డైలీ సీరియల్

విలువల లోగిలి-15

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన భాషను మరవద్దు అని చెప్పేదానివి. అదే విశ్వ మనసులో నాటుకుపోయింది’’ అంది అంతరంగం.
‘‘నిజమే. అందరూ అలా వలసలు వెళ్లిపోతే ఇక్కడ ఉండేవారు ఎవరు? మన దేశానికి మనం ఉపయోగపడాలి. అందులో న్యాయముంది’’
‘‘మరింకెందుకు బాధపడతావు?’’ అంది ఊరుకోకుండా అంతరంగం.
‘‘అది అలా అన్నందుకు నాకు బాధ లేదు. సంబంధం పోయిందనే’’
‘‘అది అలా అన్నందుకు నాకు బాధ లేదు. సంబంధం పోయిందనే’’
‘‘ఏదీ మనకు రావాల్సింది పోదు. మనది కానిది రాదు అన్నది తెలిసిందేగా’’ వ్యధ చెందకు ఓదార్చింది అంతరంగం.
భర్త పోయినప్పటినుంచీ దానితోనే అన్నివిషయాలు పంచుకుంటుంది. మరి ఎంత కూతురయినా కొన్ని విశ్వకి చెప్పలేనివి ఉంటాయిగా.
ఇంతలో గలగలా కబుర్లాడుకుంటూ స్నేహితురాళ్ళిద్దరూ అక్కడికి చేరారు.
పూలతో మాలను, మాటలతో కబుర్లనూ కట్టేసుకున్నారు.
నిండుగా కట్టిన దండను శాంత పొడుగాటి జుట్టులో తురిమింది విశ్వ. జడకు పూలు ఎంత అందం ఇస్తాయో అనుకుంటూ.
‘‘మరి నేను వస్తాను విశ్వా!’’
‘‘ఆఁ! కుదిరితే నేను అలా వచ్చి కనిపిస్తాలే నవ్వెళ్లేలోపు’’
‘‘కుదిరితే కాదు కుదుర్చుకునిరా. ఎదురుచూస్తుంటాను. మళ్లీ ఎప్పుడు కలుస్తామో! అప్పటిదాకా ఈ జ్ఞాపకాలతోనే బ్రతకాలిగా’’ అంది నిట్టూరుస్తూ.
‘‘తప్పకుండా వస్తాను. సరేనా?’’ అనటంతో సంతృప్తిగా వెళ్లిపోయింది శాంతి.
విశ్వ తనతో పాటూ తన మనసును కూడా తీసుకుని వెళ్లిపోయిందేమోనని అనుమానం వచ్చింది సూర్యచంద్రకు తనను తను చూసుకుంటే. ఎంతో వెలితిగా అనిపించింది.
విశ్వకోరికలో తప్పు ఏమీ కనిపించలేదు. తను తన సంస్థను వదిలిరాగలడా? అదెలా సాధ్యం? అలా అని విశ్వను వదులుకోగలడా? ఇది మాత్రం అసాధ్యం. ఇది జీవిత బంధం. పటిష్టమైన అనుబంధం. పెనవేసుకోవటమే తప్ప తెంపుకోవటం తెలియని సంబంధం. దీనికే ముందుగా తను ప్రాధాన్యత ఇవ్వాలి. అమ్మతో మాట్లాడాలి అనిపిస్తుంది. మళ్లీ మాట్లాడబుద్ధి కావటంలేదు. విశ్వ ఒప్పుకుంటే ఇప్పటికి ఆనందంగా ఆ విషయం చెప్పేసి ఉండేవాడే. అలా జరగలేదుగా!
అందుకే కవిగారు ఇలాంటివి ముందే ఊహించి ‘అనుకున్నామని జరగవు అన్నీ.. అనుకోలేదని ఆగవు కొన్ని’ అని రాసేశారు. ఆ పాటలో ఎంత నగ్నసత్యం ఉంది? జీవితంలో ఎవరైనా ఒకసారైనా ఈ పాటను తలచుకోకుండా ఉండరేమో!
