డైలీ సీరియల్

విలువల లోగిలి-17

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సరే! నీకెంత కావాలో అంత టైమ్ తీసుకో’’
‘‘్థంక్స్ చందూ’’ అంది అప్రయత్నంగా.
తన పిలుపునకే కొత్త మాధుర్యం వచ్చినట్లనిపించింది అతనికి.
‘అండీ’ అనే పైపైన గౌరవం కంటే ఎదుటివాళ్ళ మాటను మన్నించటంలో ఎక్కువ ఇష్టం చూపించాలి అనేది తన భావన. అది అతనికి అర్థమయ్యిందా?
అతన్ని ప్రశ్నార్థకంగా చూసింది.
‘‘విశ్వా! నువ్వే కాదు నీ కళ్ళు కూడా మాట్లాడుతాయే!’’
అతని మాటలకు ‘అవునా!’ అన్నట్లు చూసింది.
అప్పుడు చెప్పాడు అతను ఆమె మనసులో మాటను.
ఆనందంతో ఆ రెండు హృదయాలు ఏకమయ్యాయి ఆ క్షణంలో. వాటిని ఊపిరి వీడేదాకా విడదీయకూడదన్నదే ఆ జంట ప్రేమతో చేసుకున్న సంతకం.
ఇల్లంతా చూసిన అతనికి అనిపించింది, తడికెలతో కూడా ఇంత సుందర హర్మ్యాన్ని నిర్మించుకోవచ్చా అని.
‘‘పెరట్లోకి వెళదాం’’ చందూ అన్నమాట పెదాల దగ్గరే ఆగిపోయింది.
‘‘నాకు చందూ అని నువ్వు పిలుస్తుంటే చాలా బాగుంది విశ్వా’’ అన్నాడు.
పెరడు అంతా చూసాక అంత చిన్న స్థలం ఇన్ని మొక్కలు ఎలా ఒదిగిపోయాయో అతనికి అర్థం కాలేదు. టమోటాలు, వంకాయలు, బెండకాయలు, ఆకుకూరలు, చామంతులు, డిసెంబరాలు, గులాబీలు, నిమ్మ, మామిడి, జామ, కొబ్బరి, సపోటా.. అసలు ఈ ఇంట్లో లేని చెట్టు ఉందా?
దోరగా వున్న జామకాయను తెంపి చందూ చేతిలో పెట్టింది. పెరటి గుమ్మానికి ఆర్చిలా అల్లుకున్న సన్నజాజిచెట్టు, నిటారుగా వున్న సన్నజాజి మొగ్గలు.
వాటిని చూస్తూ ‘నీలాగే’ అన్నాడు.
‘‘జాజిమొగ్గలానా?’’
‘‘ఊ.. నువ్వంటే.. నీ వ్యక్తిత్వం’’
‘‘ఓ.. అదా..’’ అంటూ నవ్వేసింది విశ్వ.
వెనక వైపు జంట మల్లి ఉంది అంటూ అటు నడిచింది.
పెద్ద పెద్ద మొగ్గలు అందానికే అందంలా.
‘‘ఇందాక నా స్నేహితురాలు ‘శాంతి’ వచ్చింది. లేకుంటే అన్ని చెట్లకు కనకాంబరాలు కూడా ఉండేవి. అపుడు ఇంకా బాగుంటుంది’’.
కనకాంబరాలు ఉంటే చెట్లు ఎలా ఉండేవో తెలియదు కానీ అలా చెబుతున్న విశ్వ రూపం మాత్రం గుండె నిండా నిండిపోయింది.
చేజార్చుకున్న వస్తువు మళ్లీ చేతికి చిక్కినట్లయింది.
‘విశ్వ’ వస్తువా అంతరంగం గయ్యిన లేచింది.
‘‘ఇప్పుడు నువ్వు నా మూడ్ చెడగొట్టకు. విశే్వ అన్నీ నాకు. ఒక్క మాటలో చెప్పాలంటే విశే్వ నా ప్రాణం’’
