డైలీ సీరియల్

మధురమైంది స్నేహమే( కుచేలోపాఖ్యానం - 1)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోమలమైన నల్లకలువలవంటి శ్యామల వర్ణం కలవాడూ, దేవేంద్రుని చేత పొగడబడేవాడు, మెరుపులీనే చెక్కిళ్లు కలవాడు, కౌస్త్భున్ని ధరించినవాడు, అర్థులకు కల్పవృక్షం వంటివాడు. సౌందర్యమూర్తి , చక్రాయుధుడు, జగత్తులో పేరెన్నిక గన్నవాడు, గరుడవాహనుడూ, పీతాంబరధారీ అరవిందాక్షుడూ , మకర కుండలభూషణుడూ, మృదు మధుర భాషణుడు, సుగుణ సాంద్రుడూ అయిన ఆ గోపీజన వల్లభుడు నన్ను కరుణిస్తాడా? నన్ను చూస్తాడా? నన్ను బాల్యస్నేహితుని అసలు గుర్తుపెట్టుకుని ఉంటాడా? అంటూ ఎంతో వేదన, మరెంత ఆనందంతో గబగబా అడుగువేయసాగాడు కుచేలుడు.
కృష్ణ కుచేలులు బాల్యస్నేహితులు. వారిద్దరికీ సాందీపుని ఆశ్రమంలో స్నేహం మొదలైంది. ఆ రోజుల్లో ఇద్దరూ కలసి అడవికి వెళ్లి సమిధలు తెచ్చేవారు. ఎప్పటిలాగానే వారిద్దరూ సమిధలకు ఒకరోజు అడవికి వెళ్లారు. మధ్యాహ్నం దాటేసరికి ఉన్నట్టుండి ఉరుములు మెరుపులతో కూడిన వాన మొదలైంది. కాసేపట్లోనే పెద్ద వాన జోరున కురవసాగింది. ఆ పిల్లలిద్దరూ భయపడి పోయారు. ఒకరికొకరు దగ్గరగా వచ్చి వారిద్దరూ ఒకరి చేతులను మరొకరు పట్టుకొన్నారు. భయపడుతూ ఆ వానలో తడుస్తూ ఓ చెట్టుకిందకు వచ్చారు.
అంతలో దీపం తీసుకొని సాందీప మహర్షి కృష్ణ కుచేలుల కోసం వెతుకుతూ వచ్చారు. ‘నాయనలారా’ అంటూ సాందీపుని గొంతు వినగానే కుచేల కృష్ణులకు ఎంతో ధైర్యం కలిగింది. ‘గురువుగారూ’ అంటూ పరుగెత్తి సాందీపుని దగ్గరకు వెళ్లారు. ఆ గురువుగారు కూడా వీరిద్దరినీ ఎంతో ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని ‘అయ్యో మీరిద్దరూ మాకోసం ఎంతో కష్టపడ్డారు. ఎంతో వేదన అనుభవించారు. మీకు ఇక కష్టకాలం ఉండదు. మీరిద్దరూ సకల విద్యాకోవిదులు అవుతారు. మీరిద్దరినీ విజయశ్రీ వరిస్తుంది ’అని దీవించి ఆశ్రమానికి తీసుకొని వెళ్లారు. అపుడు మొదలైన వారి స్నేహం అట్లా ఉండిపోయింది. సుధాముడు తన కులధర్మాన్ని ఆచరిస్తూ ఒక బ్రాహ్మణ వధువును వివాహం చేసుకొన్నాడు. తన కులవృత్తిని చేసుకుంటూ పిల్లపాపలు గలవాడు అయ్యాడు. కాల క్రమంలో దారిద్య్రం సుధాముడిని కుచేలునిగా మార్చేసింది. కుచేలుడన్న పేరుతోనే అందరూ సుధాముడిని వ్యవహరించేవారు. అట్లాంటి రోజుల్లో
ఓరోజు
సుధాముని భార్య ‘స్వామీ! మనం దారిద్య్రాన్ని అనుభవించగలము. కానీ మన పిల్లలు చిరువయస్సులో ఉన్నారు. వారు ఆకలితో నకనకలాడుతున్నారు. కంచాలు పట్టుకొని ‘అమ్మా అన్నం పెట్టవా ’ఆకలి అవుతోంది అని అడుగుతున్నారు. వారిని నేను చూడలేకున్నాను. మీరు ఏదైనా చేయండి. ’అన్నది. ఆమె బాధను అర్ధం చేసుకొన్న కుచేలుడు తానేమీ చేసి దారిద్య్రాన్ని పోగొట్టలేక అంతా ఆ సర్వేశ్వరుని దయ. మనలను ఎప్పుడు కరుణిస్తాడో ఏమో అంటూ కన్నీరు పెట్టుకొన్నారు.
తన నాథుడలా కన్నీరు కార్చడం చూసిన ఆ మహాఇల్లాలు. ‘స్వామీ! మీరు దుఃఖించకండి. విధిరాతను ఎవ్వరూ అధిగమించలేరుకదా. అన్నింటికీ పరంధాముడు న్నాడు కదా! అంది...
- ఇంకాఉంది