అబ్బో! తనకూ వేదాంతం తెలుస్తోంది.
భువనేశ్వరి ఒకసారి వచ్చి మధ్యలో అతన్ని చూసి వెళ్లింది.
కాసేపు అతన్ని ఒంటరిగా వదిలెయ్యటమే మంచిదనిపించింది ఆవిడకు.
మధ్యమధ్యలో ఇంట్లో ఎవరో ఒకరు వచ్చి పలుకరిస్తున్నారు కానీ అతను మూడ్‌లో లేడని తెలుస్తోంది. ఎందుకలా ఉన్నాడో విషయం తెలియక వదిలేసి వెళ్లిపోతున్నారు.
పనె్నండుగంటలకు సెల్ రింగవటంలో ఎత్తాడు సూర్యచంద్ర.
‘‘ఏంటిరా నాన్నా! స్వీట్ న్యూస్ చెబుతావని ప్రొద్దున నుంచీ ఎదురుచూస్తున్నాను. ఇక ఆగలేక చేసేశాను. ఏమయ్యింది?’’ అడిగింది అమృత ఆత్రంగా.
‘‘అమ్మా! నేను ఇక్కడే ఉండాలంటోంది. తను అమెరికా రాదట’’
‘‘అంతేకదా! ఆ అమ్మాయి నిన్ను కాదనలేదుగా’’
‘‘అనలేదు కానీ అన్నట్టేగా’’
‘‘రెండింటికీ చాలా తేడా ఉందిలేరా’’
‘‘అంటే ఏమంటావమ్మా?’’
‘‘ఆ అమ్మాయి ఇప్పుడు ఇంకా నాకు బాగా నచ్చేసిందంటాను. సరిగ్గా నేను కూడా గతంలో మీ నాన్నగారిని ఇదేమాట అడిగాను. తను ఒప్పుకోలేదు. తనకోసం, తన ప్రేమకోసం నన్నూ, నాభావాలను నేనే వదిలేసుకుని తనవెంట వచ్చేసాను. ఇపుడా పని నువ్వు చేస్తావు. అంతే!’’
‘‘అదంత సులభమా అమ్మా?’’
‘‘అనుకుంటే ఏదీ కష్టమూ కాదురా. అనిరుధ్‌కి నీ కంపెనీ అప్పచెబుతువుగానీ. నువ్వు ఇండియాలో దాని బ్రాంచ్ పెట్టుకుందువుగానీ. దానికి కావాల్సిన ఏర్పాట్లు గురించి చూసుకో. నాన్నగారితో నేను మాట్లాడతాను. ఏమంటావ్?’’
‘‘అంతేనా? నిముషంలో ఎంత తేలిగ్గా సమస్యను విప్పదీసేసావ్. నేను ప్రొద్దుననుంచీ తలబద్దలు కొట్టుకుంటున్నాను. నువ్వు సూపర్ అమ్మా’’ అన్నాడు ఆనందంగా.
‘‘సూపరా! నా ముఖమా? బాధలో ఉన్నప్పుడు కొన్ని గుర్తుకురావంతే’’
‘‘ఏమో నువ్వెంతో తేలిగ్గా తీసిపారేస్తున్నా నా తలమీద వున్న కొండంత బరువును ఒక్క నిముషంలో తీసేసినట్లయింది’’ అన్నాడు ఉత్సాహంగా.
‘‘ఇంకేం? విశ్వా వాళ్లింటికి నువ్వే వెళ్లి ఆవిషయం చెప్పేయ్’’
‘‘అలాగేమ్మా?’’
‘‘ఒరేయ్! ఒరేయ్! ముందీ విషయం పెద్ద వదినకు చెప్పి వెళ్ళు. లేకపోతే అస్సలు బాగోదు’’
‘‘అలాగే.. అలాగే.. మళ్లీ నీకు ఫోన్ చేసి అన్నీ వివరంగా మాట్లాడతా. బాయ్! బాయ్!
- ఇంకా ఉంది

-యలమర్తి అనూరాధ 9247260206