డైలీ సీరియల్

విలువల లోగిలి-21

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనికిరాని కబుర్లతో కాలాన్ని వ్యర్థం చేసేకంటే ఇలా పుస్తకాలు చదవటం అలవాటు చేసుకుంటే కాస్త జ్ఞానం అయినా పెరుగుతుంది. అందుకే ఇలా ఈ అలవాటుకి వారితో శ్రీకారం చుట్టించింది. మెల్లమెల్లగా వారంతా దానికి అలవాటు పడతారు.
అసలు టీ.వీ.లను వదిలేసి ఇలా సమావేశమవటం కూడా తనకు ఆశ్చర్యంగానే ఉంది. ఆడవాళ్ళు అసలు టీ.వీ.లను వదలటం లేదుగా.
దానికి సమాధానం శాంతి దగ్గర నుంచీ వచ్చింది. ఆ సమయంలో ఏ ఛానల్ తిప్పినా వంటలే వస్తాయి. అవి కోడళ్ళు చూడాల్సిన వని వాళ్ళకు వదిలేసి మాట్లాడుకుంటారని అంటుంటే ఆశ్చర్యపోవటం విశ్వ వంతు అయ్యింది.
ఇలాంటి పథకాలు కూడా ఉంటాయా అనుకుంది మళ్ళీ.
‘‘ఇంతటితో ఏమయింది. ఇది ఆరంభం మాత్రమే. ఈ నాలుగు రోజుల్లో ఇంకెన్ని చూస్తావో’’ అంది నర్మగర్భంగా నవ్వుతూ శాంతి.
‘‘అంతేనంటావా?’’
అత్తగారు అక్కడికి రావటంతో మాటలు ఆగిపోయాయి.
‘‘ఇంకా నీ స్నేహితురాలికి భోజనం పెట్టవా శాంతా? ఇప్పటికే చాలా ఆలస్యమైంది.’’
‘‘వడ్డించేస్తున్నానత్తయ్యా! మీకుకూడా పెట్టెయ్యనా?’’
ఆవిడ మామయ్యగారు వచ్చేదాక తినరని తెలిసినా. అడగకపోతే అడగలేదంటారు.
‘‘నేను మామయ్యగారితో తింటాలే. మీ ఇద్దరూ తినేసెయ్యండి’’ అని హాలులోకి వెళ్ళిపోయింది. మరో సీరియల్ ఫాలో అవ్వాలిగా.
‘‘అయ్యబాబోయ్! వీళ్ళు అంతసేపు టీ.వీ. చూస్తే కళ్ళు ఏం అవుతాయో అని కూడా ఆలోచించరా?’’
‘‘ఆలోచించటం మాట అటుంచి, ఆ మాట అంటే అన్న వాళ్ళ పని అయిపోయినట్లే. వాళ్ళమీద గయ్‌న లేస్తారు.’’
‘‘రోజంతా ఆ సౌండును ఎలా భరిస్తావే.’’
‘‘తప్పదు. అలవాటుచేసుకున్నా. మా సుందరి కాలేజీకి వెళ్ళిందా?
వచ్చాక ఒక అరగంట తనకు ఇవ్వమన్నా ఇవ్వదు. ఇచ్చినా ఆ చానల్ పెట్టు, ఈ చానల్ మార్చు అంటూ ఉంటుంది. యాడ్స్ వచ్చినప్పుడల్లా. ఇద్దరూ ఒకే రకం కదా. ఒక రకంగా చెప్పాలంటే రోజూ యుద్ధమే.’’
‘‘పాపం తనకూ రిలాక్స్ అవ్వాలని ఉంటుందిగా.’’
‘‘మా అత్తగారి దగ్గర ఆ ఆటలేం సాగవు.’’
‘‘మరి నీ సంగతి?’’
‘‘నాకసలు టీ.వీ. చూసే టైమే ఉండదు. అదీ ఒకందుకు మంచిదే అనిపిస్తుంది.’’
‘‘అదేంటే?’’
‘‘అంతేనే! ఇక్కడికి వచ్చాక కొన్ని కోర్కెలను చంపేసుకున్నాను.’’
‘‘మీ వారితో చెప్పవచ్చుగా.’’
