డైలీ సీరియల్

విలువల లోగిలి-14

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘పోనీలే ఏం చేస్తాం. పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయమయిపోతాయట’’
‘‘అయిపోయాక ఇక ఎన్ని అనుకున్నా లాభం లేదు’’
‘‘అంతే అని ఊరుకోలేకపోతున్నాను. అదే నా బాధ. నీకు చెప్పాక కాస్త తగ్గినట్లుంది’’ అంది శాంతి.
‘‘ఎన్నాళ్ళుంటావ్ శాంతీ?’’
‘‘ఎన్నాళ్ళోనా? రేపు వెళ్లిపోవాలి. పెళ్లికాకముందు ఎలా ఉంటారో తెలియదు. కానీ పెళ్ళయ్యక భార్య, కోడలు లేకపోతే ఇల్లే గడవదంటారే’
‘‘అలా ఎందుకనుకుంటావ్? అదంతా నీ మీద ప్రేమ అనుకోవచ్చుగా’’
‘‘ప్రేమా, పని కోసమా అనేది అర్థం చేసుకోలేని చిన్నదాన్నా విశ్వా?’’
‘‘అలా అంటే ఇంక నేనేం మాట్లాడతాను? నీకు కనకాంబరాలు ఇష్టంగా. కోసుకుందాం పద. కట్టి ఇస్తాను, పెట్టుకుందువుగానీ’’
‘‘నీకెంత గుర్తే విశ్వా?’’
‘‘మరీ విచిత్రంగా మాట్లాడకు శాంతి’’
‘‘నీకలానే అనిపిస్తంది. నాకిలాగ ప్రేమగా మాట్లాడేవాళ్ళు కరువై ఒంటరిదాన్నయినట్లు దిగాలుగా ఉంటుంది’’
‘‘ఒక బుల్లి బాబునో, పాపనో కనెయ్యి. అప్పుడు ఖాళీనే ఉండదు’’
‘‘ఏమో! వాడినయినా నా కిష్టమైనట్లు పెంచనిస్తారో లేదో?’’’
‘‘అదేంటే! అలా అంటావ్!’’
‘‘స్పందన లేని జీవితమూ ఒక జీవితమేనా? నువ్వే చెప్పు విశ్వా?’’
‘‘అసలలా ఎలా ఉంటారు?’’
‘‘ఏం రాయిని మాట్లాడమంటే మాట్లాడుతుందా? ఇదీ అంతే’’
‘‘అంటే మీ ఇంట్లో ఎవరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోరా?’’
‘‘ఎందుకు మాట్లాడుకోరు? యంత్రాలకు పని చెయ్యమన్నట్లు సజెషన్స్ ఇస్తాంగా, అలాంటి మాటలు ఉంటాయి రోజంతా. వాటికి ఏ కరువూ వుండదు’’
‘‘పోనీ నీతో మాట్లాడకపోయినా వాళ్ళల్లో వాళ్ళు బాగుంటారా?’’
‘‘ఆ! దానికేం తక్కువ లేదు’’
‘‘అదేమిటో ఆడవారికే భగవంతుడిలా రాసాడు. మనం పుట్టి పెరిగిన ఇంటిని, కుటుంబ సభ్యులను, వారి ఆప్యాయతలను అన్నీ ఒక్కసారిగా వదిలేసుకుని ‘పెళ్ళి’ పేరుతో బయటకు వెళ్లిపోవాలి. అక్కడన్నా సాదరంగా ఆదరిస్తారా అంటే అదీ లేదు. అందరినీ వదిలేసి వచ్చిందని ఎంత అపురూపంగా చూసుకోవాలి ఆమెను.
‘‘అపురూపం అక్కర్లేదు. వాళ్ళతో సమానంగా చూసుకుంటే చాలు. అది కూడా ఉండదు. జీతం ఇవ్వని ‘ఫ్రీ’ పనిమనిషిలా చూస్తారు. ఇంకా నాకన్నా దానికే విలువ ఎక్కువ ఉంటుందేమో’’
