డైలీ సీరియల్

ఒయాసిస్..20

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘నిజమే.. చెయ్యకూడని పని చేస్తున్నామన్న న్యూనతా భావంతో ఉంటారు కనుక వాళ్లెవరూ నిజం చెప్పరు.. కానీ కొన్ని కేసులు నీ దృష్టికి వచ్చాయన్నావు. ఒకటీ రెండు కేసుల గురించిన డిటెయిల్స్ ఇవ్వు..’’
‘‘ఈమధ్యనే ఒక అమ్మాయి చేయించుకుంది.. కానీ ఆమె డీటెయిల్స్ చెప్పటం బాగోదు..’’
‘‘నేను ఎవరికీ చెప్పను.. కేవలం నా ఇన్‌ఫర్మేషన్ కోసం..’’
‘‘గీత అని ఒకమ్మాయి చేయించుకుందండీ..’’
‘‘ఆ అమ్మాయి నీకెలా తెలుసు?’’
‘‘ఒక ఫ్రెండ్ ద్వారా తెలిసింది..’’
‘‘నువ్వెక్కడుంటావు?...’’
‘‘కమలానగర్‌లో..’’
‘‘కమలానగర్‌లో ఎక్కడ?’’
‘‘స్ట్రీట్ నెం.1’’
‘‘్ఫ్యమిలీతో ఉంటున్నావా?..’’
‘‘లేదండీ.. ఫ్రెండ్‌తో..’’
‘‘‘ఫ్రెండంటే.. మగా, ఆడా..’’
‘‘ఆడ.. గర్ల్‌ఫ్రెండ్.. నా క్లాస్‌మేట్..’’
‘‘ఎక్కడ చదువుకున్నారు?..’’
‘‘విద్యారణ్య హైస్కూల్‌లో క్లాస్‌మేట్.’’
‘‘నీ ఫోన్ నెంబరివ్వు.. అవసరమైతే కాంటాక్ట్ చేస్తాను..’’
సతీష్ సెల్ నెంబర్ రణధీర్ నోట్ చేసుకుని అతనికి తన నెంబరిచ్చాడు.
‘‘నీకు అవసరం వుంటే నాకు ఫోన్ చెయ్యి.. ఎలాంటి హెల్ప్ కావాలన్నా చేస్తాను..’’ అన్నాడు రణధీర్.

