డైలీ సీరియల్

విలువల లోగిలి-18

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మరునాడు ఆదివారం కావడంతో ఈ సందర్భంగా బుల్లి విందు ఏర్పాటుచేసుకున్నారు.
అసలైన గెస్టు విశ్వ మాత్రం కాసేపు శాంత దగ్గర ఉండి వస్తానని చెప్పి వెళ్లింది. మరి కాసేపటిలో తను వెళ్లిపోతుందిగా. వస్తానని మాట ఇచ్చింది. మాట ఇవ్వకపోయినా వెళ్ళేదే. చిన్నప్పటినుంచీ తామిద్దరూ ఒకేచోట పెరిగారు. అప్పచెల్లెళ్ళులా కలిసే ఉన్నారు. ఇళ్ళు వేరువేరయినా ఇద్దరూ ఒకేచోట ఉండేవారు. అది నిన్నలా తన కుటుంబం గురించి చెబుతుంటే మనసు ఎంత కలత చెందిందో? మనుషులు తోటి మనిషిని ఎందుకు గౌరవించరు? ఆ మాత్రం సంస్కారం లేనివారు మనుషులెలా అవుతారు? వాళ్ళు జంతువులతో సమానమే! ఒక్కసారి వెళ్లి వాళ్ళలో మార్పు తేగలదేమో ప్రయత్నించి చూడాలి! ప్రేమకు కరగని మనిషి ఉండడని తన నమ్మకం. ఇదంతా ముందే చెబితే తనని శాంత రానివ్వదు. ఈ పనిమీద వస్తున్నానంటే అసలు ఒప్పుకోదు. చక్కని పథకంతో దీన్ని సాధించాలి అని
దృఢంగా నిశ్చయించుకున్నాక మనసుకు తృప్తిగా అనిపించింది. తనకోసమే ఎదురుచూస్తున్నట్లు గుమ్మంలోంచే స్వాగతం చెప్పింది శాంత. దాని సంతోషం ఇక్కడికే పరిమితం అన్నది ప్రతిక్షణం గుర్తుకువస్తుంటే మనసునెవరో మెలిపెట్టినంత బాధవేస్తోంది. అది ఎలా నవ్వగలుగుతుంది? ఇంట్లో వాళ్ళు బాధపడతారని నోరు విప్పదు. అక్కడ తను సంతోషంగా ఉన్నట్లు అందరి ముందు నటిస్తోంది సహజ నటి సావిత్రిలా.
‘ఏమ్మా! శాంత లేకపోతే మా ఇంటికి రావా? చాన్నాళ్లయింది నిన్ను చూసి’’ గోవర్దనం బాబాయి పలకరింపు, శాంత తండ్రి.
‘‘స్కూలుకు సెలవు పెట్టావా బాబాయ్?’’
‘‘అవునమ్మా! శాంతతో కాసేపు ఉన్నట్లు ఉంటుందని’’
‘‘మంచి పని చేసావ్’’ అంటూనే వంటింటి వైపు వెళ్లింది విశ్వ. అక్కడ వరలక్ష్మి వంటపనిలో హడావుడిగా వుంది.
‘‘నన్నూ ఒక చెయ్యి వెయ్యనీ పిన్నీ’’ అంది పక్కనే కూర్చుంటూ.
‘‘విశ్వా! నువ్వా! ఈమధ్య నల్లపూసయ్యిపోయావు’’
‘‘అదేం లేదు’’
‘‘శాంత వెళుతోందిగా. పట్టుకెళుతుందని జంతికలు చేస్తున్నా. ఈ తల్లులకు ఎప్పుడూ పిల్లలకు ఏదో చెయ్యాలనే తపనే. అది పిల్లలలో తక్కువ కనిపిస్తుంది. అదెందుకో తనకర్థం కాదు. వీరిలో ఎంత తపన వుందో వారిలో కూడా అంతే ఉండాలిగా. ఈ భేదానికి అర్థం ఆ భగవంతుడే చెప్పాలి’’ అని మనసులో అనుకుంది.
నువ్వూ పిల్లవే.. అంతరంగం గుర్తుచేసింది. తెలుసులే అని దానికి సమాధానమిస్తూ ‘నేను చేస్తాను’ అంటూ అందుకుంది విశ్వ.
ఒక గంట అలా గడిచిపోయింది వాళ్ళతో.
ఇంతలో శాంత తమ్ముడు గిరి వచ్చి విశ్వక్కా ఆడుకుందాం రా అని అడిగాడు.
