డైలీ సీరియల్

విధిరాత .. పరమాత్మ ప్రియులు ( పరీక్షిత్తు - 1)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాభిమన్యుల కుమారుడు విష్ణురాతుడు. ఇతడు ఉత్తర గర్భంలో ఉన్నప్పుడే పరమాత్మను చూచిన పుణ్యశీలి. అశ్వత్థామ క్రోధంతో అపాండవం కావాలని ప్రయోగించిన బ్రహ్మాస్తమ్రునుంచి తప్పించుకొనిన ధీశాలి విష్ణురాతుడు. ఉత్తర తన గర్భాన్ని రక్షించి అందుండే చిన్ని శిశువును కాపాడమని వేడుకున్నపుడు ఆ శ్రీకృష్ణుడు తన దివ్యనేత్రంతో అశ్వత్థామ చేసిన ఘోరకృత్యాన్ని చూసి యోగమాయతో ఉత్తర గర్భంలోకి వెళ్లి సుదర్శన చక్రాన్ని సంధించి అశ్వత్థామ ప్రయోగించిన బాణాగ్ని నుంచి పాండవ కులనందనుణ్ణి రక్షించాడు.
అలా శ్రీకృష్ణుని చేత రక్షించబడ్డ విష్ణురాతుడు పుట్టిన దగ్గర నుంచి తనను తన తల్లి గర్భంలోనే రక్షించిన ఆ దేవాదిదేవుడు ఎవరా అని ప్రతివారిని పరీక్షించి చూస్తూన్నాడు. అట్లా పరీక్షించే ఆ చిన్నబాలకుని చూసిన వారు పరీక్షిత్తుడని పిలిచారు.
అందుకే ఉత్తర కుమారునికి విష్ణురాతుడు అన్న పేరుకన్న పరీక్షిత్తు అన్న పేరు ప్రసిద్ధి చెందింది. ఆ పరీక్షిత్తుకు జాతక కర్మలు జరిపించిన ధర్మరాజు అతని భవిష్యత్తు ఎలా ఉంటుందో అని పురోహితులను చెప్పమని అడిగాడు. అపుడు వారంతా పరీక్షిత్తు భవిష్యత్తును ఆలోకించి సమదృష్టిలో ఇతడు పరమశివుడిని, గుణసంపదలో మహావిష్ణువును పోలిన వాడు అవుతాడు. పరమ నిష్ఠాగరిష్టుడై ధర్మాచరణుడు అవుతాడు. ధైర్యంలో బలిని, దాతృత్వ గరిమలో రంతి దేవుని, భక్తిని ప్రకటించటంలో ప్రహ్లాదుని మించిన వాడు అవుతాడు అని కీర్తించారు. వారి పలుకులు విన్న ధర్మరాజాదులు అందరూ సంతోషించారు.
ఆ తరువాత కొన్నాళ్లకు పాండవులు వానప్రస్థాశ్రమానికి వెళ్లాలనుకొన్నారు. ధర్మరాజు జరిగిన జరుగబోతున్న ఉత్పాతాలన్నింటి గురించి తెలుసుకొన్నారు. కాలంతో పాటు జరిగే మార్పులను ప్రతివారు ఆహ్వానించవలసిందే. మనుషులుగా పుట్టిన వారంతా ఒకరోజు పరమాత్మలో లీనం కావాల్సిందే. కనుక తన పెదతండ్రి పెద్దతల్లి ఇద్దరూ ఈలోకంలోకి వచ్చిన శరీరాలను విడిచిపెట్టారన్నవార్త విని తల్లడిల్లాడు. ఆతరువాత తమకు మార్గదర్శి, స్నేహితుడు, బంధువు విడదీయరాని అనుబంధమున్న శ్రీకృష్ణుడు కూడా తమను వదిలి వెళ్లాడన్న వార్త విని కృశించిపోయాడు.
ఇక తమకూ కాలానికి తలవంచాల్సిన అవసరం ఉందని పాండునందనులు అనుకొన్నారు. వెంటనే ధర్మరాజు పరీక్షిత్తుకు రాజ్యధికారాన్ని అప్పజెప్పి వానప్రస్థాశ్రమానికి బయలుదేరడానికి సర్వసమాయుక్తుడయ్యాడు. దాని ప్రకారమే ధర్మరాజు తన మనమడైన పరీక్షిత్తుకు రాజ్యాధికారాన్ని ఇచ్చారు.మహారాజును చేసి రాజ్యబాధ్యతలను ఆయనపై మోపారు. పాండవులు వానప్రస్థాశ్రమానికి బయలుదేరి వెళ్లారు.
అట్లా ధర్మరాజు నియోగించిన పరీక్షిత్తు తన తండ్రుల కీర్తి ఇనుమడించేట్టుగా రాజ్యాన్ని పాలించాడు. ధర్మాన్ని నాలుగుపాదాల నడపడానికి సర్వశక్తులను వినియోగించాడు.
కాని కలియుగం రానేవచ్చింది. ఒకరోజు పరీక్షిత్తు జైత్రయాత్రకు వెళ్లాడు.
- ఇంకాఉంది

- డా. రాయసం లక్ష్మి