డైలీ సీరియల్

వీటికి దగ్గరైతే కలికి చిక్కినట్టే ( పరీక్షిత్తు - 3)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కనుక నీవు ఈ లోకంలో ఉండడానికి వీలులేదు అంటూ గట్టిగా వారిస్తున్న పరిక్షిత్తుకు తిరిగి నమస్కరించి తను ఎందుకు ఈ ప్రపంచంలో వచ్చాడో ఎవరు పొమ్మన్నారో దానినంతా కలి పురుషుడు పరీక్షిత్తుకు వివరించాడు.
బ్రహ్మ చెప్పిన పనిని నేను చేసితీరాలి కనుక అంతటా ధనుర్ధరుడవైన నీరూపమే నా కళ్లకు కనిపిస్తుంది కనుక నేను ఏమి చేయాలో నాకు అర్థమవడంలేదు. నీవే నాకు ఏ యే స్థానాలల్లో నేను సంచరించవచ్చో చెబితే ఆ యా స్థానాలను వదిలి నేను ఇంకొక చోటకురాను అని కలి పరి పరివిధాలుగా పరీక్షిత్తును వేడుకున్నాడు. చతుర్ముఖ బ్రహ్మ ఆదేశాన్నందరూ పాటించాలి కనుక పరీక్షిత్తు కూడా కలి పురుషుడిని మాటలు విని బాగా ఆలోచించాడు. ఆ తరువాత జూదం, మద్యపానం, స్ర్తిలు, ప్రాణివద అనే నాలుగు స్థానాలల్లో నీవు ఉండవచ్చు. వాటిని దాటి నీవేవిధంగానుముందుకు రాకు అని కలిపురుషుడితో చెప్పాడు. పరీక్షిత్తు మాటలు విని ఓ మహారాజా నీకు ఇంకో స్థానాన్ని ఇవ్వండి.
అపుడు నేను నాపనిని సులువుగా చేయగలుగుతాను అని మరలా వేడుకున్నాడు. పరీక్షిత్తు ఆలోచించి సువర్ణం అనే ఐదో స్థానాన్ని కూడా కలిపురుషునికి ఇచ్చి ఈ ఐదు స్థానాలు కలినివసించడానికి వీలున్నవి. ఈ స్థానాల్లో తప్ప అన్య స్థలాలను స్పృశించవద్దని కట్టడి చేశాడు పరీక్షిత్తు మహారాజు. ఈవిషయాన్ని ప్రజలందరికీ తెలియపర్చాడు. అందరూ చాలా జాగ్రత్తగా ధర్మాచరణ చేస్తూ కలిపురుషునికి చాలా దూంరగా ఉండాలని చెప్పాడు. యథా రాజా తథా ప్రజ కదా. అందరూ అప్రమత్తులై ధర్మాచరణ చేస్తూన్నారు. కలిపురుషునికి ఏమాత్రం పరీక్షిత్తు రాజ్యంలోకి రావడానికి ఏమాత్రం అవకాశం కలగడం లేదు. ఈ మాటలు విని భూదేవి సంబరపడింది. ధర్మదేవత ఆనందించింది. కానీ కాలం ఒక్కరీతిగా ఉండదుకదా. కాలం చేసే విచిత్ర లీలలకు ఎవరైనా తలవంచాల్సిందే కదా.
అందుకే పరీక్షిత్తు ఒకరోజు వేటాడాలనే కోరిక తన మంత్రిపురోహిత సైన్యంతో సహా బయలుదేరాడు. మదోన్మత్తుడై రోజంతా వేట సాగించాడు. అంతకుముందే తన తాతతండ్రులు జైత్రయాత్రలో సంపాదించిన ధనరాశులను చూడాలనుకొని తన మంత్రులను అడిగి మరీ వాటిని చూడడానికి బయలుదేరాడు. అందరూ ఒక గదికి తాళం వేసి ఉండడం చూశాడు. వారిని దీనికి తాళం వేయడానికి కారణమేమిటి అని వారిని అడిగితే ఇందులో ఏదైనా అధర్మఛాయలున్నాయేమో అని మహారాజైన ధర్మరాజు ఆనాడు వీటిని ముట్టకూడదని శాసించారు. ఇందులో ఎక్కువగా ఓడిపోయిన, లొంగిపోయిన రాజుల కిరీటాలు ఉన్నాయి. అందుకే మేమంతా దీనిజోలికి వెళ్లడం లేదు అని చెప్పారు.
కాల మహిమలను ఎవరూ తెలుసుకోలేరుకదా. అందుకే అంతటి ధర్మాత్ముడైన పరీక్షిత్తు ఏదీ మా తాతలు సంపాదించిన ఆ కిరీటాలు ఎలా ఉన్నాయో చూస్తానని తాళం తీయమని అడిగీ మరీ వాటిని చూడడానికి ఉత్సుకత చూపాడు.
- ఇంకాఉంది