో ధర్మ కార్యాలు చేసేవాడు కొన్ని స్వర్గాది ఫలాలు పొంది, అవి ముగియగానే క్రిందికి వస్తాడు. ధర్మం అత్యంత సూక్ష్మమైనది కనుక దానిని తెలియటం చాలా కష్టం. ఎవరో ఒక ధర్మాన్ని ఆచరించారు కదా అని మనం ఆచరించకూడదు.’’
అప్పుడు తులాధరుని మాటలు విన్న జాజలి ఇలా అడిగాడు. ‘‘వణిజా! నీవు అన్నిటితో వ్యాపారం చేసి జీవిస్తున్నావు. వ్యవసాయం వల్లే అన్నీ దొరుకుతున్నవి. యజ్ఞాలలో వ్యవసాయంలో పశువులను వాడకపోతేలోకమే నిలవదు’’.
తులాధరుడు ఇలా అన్నాడు. ‘‘శుభ కర్మల ద్వారా వచ్చిన హవ్యంతో దేవతలు తృప్తి చెందుతారు. శాస్త్ర విధినిబట్టి నమస్కారాలతో, హవిస్సులతో స్వాధ్యాయంతో ఓషధులతో దేవతలను తృప్తి పరచాలి. కాముకులు యాగాలు చేసినా, చెరువులు త్రవ్వించినా తోటలు నిర్మించినా వారికి గుణహీనులైన సంతానమే కలుగుతుంది. సమదర్శులకు సమదర్శులే పుడతారు.
-ఇంకావుంది

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి