డైలీ సీరియల్

విలువల లోగిలి-20

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుదాన్ని కాస్త ట్యూన్ చేస్తే సరిపోతుంది అనుకుంది మనసులో.
‘‘అవును విశ్వనే’’
‘‘రండి.. లోపలికి రండి. కూర్చోండి. వదినను పిలుస్తాను’’ అంటూ ‘‘వదినా! వదినా! నీ స్నేహితురాలు వచ్చారు’’ అంది గట్టిగానే. మాట మాట్లాడుతున్నా ఆమె చూపు అంతా టీవీ మీదే ఉంది. సీరియల్ చూస్తోంది. అందులో యాడ్ వచ్చాక కానీ (బెల్ శబ్దం విని కూడా)తలుపు తీయలేదు. అంతలా అందరూ వాటిల్లో లీనమయిపోతున్నారు. మళ్లీ సీరియల్ స్టార్ట్ అయితే తన పని అవదని గ్రహించి ‘‘సుందరీ, నేను నీ కోసం ఏం తెచ్చానో తెలుసా?’’ అంది బ్యాగ్ జిప్ తీస్తూ.
‘‘ఏం తెచ్చారు?’’
‘‘టాయిలెట్ బాక్స్. ఇది ప్రక్కనుంటే బ్యూటీపార్లర్‌కి వెళ్ళే పని ఉండదు’’ అంటూ దాన్ని తీసి ఆమెకందించింది.
ఆత్రంగా దాన్ని అందుకుని తీసి చూసి నిర్ఘాంతపోయింది. రకరకాల షేడ్స్‌తో వున్న పౌడర్లు, బ్రష్‌లు, ఐలైనర్, ఒకటేమిటి మేకప్ చేసుకోవటానికి కావాల్సిన అన్ని పరికరాలు అందులో ఉన్నాయి.
‘‘చాలా థాంక్సండీ’’ అంది మనస్ఫూర్తిగా.
ఆ అమ్మాయి అలంకారానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని శాంత చెప్పిన మాటను గుర్తుపెట్టుకొని తెచ్చింది విశ్వ.
ఇంతలో సీరియల్ ప్రారంభమవటంతో నాగస్వరం విన్న నాగుపాములా అటు తిరిగిపోయింది సుందరి.
‘‘విశ్వా! వచ్చేవా? కాస్త ఉదయానే్న బయలుదేరాల్సింది. ఎండన పడిపోయావు. ఇది త్రాగు’’ అంటూ నిమ్మరసం అందించింది.
‘‘నన్ను చూసిన ఆనందంలో మరిచిపోయినట్లున్నావు. గుడివాడ ఏమైనా ప్రక్కన ఉందా? ఉదయానే్న ఎక్కితే ఇప్పటికి మీ ఊర్లో తేలాను’’ అంది త్రాగిన గ్లాసు పక్కన పెడుతూ.
‘‘రా! నా గదిలోకి వెళదాం’’ అని తన బ్యాగును తీసుకుంది.
‘‘నేను తెస్తానులే శాంతీ’’ అంది.
‘‘్ఫర్వాలేదు. నేను ఈ ఇంటికి చేసేదానితో పోలిస్తే ఇదో లెక్కా? నా స్నేహితురాలికి చేస్తున్న సంతృప్తి కూడా ఉంటుందందులో’’
‘‘సరే నీ ఇష్టం. మీ అత్తగారు, మామగారు కనిపించరేం?’’
-!ళనఆ
మా అత్తగారు ప్రక్కింటి ‘బాలామణి’ గారింట్లో సమావేశానికి వెళ్ళారు.
‘‘ఓ! అథా!’’ అన్నట్లు నవ్వింది విశ్వ.
‘‘అయితే ఇదే మంచి సమయం. నేను పని ప్రారంభిస్తాను.’’
‘‘ఇప్పుడేగా వచ్చావు? రేపట్నించీ చెయ్యచ్చులే’’ అప్పుడే విశ్వను వదలాలని ఆమెకు లేదు.
‘‘రేపు చేద్దాం’’ అనటం బద్ధకస్థులు చేసే పని. ఈరోజే మనది. ఈ క్షణం నాది అనుకొని ముందుకు సాగటమే తెలివైన వాళ్ళ లక్షణం.
