డైలీ సీరియల్

పరమాత్ముని క్రీడా వినోదమే సృష్టి (కుచేలోపాఖ్యానం - 4)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలా బయలుదేరి తిరిగి తన నిజనివాసానికి కుచేలుడు ప్రయాణం సాగిస్తూ మార్గమధ్యంలో కుచేలుడు కృష్ణుడు చేసిని మర్యాదను తలుచుని అర్భ దరిద్రుడైన నేను ఎక్కడ? ఆగర్భ శ్రీమంతుడైన కృష్ణుడెక్కడ? అచ్యుతుడు నా పై అనురాగంతో నా సిగలో పూవులు ముడిచాడు. నా కాళ్లు కడిగాడు. రుక్మిణీదేవి కూడా వచ్చి నన్ను ఆదరించింది. నేనెంత భాగ్యశాలినో కదా. తన కౌగిట చేర్చుకుని ఎంతో మురిసిన ఆ కృష్ణుని కన్నుల్లో తడిని చూశాను. తన పర్యంకంపైన తన పక్కనే నన్ను కూర్చుని బెట్టుకుని వీవన వీచాడు. ఆహా ఆయనకు ఎంత బ్రాహ్మణ భక్తి ఉన్నది. పైగా నన్ను తన స్నేహితునిలాగానే గౌరవించాడు కదా. ఇక నాకు కావాల్సిందేముంది? ఇంతకన్నా భాగ్యము ఇంకొకటి ఉంటుందా అని పరమానంద పడ్డాడు. కానీ నేను ధనాపేక్షతో వచ్చాను కదా. మరి నాసంగతినేకాదు సర్వలోకాల సంగతిని తెలుసుకొనే ఆ కృష్ణయ్య నేనెందుకు వచ్చానో తెలుసుకోలేకపోయాడా? లేక తెలుసుకొని కూడా ధనం హెచ్చిన మదమెచ్చును కదా దరిద్రుడు సంపన్నుడైతే గర్వం పొందుతాడు. కన్ను మిన్నుగానక చేయరాని తప్పులు చేస్తాడు. అటువంటి ధనం నా ప్రియ మిత్రునకు నేనెందుకు ఇవ్వాలి. ఆయన్ను ధర్మమార్గంనుంచి ఎందుకు తప్పించాలి అనుకున్నాడా? అనే సందేహం తెచ్చుకున్నాడు.
ఈ సృష్టి అంతా పరమాత్ముని లీలావినోదమే కదా. సృష్టిలో జరిగే వింతలు వినోదాలను చూస్తు ఉంటాడుఆ పరమాత్ముడు. కర్మసిద్దాంతం ప్రకారం చేసుకొన్నవారికి చేసుకొన్నంత మహాదేవ అన్నట్టు పూర్వజన్మలో చేసిన పాపాలకు శిక్ష అనుభవించాల్సిందేకదా. పరమాత్మ సృజియంచుకున్న అవతారంలో నేను స్నేహితుడినయ్యాను అంటే దానర్థం నా కర్మ నశించి పోదుకదా. పరమాత్మను నా నీ భేదాలేముంటాయ. సర్వులూ ఆయన బిడ్డలే. ఎవరి కర్మానుసారం వారి జీవితాన్ని తీర్చుదిద్దుతాడు. పరమాత్మ కనికరం గలవాడు కనుక ఈ జన్మలోనైనా నాకు భక్తి అనే మొక్క నా హృదిలో చిగురించింది.
ధనం ఇవ్వకున్నా నన్ను గొప్పగా సత్కరించాడు. అది చాలు. నన్ను కౌగిట చేర్చుకుని కుశలం అడిగాడు అది చాలు అనుకొంటూ ఆ కౌగిలి ఆనందాన్ని పదేపదే నెమరువేసుకొంటూ కృష్ణుని ఊసులు తిరిగి తిరిగి అనుకొంటూ తన ఇంటికి వచ్చాడు. అక్కడ మనోహరమూ సుందరమైన మహాసౌధాన్ని కుచేలుడు చూశాడు. ఆహా ఎంత సుందర భవనమిది. ఇది ఎవరిదో కదా? అనుకొన్నాడు. కానీ ఇక్కడేకదా మా ఇల్లు ఉండాల్సింది. మరి అదేమైంది. పిల్లలెవరూ కనిపించలేరేమి? ఎటు వెళ్లారు. బహుశా ఆకలితో బాధపడలేక ఈ పెద్ద భవంతిలో ఉన్నవారు ఎవరైనా ఏదైనా ఇస్తారని వెళ్లి ఉంటారా? అయ్యో నేను కృష్ణుడిని దగ్గరకు కూడా వెళ్లాను. నోరు తెరిచి ఈ ఇల్లు గడపడానికి అవసరమయిన కాస్త ధనాన్నై నా అడిగి ఉండాల్సింది. అయ్యో ఈ నా పిల్లలు ఎలా ఉన్నారోకదా అని తల్లడిల్లుతూ అటు ఇటు చూస్తున్నాడు.
- ఇంకాఉంది

- డా. రాయసం లక్ష్మి