6
ఉదయం ఎనిమిది గంటలయ్యింది. రణధీర్ ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ సింహాద్రి ఇంటికి వెళ్ళాడు.
‘‘ఆయన పూజ చేస్తున్నాడు.. కూర్చోండి..’’ అన్నదాయన భార్య.
సోఫాలో కూర్చున్నాడు రణధీర్. పక్క గదిలో సింహాద్రి శివుడికి అభిషేకం చేస్తున్నాడు. ఉచ్ఛస్వరంలో నమకం చదువుతున్నాడు. ‘శివాం గిరి త్రతాం..’’
ఇంతలో సెల్‌ఫోన్ మోగింది. పూజ ఆపేసి ఫోన్ అందుకున్నాడు.
‘‘ఆ, చెప్పు.. ఇవాళ మీటింగ్ ఉందా? ఎన్నింటికి? నేనెందుకు? ఏదో సామెత చెప్పినట్లుంది. నేను రిటైరైనా, ఇంకా ఈ మీటింగ్‌లూ, డిస్కషన్లూ.. సరే.. సరే.. నేను పూజలో ఉన్నాను..’’ అని ఫోన్ పక్కన పెట్టి మళ్లీ పూజ మొదలెట్టాడు.
రెండు నిముషాల తర్వాత మళ్లీ ఫోన్.. పూజకు బ్రేక్.
‘‘హలో.. ఊ.. చెప్పరా.. మీ నాన్నని హాస్పిటల్‌లో చేర్చారా..? ఏమైంది వాడికి?.. అంత షుగరుంటే ఏది బడితే అది తినేస్తాడు. జిహ్వచాపల్యం చావలేదు వాడికి.. సరే వస్తాలే..’’
మళ్లీ పూజ మొదలెట్టాడు. పావుగంట తర్వాత భార్యని పిలిచాడు..
‘‘ఏమేవ్.. ఎక్కడ తగలడ్డావ్..? నైవేద్యానికి పట్టురా..’’ అని కేకేశాడు.
ఆమె పరుగు పరుగున రెండు గినె్నలు పట్టుకెళ్లింది. పది నిముషాల తర్వాత ఆయన బైటికి వచ్చి రణధీర్ ఎదురుగా కూర్చున్నాడు. విభూతి పట్టీలు, పట్టుబట్టలతో..
‘‘మీరే పనిమీద వచ్చారు?’’ అని అడిగాడు.
రణధీర్ తన గురించి చెప్పుకున్నాడు.
ఆయన మొహం చిట్లించాడు.
‘‘మీకు నాతో ఏమిటి పని?’’ అని అడిగాడు.
‘‘మీరు అహోబలరావుగారి ఇంజనీరింగ్ కాలేజీలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు కదా.. ఆయన భార్య హత్యచేయబడింది. ఆ విషయంలో అందరినీ కలిసి సమాచారం సేకరిస్తున్నాం..’’ అన్నాడు రణధీర్.
‘‘మీ డ్యూటీ మీరు చేస్తున్నారు.. మంచిదేగానీ నేనేం చెయ్యగలను?’’ అన్నాడాయన.
‘‘అహోబలరావుగారు ఎలాంటివారు?’’
‘‘ఎలాంటివారంటే.. మంచివారే.. ఈ రోజుల్లో ఎక్కువ కష్టపడకుండా ఎక్కువ డబ్బు తక్కువ కాలంలో ఎలా సంపాదించాలన్నదే ప్రతివాడి ధ్యేయం. అందుకు అనేక మార్గాలున్నాయి. రాజకీయాలు, సినిమాలు, రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్‌లు, కాంట్రాక్టులు.. డబ్బు సంపాదించాక దాన్ని ఎలా కాపాడుకోవాలి లేదా ఎలా రెగ్యులర్ సోర్స్ ఆఫ్ ఇన్‌కంగా మార్చుకోవాలి అని ఆలోచిస్తున్నారు.. మంచిదే.. డబ్బును, ఎరువును మురగబెట్టకూడదు.. వెదజల్లితే పంట పండుతుంది..’’ అన్నాడు సింహాద్రి.
‘‘శే్వతగారి గురించి చెప్పండి’’
‘‘ఆమె చాలా మంచి డాక్టర్ అని అందరూ చెబుతుంటే విన్నాను.. నాకూ నా విషయాలు చూసుకోవటానికే సరిపోతుంది. నేను ఎస్సీగా రిటైర్ అయి ఆరేళ్ళయింది. ఇప్పటికీ మా డిపార్ట్‌మెంట్ వాళ్ళు రోజూ ఫోన్ చేసి పిలుస్తూనే ఉంటారు.. చూస్తూనే ఉన్నారు కదా.. ఇరవై నాలుగు గంటల్లో ఒక అరగంట దేవుడికి కేటాయిద్దామంటే కుదరటంలేదు.. స్వామీ క్షమించు నీకు తెలియందేముందని ఒక నమస్కారం పెట్టేస్తున్నాను’’ అన్నాడు సింహాద్రి.
‘‘నిజమేనండీ.. రిటైర్ అయినాక కూడా ఇంత బిజీగా, ఇంత యాక్టివ్‌గా ఉన్నారంటే భగవద్కృప ఉండబట్టే సర్.. ఒక చిన్న ఇన్‌ఫర్మేషన్ కోసం వచ్చాను. శే్వత-అహోబలరావుల మధ్య భార్యాభర్తల అనుబంధం ఎలా ఉండేది? మీరెప్పుడన్నా ఏమన్నా వాళ్ళ మధ్య పొరపొచ్ఛాల గురించి విన్నారా?’
‘‘ఏమో, నాకైతే తెలియదు.. భార్యాభర్తలన్నాక చిన్న గొడవలు అందరి ఇళ్ళలోనూ ఉంటూనే ఉంటాయి. పూర్వంలా కాదు గదా.. ఆడవాళ్ళు కూడా బాగా చదువుకుంటున్నారు.. వాళ్ళకీ మాకేం తక్కువన్న ఇగో ఉండటం సహజమే కదా..’’
‘‘ఇద్దరిమధ్యా ఏదన్నా ఇగో ప్రాబ్లెంలాంటిది?’’ ‘‘అవి బయటవాళ్ళకేం తెలుస్తాయండీ.. ఇంట్లో ఎవరూ లేనపుడు మా ఆవిడ్ని ఏదో అంటూంటాను. ఆవిడా సణుగుతూ ఉంటుంది.

- ఇంకా ఉంది

శ్రీధర