నా పనికి అడ్డం రాకు. అంతా నీకోసమే కదా. ఇప్పుడే వచ్చేస్తాలే. అన్నట్లు అక్కడ ఎంతమంది దొరుకుతారేం నాకు?’’
‘‘ఆరుగురికి తక్కువ ఉండరు.’’
‘‘సరే! అంటూ సర్దుకుపోండి’’ పుస్తకాలను అరడజను తీసుకుని వెళ్ళొస్తానని బయలుదేరింది.
‘‘నేను వచ్చి పరిచయం చెయ్యనా’’ అంది శాంతి వెనకే వస్తూ.
‘‘వద్దు. నేను చూసుకుంటాగా’’ అంటూ అటువైపు అడుగులు కదిపింది.
‘‘అందరికీ నమస్కారం’’ అంది వాళ్ళ దగ్గరకు వెళ్ళి.
‘‘హాయ్!’’ అన్నారు అందరూ ఒకేసారి.
టీ.వీ.లో యాంకర్లను చూసి అలా పలకరించటం అలవాటయిపోయింది మరి.
‘‘నువ్వు గుడివాడ నుంచీ వచ్చావామ్మాయ్’’ అంది వాళ్ళలో ఒకావిడ.
ఆవిడే శాంత అత్తగారు ‘లీలావతి’ అయి ఉంటుంది.
‘‘అవునండీ. నా పేరు విశ్వ.’’
‘‘ఆఁ! మా కోడలు చెప్పింది ఈరోజు నువ్వు వస్తావని. ఇప్పటి దాకా నీ కోసమే గుమ్మం దగ్గర ఎదురుచూసి ఎదురుచూసి ఎంతకూ రాకపోతే ఇప్పుడే ఇలా వచ్చాను.’’
‘‘మీకోసమే నేనూ వచ్చాను. మీ అందరికోసం నేను ఒక మంచి పుస్తకం తెచ్చాను.’’
‘‘పుస్తకమా? అది చదివే తీరుబడి మాకెక్కడిది?’’ సాగదీస్తూ మాటను అందులో ఒకావిడ అననే అంది.
‘‘మరి వెండి కుంకుమ భరణి ఊరికే వచ్చేస్తుందా?’’ అంది వాళ్ళను సస్పెన్స్‌లో పెడుతూ విశ్వ.
‘‘అదేమిటి?’’ అన్నారు. మిగిలిన వాళ్ళంతా ఒకేసారి.
‘‘ఏం లేదు. ఈ పుస్తకాన్ని రాసిన రచయిత్రి నా స్నేహితురాలు. తన పుస్తకాన్ని చదివిన వాళ్ళకు చిన్న పరీక్ష పెట్టి అందులో గెలిచిన వాళ్ళకు వెండి కుంకుమ భరిణెను బహుమతిగా ఇమ్మంది.’’
‘‘అవునా. ప్రశ్నలు కష్టంగా ఉంటాయేమో’’ అంది మరొకావిడ.
‘‘అన్నీ సులభంగానే ఉంటాయి. మీరు పుస్తకం చదివారా లేదా తెలుసుకోవటానికే ఆ ప్రశ్నలు. మళ్ళీ మనసులో వాటిని గుర్తుపెట్టుకున్నారా లేదా అన్న దానికే ఈ పరీక్ష. కాస్త మనసు పెట్టి చదివితే మీ అందరికీ బహుమతి రావచ్చు.’’
‘‘అందరికీ ఇస్తారా?’’
‘‘ఆఁ! అన్నీ కరెక్ట్‌గా రాస్తే అందరికీ ఇస్తాను.’’
‘‘మరయితే చదవటం ప్రారంబిద్దాం. ఈ కబుర్లు చెప్పుకుంటే ఏం వస్తుంది?’’ అంటూ తలా ఒక పుస్తకం తీసుకుని వెళ్ళిపోయారు.
తన మొదటి ఘట్టం ముగిసినట్లే.
‘‘పదమ్మా! మనింటికి వెళదాం’’ అంది లీలావతి తన పుస్తకాన్ని జాగ్రత్తగా చేతిలోకి తీసుకుంటూ. ఆ పుస్తకాన్ని చూస్తే వెండి కుంకుమ భరిణే గుర్తువస్తోంది ఆవిడకు. ఆ బహుమతిని ఎలాగయినా తనే కొట్టెయ్యాలని అనుకుంటోంది. ఎవరికివారే అదే ప్రయత్నంలో ఉన్నారు. అదే తనకి కావల్సింది కూడా అనుకుంది మనసులో విశ్వ.
- ఇంకా ఉంది

-యలమర్తి అనూరాధ 9247260206