‘‘వాళ్ళను మార్చటానికి ప్రయత్నించలేదా?’’
‘‘అసలు నా మాటకు విలువ ఇస్తేనే కదా ఆలోచించటానికి’’
‘‘ప్రక్క ఇళ్ళల్లో వాళ్ళు ఎలా ఉంటారు?’’
‘‘అందరూ అందరేనే! పనులు కోడళ్ళకు అప్పచెప్పి సమావేశమవుతారు. ఇంకా వాళ్ళను ఎలా హింసించాలన్నదే వారి టాపిక్. దానికి టీవీ సీరియల్స్ కూడా మరింత తోడ్పడతాయి. అందులో ఇలా చూపించారు.. ఇందులో ఇలా చూపించారు. అలా చేద్దామా? ఇలా చేద్దామా అని తర్జన భర్జనలు కూడా జరుగుతాయి. ఆ తరువాతే నిర్ణయాలు’’
‘‘ఒక్కళ్ళు కూడా ఇది తప్పు అని ఖండించరా?’’
‘‘్భలేదానివే. అలాంటివాళ్ళను వాళ్ళలో ఎలా కలుపుకుంటారు?’’
‘‘పోనీ మీ ఆడబడుచులయినా నాలుగు మంచిమాటలు చెప్పచ్చుగా’’
‘‘యధారాజా తథా ప్రజా అని ఆ ఇంటి చిలుక ఆ పలుకే కదా పలికేది’’
‘‘మీ వాళ్ళకు పుస్తకాలు చదివే అలవాటు ఉందా?’’
‘‘లేదు. కాస్త ఖాళీ దొరికినప్పుడు ఏ పాత పుస్తకమో, ఏ పాత పేపరో పట్టుకున్నానంటే ఏదో ఒక పని కల్పించి మరీ చెప్పి వెళతారు’’
‘‘ఆ ఆశ కూడా లేదా? ఈమధ్య కమలారామన్ అనే రచయిత్రి రాసిన సర్దుకుపోండి పుస్తకం చదివి అత్తా కోడళ్ళు కొట్టుకోవడం మానేశారట. చాలా సఖ్యంగా ఉంటున్నారని ఎవరో చెప్పగా విన్నాను. నువ్వు కూడా దాన్ని మీ వాళ్ళతో చదివిస్తే కాస్త మార్పు వస్తుందేమోనని అనుకున్నాలే’’
ఇంతలో సుగుణ లోపలికి వస్తూ ‘‘ఏమ్మా! శాంతీ! బాగున్నావా? ఎంతసేపయింది వచ్చి? ప్రక్కింటి పిన్నిగారు పిలిస్తే వెళ్లాను. అన్నట్లు శాంతికి ఏమైనా పెట్టావా విశ్వా?’’
‘‘ఆఁ పెట్టానమ్మా! కబుర్లు’’ అంది విశ్వ నవ్వుతూ.
‘‘చాలా బాగుందే. శాంతా ఈ రోజుకు ఇక్కడ భోంచేసేయ్’’
‘‘అమ్మ వండేసింది. ముందుగానే వస్తున్నానని తెలుసుగా. ఇంకోసారి వచ్చినప్పుడు తప్పక తింటాను పిన్నీ! నీ దగ్గిర నాకు మొహమాటమేముంది?’’
‘‘సరే! నీ ఇష్టం’’
‘‘పద శాంతా! మనం పెరట్లోకి పువ్వులు కోసుకుందాం’’
ఇద్దరూ బయటకు వెళ్లిపోవటంతో పడకమీదకు చేరింది సుగుణ.
చక్కటి సంబంధం. చేజారిపోయిందే. సరిగ్గా తిందామనుకున్నపుడు నోటి దగ్గర స్వీటును ఎవరో లాగేసుకున్నట్లుంది. అది ఎక్కడ ఉన్నా సుఖంగా ఉండాలి అదే తను కోరుకునేది. తనుకూడా ఆ మాట అనలేదు.
‘‘అనకపోతే ఏం ఇది నీకూ ఇష్టముండదుగా. అసలిలాంటివన్నీ విశ్వకి నేర్పింది నువ్వేగా. మాతృభూమిని విడవద్దు.
- ఇంకా ఉంది

-యలమర్తి అనూరాధ 9247260206