డైలీ సీరియల్

అనంతం-63

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్కడ అధికారుల సమావేశం జరుగుతూనే ఉంది.
అడవిలో-
పోలీసు సిబ్బంది ఎంతో శ్రమకోర్చి చితులు పేర్చారు!
బాణావతు, నగ్గూరాం, కాళీచరణ్, చాంద్‌నీ శవాలను చితుల మీదికి చేర్చారు... కిరసనాయిల పోసి నిప్పంటించారు.
చితిమంటలు ‘్భగ్గు’న లేచాయి!
శవాలు దహనమయ్యాయి!
అడవి మూగపోయింది.. గాలి స్తంభించింది!
పట్నంలో-
గరుడాచలం శవానికీ.. కానిస్టేబులు కనకయ్య శవానికీ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి.
గాలిలోకి తుపాకులు అప్పుడు కాల్చారు పోలీసులు!
విధి నిర్వహణలో ప్రాణాలుకోల్పోయిన కానిస్టేబులు కనకయ్యకీ, కలివికోడి ప్రాజెక్టు నిర్మాణంలో తీవ్రవాదుల చేతిలో హతమైన గరుడాచలానికీ,-
కీ.శే.పెద్దిరెడ్డి కొడుకు ఎమ్మెల్లే పెంటారెడ్డి హైద్రాబాదునుంచే విడుదల చేసిన ప్రకటనలో సంతాపం తెలియజేశారు!
అదే ప్రకటనలో వారు-
హింసని విడనాడి, శాంతిని నెలకొల్పవలసిందిగా అడవి పుత్రులను కోరారు!
వారి ప్రకటనను మీడియా ప్రముఖంగా ప్రచురించింది!
* * *
రామాయణ కాలంలోని రామరాజ్యం ప్రజారాజ్యమని- అశోకుడు ధర్మపాలన అందించాడని- గుప్తులకాలం స్వర్ణయుగం అనీ- శ్రీకృష్ణ దేవరాయలి కాలంలో రాసులుపోసి రత్నాలమ్మారనీ-
గతాన్ని తల్చుకుంటూ-
ఆధునిక టెక్నాలజీ పరిపుష్టమై నివేశన స్థలాల కొరత లేకండా అంతర్గ్రహాల్లో అంతస్తులు నిర్మించుకోవచ్చనీ-
అన్నంతో పనిలేకండా ఆకలిమందు కనుగొంటారని- జీవరహస్యం తెలుసుకొని మరణాన్నికూడా మనిషే నియంత్రిస్తూ పీనుగులకు ప్రాణం పోస్తాడనీ-
భవిష్యత్తును ఊహించుకొంటూ, సంబరపడుతూ-
వర్తమానాన్ని మనిషి విస్మరిస్తున్నాడు!
మరో ప్రమాదం పొంచి వుందన్న ధ్యాసే లేదు.
ఆలోచన లేదు!
మరణాన్ని జయించి పీనుగులకి ప్రాణంపోసే ‘జీవ వ్యాపారం’ బహుళజాతి కంపెనీల పేటెంట్ హక్కవుతుంది!
శవాల్ని మళ్ళీ బ్రతికించేందుకు వాళ్ళు నిర్ణయించే ‘్ధర’చెల్లించలేని నిరుపేదలు పంచభూతాల్లో కలిసిపోవాల్సిందే!
అప్పుడూ భూగోళమీద పెత్తనం ధనిక పీనుగులదే!
వర్తమానంలో-
నాగరికత పంజాదెబ్బకి అడవి అందాలు మాడిపోతోన్నాయి.
వాతావరణం కలుషితమైపోతోంది.
ఆధునిక మానవుడు అడవుల్ని ధ్వంసం చేస్తున్నాడు.
ప్రకృతిమీద పగబట్టాడు!
ఫలితం ఎలా ఉంటుందో? ఎలాఉన్నా కర్త అతనే!
కాలం చాలా కేలెండర్లని నలిమి మింగినతర్వాత.. ఇప్పుడు-
అడవి వాతావరణం చూస్తే ఏడుపొస్తున్నది!
నల్లకొండ, నెమలిగుట్ట, రెడ్డియానాయక్ తండా ప్రాంతాలను మింగుతూ, విశాలమైన అడవి భూముల్లో యినుముతో చేసిన బలమైన ముళ్ళతీగలతో కంచె వేశారు.
(ఇంకా ఉంది)
==============================================================
సంస్కృతీ సంప్రదాయాలు
ఆచారాలు, కట్టుబొట్టు
వేషం భాష ఇవన్నీ
దేశచిత్ర పటానికి రంగులైతే
ఆ చిత్రానికి సజీవత్వాన్ని
తెచ్చేది మాత్రం మనిషికున్న విలువలే!
కాని నేడు ఆ విలువలనే వలువలు
జీర్ణావస్థలో ఉన్నాయి
వాటిని సరిచేయాల్సిన తరుణమిదే
మరి సరిచేసే వారెవరు?
మీలో ఒకరు అవుతారా?
ఆలోచనాసంద్రాన్ని తట్టిలేపే
డైలీ సీరియల్ విలువల లోగిలి మీకోసం
రచన: యలమర్తి అనూరాధ సెల్: 9247260206

-గోపరాజు నాగేశ్వరరావు