డైలీ సీరియల్

విలువల లోగిలి-23

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కానీ ఆవిడ ఆప్యాయతలో ఉన్న సహజత్వాన్ని గమనించిన మనసు మాత్రం నీ కష్టాలు గట్టెక్కాయని గట్టిగా చెప్పింది.
‘‘వదినా! రేపు నేను వంట చేస్తాను. మా ఫ్రండ్స్ అంతా కాలేజీలో రకరకాల వంటలు చెబుతూ ఉంటారు. ఆ ప్రయోగం చెయ్యనీ. నీకూ కాస్త ఆటవిడుపు. నా సరదా కూడా తీరుతుంది’’ అంది.
‘‘విశ్వగారు వచ్చిన సందర్భంలో రేపు మనమంతా కలిసి సినిమాకి వెళదాం అన్నాడు శాంత భర్త వేణుగోపాల్.’’
ఆ మాటతో అక్కడ ఉన్న వెనె్నలంతా శాంత కళ్ళలో ప్రవేశించిందేమో అనిపించింది విశ్వకు. ఆమె కళ్ళలో అంత వెలుగు. మరి జీవితంలో అలాంటి మాట భర్త నోట వింటాననుకోలేదు.
ఇక కోడలికి మంచిరోజులొచ్చాయని విశ్వనాథం మనసులోనే మురిసిపోయాడు. పెరుగులోకి ‘చక్కెరకేళీ వేసుకో శాంతీ’’అంటూ తనే వలిచి వడ్డించారు.
విచిత్రంగా ఆ భోజనాలులో విశ్వ గెస్ట్‌గాకాక శాంతను గెస్టుగా చూసారు. అదే తను కోరుకున్నది కూడా అనుకుంది మనసులో విశ్వ.
‘వాళ్ళలో కలుపుకోవాలి కానీ గెస్ట్‌గా చూడటమేమిటి’’అంది అంతరంగం నేనున్నానంటూ.
‘తయారయిపోయావా తల్లీ! గెస్ట్ అంటే ఇక్కడ అతిథి అని కాదు. ప్రత్యేకంగా ప్రత్యేకంగా అని అర్థమయ్యిందా? అంటూ గట్టిగా సమాధానమిచ్చి దాని నోరు మూసింది విశ్వ.
ఇక కాసేపటిదాకా తన వంక చూడదని తలుచుకొని నవ్వుకుంది.
భోజనాలయ్యాక ‘్ఫణి’ ఒక్కడు డాబాకార్నర్‌లో నిలబడి ఎటోచూస్తూ ఉండటం గమనించింది విశ్వ. తనకు ఇంతకన్నా మంచి అవకాశంరాదని వెంటనే అటు వెళ్ళింది.
‘‘్ఫణీ!’’
‘‘అక్కా! అని పిలుపు ఫణీ. నాకు తమ్ముళ్ళు కూడా లేరు.’’
‘‘అక్కా అని పిలిస్తే నేను తమ్ముణ్ణేకదా. ఇంక తమ్ముళ్ళు లేకపోవటమేమిటి?’’
‘‘తమ్ముడివి అవుతావు కానీ ‘తమ్ముళ్ళు’కాదుగదా అంది ‘తమ్ముళ్ళు’ అన్న పదాన్ని వత్తి పలుకుతూ.
‘‘అదా! దెబ్బకొట్టేశావక్కా!’’
‘‘అందరూ అక్కడ ఉంటే నువ్వు మాత్రం ఎందుకు ఇక్కడ వంటరిగా?’’
‘‘అందరం కలిసే ఉన్నా ఏమిటో వంటరిగానే అనిపిస్తుంది. అమ్మ, చెల్లి మాటలు రొటీన్‌గా ఉంటాయి. కుటుంబమే కానీ అమ్మ ఎప్పుడూ నన్ను గురించి పట్టించుకోదు. నా సంపాదనే వీళ్ళకు కావాలి కానీ నేను అక్కర్లేదేమో అనిపిస్తుంటుంది ఒక్కోసారి. చెల్లీ అంతే!
‘‘మరి వదిన...?’’
వదిన...వదిన... అంటూ నీళ్ళు నమిలాడు.
‘‘చెప్పు. తన గురించి కూడా.’’
‘‘వదిన చాలా మంచిది. కానీ నేనే తనతో సరిగ్గా ఉండలేకపోతున్నాను’’
‘‘సరిగ్గా అంటే...?’’
