డైలీ సీరియల్

మితిలేనిది భగవంతుని ప్రేమ ( కుచేలోపాఖ్యానం - 3)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తన దగ్గరే కూర్చుని కబుర్లు చెబుతున్న రుక్మిణి ని ఆగమని చెబుతూ గబగబా అడుగులు వేసి కుచేలుని దగ్గరకు వచ్చి అమాంతం కౌగిలించుకని ‘సుధామా! ఎలా ఉన్నావు?’ అంటూ ఆర్ద్రతో అడిగాడు. స్వాగతం పలికాడు. బంగారు కలశంలోని నీరు పోసి పాద ప్రక్షాళనం కావించాడు. ఆ నీటిని తన తలపై చల్లుకున్నాడు.మంచి సున్నితమైన వస్త్రాలతో ఆ కుచేలుని పాదాలను తుడిచాడు. పాద్యం సమర్పించాడు. గోవును సమర్పించాడు. కస్తూరీ, పచ్చకర్పూరం కలిసిన మంచి గంధాన్ని కుచేలుని శరీరానికి అలిదాడు. అగరుధూపం వేసి మార్గాయాసం తీరేట్లుగా స్వయంగా వీవన వీచాడు. కుచేలుడు తన బాల్యస్నేహితుని సేవలకు పొంగిపోయాడు.
అపరిమితానందంలో కుచేలుని కళ్లల్లో నీరు ఉబికి వచ్చాయి. కృష్ణుడు ఆనంద భాష్పాలనుకారుస్తూ భుజం పైన చేయి వేసి దగ్గరగా పొదివి పట్టుకొని నడిపిస్తూ హంసతూలికా తల్పంపైన కూర్చొన చేశాడు. యోగ క్షేమాలను విచారించాడు. గురువుగారి వద్ద చేసిన చిన్నచిన్న పనులను ఇద్దరూ తలుచుకున్నారు. ఆనాటి ముచ్చట్లు చెప్పుకున్నారు. అంతలో రుక్మిణీ షడ్రసోపేతమైన భోజన ఏర్పాట్లు చేసింది. కుచేలునికి దగ్గర ఉండి రుక్మీణీ కృష్ణులు భోజనం వడ్డించారు. కొసరి కొసరి తినిపించారు. కుచేలుడు ఎంతో సంతోషంతో అన్నం తిని ఆసనంపై కూర్చున్నాడు. కృష్ణుడు మంచి సువాసనలిచ్చే తాంబూలాన్ని కుచేలునికి సమర్పించాడు.
‘సుధామా! మా వదినగారు నాకోసం ఏదో ఒకటి పంపించి ఉంటుంది కదా. మరి ఇంతసేపు అయినా నాకివ్వమేమి’ అని అడుగుతూ కుచేలుని అంగవస్త్రాన్నంతా వెతికాడు. తాను అటుకులు తెచ్చానని ఆ పంచభక్ష్య పరమాన్నాలు తినే కృష్ణునితో చెప్పలేక తలవంచుకుని బాధపడ్డాడు కుచేలుడు. అంతలో అటుకుల మూట వెతికి పట్టుకొని ఈ అటుకులు నాకు ఎంతో ఇష్టం. అందుకే మా వదినగారు పంపించారు అంటూ ఆ అటుకులను గుప్పిట పట్టుకొని తన నోట్లో వేసుకొని ఆ హా ఎంత రుచిగా ఉన్నాయి ఈ అటుకులు. సర్వలోకాలను కూడా ఈ అటుకులు ఆనందాన్ని కలిగించగలవు అన్నాడు. మిగతా అటుకులు తినబోతుండగా రుక్మిణీదేవి వారిస్తూ అవి మాకివ్వండి. మేము ఆ సుధాముని ప్రసాదంగా తీసుకొంటాము అని రుక్మిణీ దేవి తీసుకొంది. కొంతసేపటికి కుచేలుడు బయలుదేరుదామనుకున్నాడు. ఆ విషయం కృష్ణుడితో చెప్పాడు. వారిద్దరూ స్నేహితులు చాలాసేపు ముచ్చటించుకొని ఇక తప్పదు కనుక కుచేలుడిని కృష్ణుడు సాగనంపడానికి ఉద్యుక్తుడయ్యాడు. రుక్మిణీ కృష్ణులు ఇద్దరూ వచ్చి కుచేలుని సాగనంపారు. ఇంతసేపు కుచేలుడు పొందిన అతిథి సేవను అక్కడున్న పరిచారికలు విచిత్రంగా చూస్తున్నారు.
‘ఆహా ! ఏమీ ఈ భాగ్యం. మహా మహా మునులు, ఎన్నో వేల యేండ్లు తపస్సు చేసినా పొందలేని భాగ్యాన్ని ఈ బడుగు బాపడు పొందాడు కదా. ఇతడేమి తపస్సు చేశాడో, ఎన్ని పుణ్యకార్యాలు చేశాడో కదా కృష్ణుని సమాదరాన్ని పొందాడు’ అని ఆ పరిచారికలు అనుకొన్నారు.

- ఇంకాఉంది

- డా. రాయసం లక్ష్మి. 9703344804