‘‘తనకా? అందులో సమస్యను అర్థం చేసుకోవటం మానేసి మా అమ్మ మీద చెబుతావా. అంటూ రంకెలు వేస్తారు.’’
‘‘ప్చ్! ఇలాంటివి చూసే ఆడపిల్లలు పెళ్ళి అంటేనే భయపడిపోతున్నారు.’’
‘‘ఏమీ లేకపోయినా అమ్మా వాళ్ళింట్లో బాగుండేది. స్వేచ్ఛ ఉండేది అక్కడ. ఇక్కడ అదే పోయింది. నాకూ పంజరంలో ఉన్న చిలుకకు పెద్ద తేడా ఏం ఉండదు.’’
‘‘అవునూ! అత్తలందరూ సమావేశమైనట్లు కోడళ్ళంతా కూడా మీటింగులు పెట్టుకోవచ్చుగా.’’
‘‘చంపేసావు. ఆ మాట విన్నదంటే మా అత్త నిన్ను చంపేస్తుంది. అసలు కోడళ్ళను గడప దాటనిస్తే కదా. మాట్లాడుకోవటానికి’’
‘‘అంటే..’’
‘‘ఇంకా నీకు అర్థం కాలేదా? నేను బయటకు వెళితే వీళ్ళ బండారం బయటపెట్టేస్తానని భయం. నేనా కాదు అందరి కోడళ్ళ పరిస్థితి అంతే.’’
‘‘ఓ మై గాడ్!
‘‘మా మరిది ‘్ఫణి’ చూపులు చూసావంటే పిచ్చెక్కుతుంది. వదినమ్మలో అమ్మను తీసేసి వయసు చూసే రకం.’’
‘‘అలాగా!’’ ఆలోచనలో పడింది విశ్వ.
‘‘సర్లే. పప్పులో వడియాల్లా ఇలాంటివి తీరిగ్గా తిందువుగానీ. ముందు అన్నం శుభ్రంగా తిను’’ అంది నవ్వుతూ.
ఇన్ని కష్టాలు భరిస్తూ దీనికి పెదాల మీద నవ్వు ఎలా వస్తోంది? అని ఆశ్చర్యపోయింది విశ్వ.
‘‘వాళ్ళు భోజనాలు ఎప్పుడు చేస్తారు?’’
‘‘బేరం లేనప్పుడు మా మామగారు ముందువస్తారు. ఆయన వెళ్ళి మా మరిదిని పంపుతారు. మా అత్తగారు ఎప్పుడు తినాలి అనిపిస్తే అప్పుడు తింటారు.
‘‘మరి సుందరి..’’
‘‘తనకీరోజు వంట్లో బాగోలేదని కాలేజీ మానేసింది. లేకపోతే క్యారేజీ పట్టుకెళుతుంది.’’
‘‘అయితే భోజనం, టిఫిన్ రెండూ ప్రొద్దునే అయిపోవాలన్నమాట’’
‘‘ఆఁ! అంతేగదా!’’
‘‘మరి వీళ్ళెవరూ నీకు కాస్త కూడా సాయం చేయరా?’’
‘‘చేయరు. పైగా వాళ్ళకి టవల్ కావాలన్నా, బ్రష్ మీద పేస్ట్ కావాలన్నా, ఏది కనిపించకపోయినా, తెచ్చుకోవటానికి బద్దకం అయినా నేను వెళ్ళి ఇవ్వాల్సిందే.’’
‘‘శాంతీ! ఏమిటీ ఇదంతా?’’
‘‘అదేమిటలా విస్తుపోతావు? మన దేశంలో కొన్ని వేల కుటుంబాలలో కోడళ్ళ పరిస్థితి ఇదే.’’
‘‘ఆడవారికి క్రొత్త క్రొత్త చట్టాలు వచ్చాయి కదే!’’
‘‘చట్టాలు, పోలీసులు, కంప్లయింట్స్ కాపురాలను సరిదిద్దుతాయా?’’
‘‘ఎందుకు సరిదిద్దవూ?’’
‘‘కాపురాలు మానేసి ఇక పోలీసుల చుట్టూతిరగాలి ఏం లాభం లేదే’’
‘‘అలా అనుకుంటే ఎలా? ఉన్న వాటిని ఉపయోగించుకోవాలిగా’’
- ఇంకా ఉంది

-యలమర్తి అనూరాధ 9247260206