‘‘చెప్పలేను. ఒంటరితనం పోగొట్టుకోవడానికి టీ.వీ.లు, పత్రికలను ఆశ్రయించాను. వాటిల్లో శృంగార కథలు మా యువతను రెచ్చగొడుతున్నాయి. ఇక సినిమాల్లో అర్థనగ్నంగా స్ర్తిలను చూపిస్తున్నారు. ఇక స్ర్తిలమీద మాకు గౌరవం ఎందుకుంటుంది?’’
‘‘మరి నాతో ఎందుకు మామూలుగా మాట్లాడుతున్నావ్?’’
‘‘తెలియదు.’’ ‘‘చూడు ఫణీ. మంచైనా, చెడైనా మనం చూసేదాన్నిబట్టే ఉంటుంది. హంస నీటిని, పాలను వేరుచేసినట్లు చెడును వదిలేసి మనం మంచినే గ్రహించాలి. అప్పుడు టీ.వీ. చూసినా, పత్రిక చూసినా, సినిమా చూసినా మంచే కనిపిస్తుంది. చెడు ఎలాచేయకూడదో అని మాత్రమే నువ్వు చూసి తెలుసుకోవాలి. ఏదైనా వ్యాపార వస్తువుగా స్ర్తిని చూపించటం నేనూ సమర్ధించను. మద్యం త్రాగితే ఆరోగ్యానికి హానికరం అని ఒకవైపు చూపిస్తూనే దానే్న త్రాగుతున్నట్లు చూపిస్తారు. దాన్ని నిషేధించరు. మళ్ళీ లైసెన్సులు ఇచ్చిమరీ అమ్ముతారు. అలాంటివే అన్నీ. అయినా ఒకళ్ళు చెడగొడితే చెడిపోతారా మీ యువకులు? మీలో ఎంతో సామర్థ్యం ఉంది. ఎన్నో సేవాకార్యక్రమాలు మీరు చేయవచ్చు. అలాంటివి ఎన్నో పత్రికలు రాస్తుంటాయి. వారి ఇంటర్వ్యూలు చదువు, వాళ్ళ కృషిని గమనించు. నువ్వూ క్రొత్తగా దేని గురించయినా ఆలోచించు. నలుగురిని తోడుతీసుకో. అప్పుడు నీ వెనుక మరో నలుగురు నడుస్తారు. టీ.వీలలో ఎలాంటివి రాకూడదో నీకు తెలుసు అంటే ఎలాంటివి రావాలో కూడా నీకు అర్థమయ్యే ఉంటుంది. అలా ‘షార్ట్ఫిల్మ్స్’ తీయటానికి ప్రయత్నించు. అన్నట్లు నీకోసం నేను మంచి ‘కెమెరా’తెచ్చాను తెలుసా. క్రింద నా బ్యాగ్‌లో ఉంది. వెళ్ళి తీసుకువస్తా అని వెళ్ళబోతూ ఆగి వదినను వదినమ్మ అని కూడా అంటారు ఎందుకో తెలుసా అమ్మ తరువాత అమ్మ వదినమ్మ కాబట్టి. అమ్మతో పంచుకోలేనివి వదినమ్మతో పంచుకో. ఆప్యాయత ఎంతిస్తే దానికి రెట్టింపుమనకు ఎదుటివారి నుంచీ తిరిగి లభిస్తుంది. అందుకే అందరినీ ప్రేమించు. ప్రేమించబడు అని నేనంటాను. అందులో అమ్మ, చెల్లి, నాన్న, ప్రక్కవారు, తోటివారు అందరూ ఉంటారు. సరేనా? నువ్వు దీని గురించి ఆలోచిస్తూ ఉండు. నేను చిటికెలో వచ్చేస్తాను’’అంటూనే క్రిందకు వెళ్ళింది.
అతనికి తను చెప్పినదాన్ని గురించి ఆలోచించుకోవటానికి కాస్త సమయం కావాలనే ఇచ్చింది.
కాసేపాగిన తర్వాత పైకి వచ్చి ఫణికి ‘కెమెరా’ఇచ్చింది. మొదటి ‘స్నాప్’ మిమ్మల్నే తీస్తానన్నాడు.
‘‘సరే తియ్యి. మీ బావగారికి పంపుతాను.’’ అక్క నాకు కెమెరా ఇచ్చింది అంటూ ఒక్కొక్కరినీ విడివిడిగా, అందరినీ కలిపి కొన్ని ఫొటోలు తీసాడు. ఇక అతనికి ‘్ఫటోగ్రఫీ’ హాబీ అవుతుంది అనుకుంది మనసులో.
విశ్వనే గమనిస్తున్న విశ్వనాథంగారి దగ్గరకు వచ్చింది.

- ఇంకా ఉంది

-యలమర్తి అనూరాధ 9247260206