డైలీ సీరియల్

విలువల లోగిలి-5

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొందరు సీటుఇస్తే ఇరుకుగా, ఇబ్బందిగా ఉంటుందని అసలు జరగటానికే ఇష్టపడదు. వాళ్ళ హృదయం ముందు విశాలం చేసుకోవాలని వారికే తెలియదు’అని మనసులో అనుకుని ‘‘వస్తానండీ! అమ్మ ఎదురుచూస్తూ ఉంటుంది’’అని వడివడిగా అడుగులు వేస్తూ బయటపడింది ఆమె.
‘‘ఎవరు చేసుకుంటారో ఈ అమ్మాయిని వాళ్ళు చాలా అదృష్టవంతులు’’అన్న ఆశీర్వాదం ఆమెకు తోడయ్యింది.
గుమ్మంలోనే ఎదురువచ్చింది తల్లి ‘సుగుణ’. తను అంతే విశ్వ బయటకు వెళ్ళిందంటే చాలు మళ్ళీ వచ్చేదాకా అలా ఇంట్లోకి బయటకూ తిరుగుతూనే ఉంటుంది.
‘‘వెళ్ళిన వాళ్ళం రామా అమ్మా. నువ్వు ఎదురుచూసినంతలో తొందరగా వచ్చేస్తామా?’’అని విశ్వ ఎన్నిసార్లుచెప్పినా పట్టించుకోదు ఆవిడ. తన ఆనందం తనదే అనుకుంటుంది.
‘‘వచ్చావా విశ్వా! ఇంకా రాలేదేమిటా అని చూస్తున్నా! ఇంటర్వ్యూ బాగా జరిగిందా? అన్నీ బాగాచెప్పావా?’’ అని అడుగుతూనే లోపలికి వెళ్ళి గ్లాసుతో మంచినీళ్ళు తెచ్చింది.
పెరట్లోకి వెళ్ళి కాళ్ళుకడుక్కొని వచ్చి ‘‘అంతాబాగా చేసానమ్మా. రెండుమూడు రోజులలో పిలుస్తానన్నారు. పోటీ మాత్రం తీవ్రంగానే ఉంది.’’
‘‘మధ్యలో ఏమన్నా తిన్నావా?’’
‘‘ఆఁ! నువ్వు చేసి ఇచ్చిన దద్దోజనం చల్లగా నీ దీవెనలానే నా కడుపు నింపింది.’’
‘‘సరే! వేడివేడిగా కాస్త ఉప్మాచేసి పెడతాను. తిందువుగానీ. కాసేపు విశ్రాంతి తీసుకో.’’
‘‘అలాగే అమ్మా, ట్రైను చాలా రష్‌గా ఉంది. జనాలతో అసలు ఊపిరి ఆడలేదంటే నమ్ము.’’
‘‘మరి బస్సు టిక్కెట్లు రేట్లు ఆకాశాన్నంటుతుంటే అందరూ ప్యాసింజర్లకే ఎగబడుతున్నారు. వెళ్ళటం తప్పదన్నప్పుడు కాస్త ఖర్చు తక్కువయ్యేదే చూసుకుంటారుగా ఎవరన్నా!’’
‘‘అమ్మకి లక్షణరావు, లిఫ్ట్ సంగతి చెప్పనా, వద్దా’అని ఘర్షణ పడుతోంది విశ్వప్రియ మనసులో.
‘‘అదో చేదు సంఘటన. తనే జీర్ణించుకోలేకపోతోంది. ఆమె దాన్ని మరింత తక్కువగా తీసుకుంటుందేమో. నిజం చెప్పాలంటే అమ్మ దగ్గిర ఏదీ దాచటం తనకిష్టముండదు. చెబితే ఆవిడకు శాంతి ఉండదు. చెప్పకపోతే తనకు అశాంతి. ఎలా?’’
చివరకు చెప్పెయ్యాలనే నిశ్చయించుకుంది.
అమ్మ ఇచ్చిన టిఫిన్ తింటూ జరిగిందంటా పూసగుచ్చినట్లు చెప్పేసింది.
ఆవిడ తేలికగానే తీసుకున్నారు.
‘‘్భగవంతుడి దయవలన క్షేమంగానే ఇంటికి వచ్చావు. ఇంకెప్పుడూ ఇలాంటి సాహసాలు చెయ్యకు. డబ్బులేకపోతే ఉన్న దాంట్లోనే ఖర్చుపెట్టుకుందాం. దానికోసం విలువలను కోల్పోవటం మాత్రం నాకిష్టముండదు. గుర్తుంచుకో విశ్వా.’’
‘‘అలాగే నమ్మా! నాకు బుద్ధివచ్చింది. ఇంకెప్పుడూ లిఫ్ట్ ఎక్కను. అయినా మనకు దేముడిచ్చిన కాళ్ళు ఉన్నాయిగా. అందులో బలమూ ఉంది.’’
‘‘మంచిది. నాకు వంటింట్లో చాలా పని ఉంది. నువ్వు హాయిగా పడుకో. పనికిరానివి ఎప్పటికప్పుడు బయట ఎలాపారేస్తామో అలాగే మనల్ని బాధించే జ్ఞాపకాలను వదిలెయ్యాలి. మళ్ళీమళ్ళీ గుర్తుతెచ్చుకోకూడదు. సరేనా!’’అంటూ నుదుటి మీద ముద్దు ఇచ్చి వెళ్ళిందావిడ.
