డైలీ సీరియల్

అనంతం-64

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెక్యూరిటీ గార్డులున్నారు.
అధికారుల వసతి గృహాలున్నాయి.
ప్రవేశ ద్వారం ముందు ‘కలివికోళ్ళ రక్షితప్రాంతం’అని పెద్ద అక్షరాలతో బోర్డుంది.. మరో బోర్డుమీద ‘అనుమతి లేనిదే లోనికి ప్రవేశించరాదు’ అని వుంది.
మొత్తానికి అది అడవి పుత్రులకు నిషిద్ధ ప్రాంతం!
కంచె లోపల ఎవ్వరో డ్రిల్లింగ్ యంత్రాలతో అడవి తల్లికి గుండె గాయాలుచేస్తూ భూమిని తవ్వుతున్నారు.
తవ్విన రాళ్ళ నాణ్యత పరీక్షిస్తున్నారు.
పరిసరాల్లో ఎక్కడా అడవి పుత్రుల జాడేలేదు.
అడవి పూల సుగంధాల ఆనవాళ్ళు లేవు.
గాలి కలుషితమైంది.
అడవి వెనె్నల మురికిపడింది!
వన్యమృగాల సంచారంలేదు.. మనిషికి భయపడి పారిపోయాయి!
నెమళ్ళులేవు..వాటి నృత్య భంగిమలు స్మృతుల్లోనే మిగిలిపోయాయి!
నీటికొలను బోసిపోయింది.
ఇప్పుడా కొలను నీటి అద్దంమీద అందాల చంద్రుడు మొహం చూసుకోవటం లేదు.. అలిగి మబ్బుల్లోకి వెళ్ళిపోతోన్నాడు!
ఆధునిక వ్యర్థాలతో నీటికొలను నిండిపోయింది!
పాకుడుతో, బురదతో అట్టలు తేలి- దుర్గంధం వెదజల్లుతున్నది.
తరతరాల దేవర జాతర నిషేధించారు.
కొండదేవర కొలువున్న నల్లకొండని ఆక్రమించి కంచెవేశారు.
దేవర వలసపోయాడు!
దూరంగా మరో కొండమీద కొలువుతీరాడు!
అలాంటి అవకాశం అడవి పుత్రులకు లేదు.. వాళ్ళు కనిపిస్తే పోలీసులు కాల్చేస్తారు!
అజ్ఞాతవాసం ఉంటున్న కొండ గుహలే రెడ్డియానాయక్ తండా!
అదీ ధ్వంసంచేస్తే ఎక్కడ ప్రత్యక్షవౌతారో!
అయినవాళ్ళ శవాల విషయం అడవి పుత్రులకు తెలియదు.
అది అడవి చరిత్ర!
తరతరాల చరిత్ర!
అంతులేని చరిత్ర!
గొలుసుకొండల దగ్గర-
గుహలో తన అనుచరులతో మంతనాలు చేస్తున్నాడు గోపీనాయక్!
వాళ్ళ పంథా పూర్తిగా మారిపోయింది!
అడవికి వెళ్ళటం, సంపద తెచ్చి సంతలో అమ్మటం, రాగి సంకటే పరమాన్నంగా భావించి సంతృప్తిపడటం, ఆచారాలు కొనసాగిస్తూ అడవే ప్రపంచంగా జీవించటం-
తప్ప,
ఉద్యమాల ఊసేతెలియని వాళ్ళిప్పుడు పోరాటాల బాటపట్టారు!
పాలకులు ఎందుకిలా తమ గొయ్యి తామే త్రవ్వుకుంటారో!?
భళ్ళున తెల్లవారింది!
వాల్యా హడావుడిగా నిద్రలేచాడు.
సెలయేటి నీటితో స్నానం చేశాడు.
రాత్రి మిగిలిన రాగి సంకటి తిన్నాడు.
గుహనుంచి బయల్దేరాడు.
‘‘యాడికి రా...?’’అని లక్ష్మీబాయి అడిగింది.
‘‘అడివికి’’అన్నాడు వాల్యా.
‘‘ఏంటికి’’అని అడిగింది.
‘‘బతకటానికి’’అన్నాడు వాడు!
తలగుడ్డ చుట్టి,
విల్లంబు చేపట్టి-
అడవి దారిలో వాడు అల్లూరి సీతారామరాజై ఠీవిగా నడుస్తుంటే ఎంత ఉప్పొంగి పోయిందో లక్ష్మీబాయి!
***

అయిపోయింది

-గోపరాజు నాగేశ్వరరావు