‘‘అబ్బో’’ అంది అంతరంగం.
ప్రేమ కబుర్లు మొదలయ్యాయే అనుకోకుండా ఉండలేకపోయింది. అప్పటిదాకా వున్న లోకమంతా మాయమయిపోయి తామే లోకంలా అనిపించటమేగా ప్రేమంటే!
తమనే ఈ ప్రపంచం అన్నట్లు కబుర్లు చెప్పేసుకుంటున్న ఆ జంటను అప్పుడే నిద్రలేచిన సుగుణ చూసి ఆశ్చర్యపోయింది.
ఇంతలో వీళ్ళిద్దరూ ఇంత దగ్గిర ఎలా అయిపోయారా అని. వాము ఆకులు తెచ్చి వేడి వేడిగా బజ్జీలు వేసింది.
‘‘ఇవి నేనెప్పుడూ తినలేదు. చాలా బాగున్నాయి’’ అని మెచ్చుకున్నాడు అత్తగారిని.
ఇద్దరి ద్వారా విషయం తెలుసుకున్న ఆమె ఆనందానికి అవధులు లేవు.
తమకింతటి అదృష్టమా!!?
విశ్వ ఎంతో ఎంతో పుణ్యం చేసుకుంది అనుకుంది మనసులో. ఆ భగవంతునికి మనసారా అంజలి ఘటించింది.
వెంటనే వాళ్ళిద్దరినీ అక్కడ వదిలేసి భువన దగ్గరకు వెళ్లింది కృతజ్ఞతలు తెలియజేయటానికి.
‘‘్భలేదానివే. నువ్వు నాకు చెల్లెలు లాంటిదానివి. మనలో మనకి ఈ ఫార్మాలిటీస్ ఏమిటి? ఇపుడు నిజంగా చెల్లెలువయిపోయావు. మీ వియ్యపురాలితో మాట్లాడించనా?’’ అడిగిందావిడ.
‘‘ఇప్పుడొద్దు. ఆనందంతో నాకు మాటలు రావటంలేదు’’-
‘‘ఇంట్లో ఎవరికీ ఇంకా ఈ విషయం తెలియదు. చెబితే గోల గోలే. అందరికీ విశ్వ అంటే మహా ఇష్టం కదా!’’
‘‘అదంతా నీ ఆదరమే’’
‘‘పెద్ద పెద్ద మాటలు మన మధ్య వద్దు సుగుణా. మనమంతా మనుషులం. తోటివాళ్ళం. ఒకరికంటే ఒకరు ఎక్కువా కాదు, ఒకరికంటే ఒకరు తక్కువా కాదు. కర్మఫలాలు బట్టి కొందరు ధనవంతులుగా, కొందరు బీదవాళ్ళుగా పుట్టినంత మాత్రాన తేడాలు చూపించటం సంస్కారమనిపించుకోదు.
ఒకరినొకరు సహాయం చేసుకోవటానికే ఈ బీద, గొప్ప ఉన్నాయనుకుంటే దేశం ఎప్పుడూ సుభిక్షంగా ఉంటుంది. అందులో వున్న మనమంతా కూడా. నిజం చెప్పాలంటే అందర్నీ ప్రేమించే గుణం వున్న విశ్వ ముందు ఈ డబ్బు ఎందుకూ పనికిరాదు. విశ్వ తులసి ఆకు అంత పవిత్రమైంది. తను మా కోడలుగా మా ఇంట అడుగుపెడుతోంది అంటే మేము చాలా అదృష్టవంతులమని చెప్పాలి.
సుగుణ కళ్ళనిండా నీళ్ళు.
‘‘ఏమిటిది పిచ్చిపిల్లలా, పండుగ చేసుకోవాల్సిన సమయం, కన్నీళ్ళేమిటి?’’
‘‘ఇవి కన్నీళ్ళుకాదు భువనక్కా! ఆనంద బాష్పాలు’’ అంది సుగుణ.
ఇద్దరూ ఆనందంగా కౌగలించుకున్నారు.
- ఇంకా ఉంది

-యలమర్తి అనూరాధ 9247260206