డైలీ సీరియల్

భక్తిని మించిన సాధనముందా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్త సీరియల్ ప్రారంభం
*
అంబరీషుడు నాభాగుని కుమారుడు. యవనాశ్వనునికి మనమడు. అంబరీషుని గుణగణాలను చూసి ప్రీతి చెంది యవనాశ్వుడు తన కుమారునిగా అంబరీషుని స్వీకరించాడు. అంబరీషుడు గొప్ప విష్ణ్భుక్తుడు. మనసావాచాకర్మణా ఎల్లప్పుడూ శ్రీహరినే ధ్యానిస్తుండేవాడు. సదా విష్ణునామాన్ని జపించే అంబరీషుడు ఎదురుగా ఎవరితో మాట్లాడినా వారిని మహావిష్ణుస్వరూపంగా భావించేవాడు. దేనినైనా తినినా, త్రాగినా, పడుకున్నా, లేచినా, నడిచినా, చూచినా ఇలా ఏమి చేసినా అతడి నోటి నుంచి ‘హరీ’ అనే పదం వచ్చేది. హరిభక్తుడుగా అంబరీషుడు ముల్లోకాల చేతపొగడ్తలు అందుకున్నాడు.
అంబరీషుడు బంగారాన్ని, మట్టిని కూడా ఒకేవిధంగా చూసేవాడు. అతడికి సంపదపైన, ఐశ్వర్యాలపైనా, మమకారాలపైనా వ్యామోహం నశించిపోయింది. తానే కాక ఇతరులు కూడా విష్ణ్భుక్తిలోని మాధుర్యాన్ని చవి చూడాలని అనుకున్నాడు. తన రాజ్యంలోని వారందరి చేత విష్ణుపూజలను చేయించేవాడు.
ఓసారి అంబరీషుడు ద్వాదశీ వ్రతాన్ని ఒక సంవత్సరం పాటు చేశాడు. అప్పుడే తన రాజ్యంలోని వారందరూ కూడా ఈ ద్వాదశీ వ్రతాన్ని చేయాలని చాటింపువేయించాడు. అలా అంబరీషుని రాజ్యం అంతటా ఏకాదశీ, ద్వాదశీవ్రతాలు బ్రహ్మాండంగా జరుగుతుండేవి.
ఎప్పటిలాగానే ఓ సారి ఏకాదశీ ఉపవాసం చేసి ద్వాదశీ పారణ చేయడానికి అంబరీషుడు పూనుకొన్నాడు. ద్వాదశి గడియల్లోనే పారణ చేయాలనుకొన్న అంబరీషుని విష్ణుపూజలను సల్పుతున్నాడు.
ఆ సమయంలోనే అక్కడకు దుర్వాస మహాముని వచ్చాడు. అక్కడ చేస్తున్న ద్వాదశారాధన చూసి తాను అందులో పాల్గొన్నాడు. అపుడు అంబరీషుడు ఆ ద్వాదశీపారణకు దుర్వాసమహామునిని కూడా ఆహ్వానించాడు. దుర్వాసుడు తన శిష్యగణంతో నదీస్నాన సంధ్యాదులు నిర్వర్తించుకని వస్తానని నదీతీరానికి వెళ్లాడు.
అంతలో ద్వాదశి తిథి ముగిసే సమయం వస్తుండడంతో తాను ఏవిధంగా పారణ చేయడం యుక్తమో చెప్పమని అంబరీషుడు అక్కడున్న పండితులను అడిగాడు. దుర్వాస మహాముని రాకుండానే పారణ చేయడమెలా అని బాగా ఆలోచించి అక్కడున్నవారు అంబరీషునికి నీటితో పారణ చేయమని దాని వల్ల దోషం అంటదని చెప్పారు.
ఆవిధంగా ద్వాదశీపారణ ముగించి అంబరీషుడు దుర్వాసుని కోసం ఎదురుచూడసాగాడు. అపుడు వచ్చిన దుర్వాసుడు తన మనో నేత్రం ద్వారా జరిగిన సంగతి తెలుసుకొని ఈ అంబరీషుడు తన్ను ఆహ్వానించి దాద్వశి పారణ కావించేశాడన్న కోపానికి గుయ్యాడు. తన్ను భోజనానికి పిలిచి తాను ముందుగానే ఆరగించి ధర్నాన్ని అతిక్రమించాడని అక్కడున్న వారితో చెప్పాడు. ధర్మాతిక్రమణ చేసిన వారు రాజైనా నేను క్షమించనని చెపుతూ తన సిగలోని ఒక జటను తీసి ఆయుధహస్తను చేసి దానిని అంబరీషునిపైకి వదిలాడు.

- ఇంకాఉంది

- డా. రాయసం లక్ష్మి. 9703344804