అందుకే అమ్మంటే తనకు చాలా ఇష్టం.
***
‘‘అమ్మా! భువనేశ్వరి పెద్దమ్మ దగ్గరికు వెళ్లివస్తాను’’
‘‘అలాగే విశ్వా! తలుపు దగ్గరగా వేసి వెళ్ళు’’
భువనేశ్వరి గారిది జమిందారి వంశం. ఆ వీధిలో వారిదే పెద్ద భవనం. వారి పూర్వీకుల వల్లే ఈ వీధికి ఆ పేరు వచ్చిందని చెప్పుకుంటూ ఉంటారు. పెద్ద పెద్ద వ్యాపారాలు వాళ్లకు ఎన్నో ఉండేవి. ఎందరికో ఉద్యోగాలు ఇచ్చి ఉపాధి కల్పించేవారు. అంతేనా మరెందరో విద్యార్థులు చదువుకోవటానికి వసతి, భోజనం ఉచితంగా అందజేసేవారు. వాళ్ళు పదికాలాలు చల్లగా ఉండాలి. విశ్వ డిగ్రీ పూర్తిచేయటానికి కారణం కూడా ఆవిడే. పేరుకు తాను తల్లేగానీ ఆవిడే విశ్వను కన్నకూతురు కంటే ఎక్కువగా చూసుకుంటుంది. ఇద్దరి ఇళ్ళు దగ్గరే కావటంతో రోజుకొక్కసారైనా ఆవిడతో మాట్లాడిరాకపోతే విశ్వకు రోజు బాగుండదు.
‘‘పెద్దమ్మా!’’ అన్న ఆత్మీయమైన పిలుపునకు పుస్తకం చదువుకుంటున్న ఆవిడ ఒక్కసారి ఈ లోకంలోకి వస్తూ ‘‘రా! విశ్వ బంగారూ! రా! రా!’’ అంటూ తన దగ్గరగా కూర్చోపెట్టుకున్నారు.
‘‘ఏదో సీరియస్‌గా చదివేస్తున్నట్లున్నావు?’’
‘‘ఆ! ఏదో కాలక్షేపం. నీలాంటివాళ్ళు నన్ను పట్టించుకోకపోతే నేనేం చెయ్యాలి చెప్పు?’’
‘‘అయ్యబాబోయ్! పెద్దమ్మ కూడా జోక్స్ వేయగలదన్నమాట. కాదు పెద్దమ్మా. నిన్న విజయవాడకు ఇంటర్వ్యూకి వెళ్ళాను. అదీ సంగతి’’
‘‘అక్కడిదాకా ఎందుకు. ఇక్కడే ఆ మాత్రంవి దొరకవా?’’
‘‘ఏమో! మొదటి ప్రయత్నంగా చూసానులే’’
‘‘ఇంతకీ ఎలా చేసావ్?’’
‘‘అలాకాదు.. ఎంతమంది నిరుద్యోగులుని చూసావ్ అని అడగాలి’’ అంది నవ్వుతూ.
‘‘అది అందరికీ తెలిసిన విషయమే కదరా. పోటీ లేకపోతే ప్రజ్ఞక్తి విలువేముంది?
‘‘అవుననుకో.. మొదటిసారి ఎదుర్కొన్నానుగా అందుకే అలా అనిపించిందిలే తెలిసినా?’’
‘‘వస్తే నన్ను విడిచిపెట్టి వెళ్లిపోతావా?’’
‘‘ఎందుకు వెళతాను? నిన్ను కూడా నాతో తీసుకువెళ్తా’’
‘‘అంత మాట అన్నావు అది చాలు’’
‘‘ఏమిటి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది?’’
‘‘ఎవరి పనులలో వారున్నారు’’
‘‘నే వెళ్లి విరజాజి పువ్వులు కోసుకురానా? మాట్లాడుతూ కట్టుకోవచ్చు’’
‘‘ఏది మరిచిపోయినా వాటి సంగతి మరవవుగా. వెళ్ళు. నీ నేస్తాన్ని పలకరించు పో’’
‘‘అలాగే’’ అంటూ డాబా ఎక్కింది.
ఓ మూలగా తనకు హాయ్ చెబుతూ విరజాజాజుల చెట్టు, ‘‘ఏరా! బాగున్నావా?’’ అంటూ మనుషుల్ని పలకరించినట్లే పలకరించింది.
ఆకులు అన్నీ సంతోషంగా తలలు ఊపాయి.
‘‘నేను వచ్చేసానుగా. బోలుడన్ని కబుర్లు చెప్పుకుందామే’’ అంటూ పూలు కొయ్యటం ప్రారంభించింది.
పూలు కొయ్యటం, మాల కట్టడం తనకి ఎంతో ఇష్టమైన పని. దాని కోసం ఎంత కాలన్నయినా ఇచ్చేస్తుంది తన క్యాలెండర్ నుంచీ.
పూలు అన్నీ కోసేసాక చుట్టూ ఒకసారి తిరిగి చూసింది.
- ఇంకా ఉంది

-యలమర్తి అనూరాధ 9247260206