‘‘ఇప్పుడు నాకు కాస్త పని ఉంది. ఈసారి వచ్చినపుడు తప్పకుండా ఆడుకుందాం. సరేనా’’ అంది విశ్వ.
‘అలాగే’ అంటూ వెళ్లిపోయాడు.
‘‘శాంతా! మరి నేను వెళ్తానే’’ అంది వీడ్కోలుకు సంసిద్ధవౌతూ.
మళ్లీ ఎప్పుడు కలుస్తామో అనుకుంటూ విడిపోయారిద్దరూ.
***
మద్దివారిది చాలా పెద్ద కుటుంబం. ఈ తరానికి కోటేశ్వర్రావు మూలస్తంభం. ఆయనకు నలుగురు పిల్లలు. రాజకీయాలన్నా, రాజకీయ నాయకులన్నా మక్కువ వున్న ఆయన తన పిల్లలకు అదే రకంగా మోహనగాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, లాల్‌బహదూర్ శాస్ర్తీ అని పెట్టుకున్నారు. అలాగే కుమార్తెలకు సరోజినీ, విజయలక్ష్మి, భారతరత్న అనే పేర్లు పెట్టి తన దేశభక్తిని చాటుకున్నారు. పెద్ద కొడుకు తనతో పనిచేసే తోటి లెక్చరర్ భువనను చేసుకున్నాడు. వారికి భగవంతుడు పిల్లల్ని ప్రసాదించలేదు. విద్యార్థులలోనే పిల్లలను చూస్తూ గడిపేస్తోందావిడ. ఇక రెండోవాడు కాత్యాయనిని చేసుకున్నాడు. వాళ్లకు అనిరుధ్ పుట్టాడు. ఇద్దరు తల్లుల ముద్దుబిడ్డగా పెరిగాడు. ఇక మూడవవాడు బోస్‌ను అమెరికా అమ్మాయి గ్రేసీ ప్రేమించి పెళ్లిచేసుకుని తనతో తీసుకువెళ్లిపోయింది. ఆ కుటుంబం అక్కడే చాలాకాలంగా స్థిరపడిపోయింది. ఇక లాల్‌బహదూర్ శాస్ర్తీ పెళ్లికి విముఖత చూపించి బ్రహ్మచారిగా మిగిలిపోయి సమాజ శ్రేయస్సుకు పాటుపడుతూ ఉంటాడు. ఇక ఆడపిల్లలలో పెద్దది సరోజినీ పెళ్లిచేసుకున్న ఏడేండ్లకే భర్త కాలం చేయటంతో పిల్లలు ఆకాష్, వికాష్‌లతో పుట్టింటికి చేరింది. విజయలక్ష్మి దుబాయ్‌లోనూ, భారతరత్న కలకత్తాలోనూ ఉంటారు. అప్పుడప్పుడూ ఫంక్షన్స్‌లో కలుస్తూ ఉంటారు.
ఆడపిల్ల ఆ ఇంట లేని లోటును విశే్వ తీరుస్తూ ఉంటుంది.
విశ్వ, సూర్యచంద్రల పెళ్లి మాటలు జరిగిన సందర్భంగా ఈ రోజు ఆ ఇంట్లో సందడి మొదలైంది.
అమృత వారికి పెదనాన్న కూతురైనా ఆ ఇంటి ఆడపిల్లలాగే పుట్టి పెరిగింది. కుటుంబ సభ్యురాలిగా వాళ్ళతో కలిసిపోయింది. విడదీయరాని బంధాన్ని పెంచుకుంది. విశ్వను చేసుకోవాలనుకోవటంతో అది మరింత దృఢపడింది. సాయంత్రం దాకా ఆటలతో, పాటలతో ఆ ఇల్లు మారుమ్రోగింది.
సూర్యచంద్ర, విశ్వ ప్రేమల వివాహం అంగరంగ వైభవంగా చెయ్యాలని పెద్దలందరూ తలచినా విశ్వ దానికి అంగీకరించలేదు. దానికి చేసే ఖర్చుని అనాధ పిల్లలకిద్దామని, సింపుల్‌గా రిజిష్టర్ మ్యారేజ్ చేసుకుందామని ప్రతిపాదించింది. అదే విశ్వ ఛారిటబుల్ ట్రస్ట్ ఆవిర్భావానికి నాంది అయ్యింది. ట్రస్ట్‌బాధ్యతను విశ్వ తీసుకుంది.

- ఇంకా ఉంది

- యలమర్తి అనూరాధ