డైలీ సీరియల్

ఒయాసిస్ 25

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాసేపు ఆమె పట్ల అతని వినయం, విధేయత చూపిస్తే చాలు, ఇట్టే కరిగిపోతుంది.
‘‘పెళ్లాంగానీ, మొగుడు కానీ మరో మగాడితోనో, ఆడదానితోనో తిరుగుతుంటే ఎవరూరుకుంటారు? అసూయకాదు.. అసహ్యం.. కోపం.. ద్వేషం.. పీక పిసికి చంపెయ్యాలనిపిస్తుంది..’’ అన్నది సత్యభామ.
‘‘నా లిమిట్స్ నాకు తెలుసు. కానీ నేరస్థుడిని పట్టుకోవాలంటే వాళ్ళ మనసుల్లోకి తొంగి చూడాలి. ఒక నేరస్తుడ్ని పట్టుకుని చావగొట్టి నిజం చెప్పించడం ఒక పద్ధతైతే, ఆ దెబ్బలకి తట్టుకోలేక మనం ఏదడిగినా నిజమేనంటాడు. రేపు కోర్టులో నన్ను చావగొట్టి అలా చెప్పించారు. అది నిజం కాదంటాడు. కొత్త పద్ధతులు అనుసరించాల్సి వస్తోంది.. ఇప్పుడు చాలామంది స్టింగ్ ఆపరేషన్స్ లాంటివి చేస్తున్నారు. అంటే వీడూ ఒక కస్టమర్‌లాగా వెళ్లి నేరస్తుడి వ్యవహారాన్ని కెమెరా సాక్షిగా రుజువు చెయ్యటం. పరిశోధన విధానంలోనూ ఎన్నో మార్పులొచ్చాయి’’ అన్నాడు రణధీర్.
‘‘సరే, సరే.. వెళ్లి దాన్ని శోధించి, పరిశోధించండి.. మనసులో ఏం దాచుకుందో, గుండెల్లో ఏం దాచుకుందో చూసి రండి..’’ అన్నది సత్యభామ.
రణధీర్ అన్నాడు. ‘‘నువ్వు పర్మిషన్ ఇస్తేనే వెడతాను.. నువ్వు అయిష్టంగా పంపితే.. నేను వెళ్లిన పనికాదు..’’
‘‘సరే వెళ్లండి..’’ అన్నది సత్యభామ
‘‘ఈ వేషాలకేం తక్కువ లేదు..’’ అనీ అన్నది.
అరగంట తర్వాత రణధీర్, దీప్తి ముందు కారు ఆపాడు. ఆమె కారు ఎక్కింది. రణధీర్‌ని చూసి నవ్వింది.
దీప్తి బిగుతైన జీన్స్ ప్యాంటు వేసుకుంది. పాంట్ టైట్‌గా ఉన్నందున బలమైన తొడలు చూపు మరలనివ్వటంలేదు. బొడ్డు కిందకి దిగని తెల్లని పొడుగు చేతుల షర్టు వేసుకుంది. ఆ షర్టూ చాలీ చాలకుండా ఉంది. పైగా పై గుండీలు రెండూ వదిలేసింది. గుండెల బిగువు కనిపిస్తోంది. జుట్టు పైకి దువ్వి క్లిప్ పెట్టి వదిలేసింది. మొహాన కుంకుమ బొట్టు కొత్త అందాన్ని ఇస్తోంది.
‘‘కొత్త డ్రెస్ నిన్ననే కొన్నాను.. ఎలా వుంది?’’ అని అడిగింది దీప్తి.
‘‘నీకేంటి.. కత్తి.. ఏ డ్రెస్ వేసుకున్నా బానే వుంటావు. వేసుకోకపోయినా బానే వుంటావు..’’ రణధీర్.
దీప్తి పకపకా నవ్వింది. కొబ్బరి చిప్ప అతనికి ఇచ్చింది.
ప్రసాదం కళ్ళకు అద్దుకుని పక్కన పెట్టాడు.
‘‘ఎక్కడికెళ్దాం?’’ అన్నది దీప్తి.
‘‘నీ ఇష్టం?’’ అన్నది దీప్తి.
‘‘హోటలు కెళ్దాం.. వేడిగా తినొచ్చు..’’
‘‘వద్దు.. నిన్నటివి వేడి చేసి పెడతాడు..’’
‘‘సినిమాకెళ్దాం..’’ అన్నది నవ్వుతూనే..
‘‘వద్దు, చుట్టూ వందమంది వుంటారు..’’ అన్నాడు రణధీర్.
‘‘మీ ఇష్టం..’’ అన్నది దీప్తి..
రణధీర్ కారు స్టార్టు చేశాడు.
‘‘వెనకసీట్లో పేపర్లు ఉండాలి. ఉన్నాయేమో చూడు..’’ అన్నాడు రణధీర్.
దీప్తి వెనక్కి తిరిగి చూసింది.. ‘‘ఏం లేవు’’ అన్నది.
‘‘కింద పడ్డాయేమో చూడు..’’
దీప్తి కొంచెం పైకి లేచి వంగి చూసింది.. రణధీర్ భుజం మీద చెయ్యి వేసి వెనకవైపు చూసింది.
ఈలోగా ఆమె దృష్టిలో పడకుండా టేప్‌రికార్డర్ ఆన్ చేశాడు.
‘‘ఊ.. ఇంక చెప్పు..’’ అన్నాడు రణధీర్.
‘‘నేనా ఉద్యోగం మానేశాను..’’ అన్నది దీప్తి.
‘‘ఏమి?’’
‘‘ఈ చిన్న చిన్నవన్నీ ఏదో టైంపాస్‌కోసమేగానీ, అసలు మన ప్లాన్ వేరు..’’ అన్నది దీప్తి.
కారు ఊరు చివరకు తీసుకెళ్లాడు.. రోడ్డుపక్కన పెద్ద చెట్టు ఉంటే, దాని నీడలో కారు ఆపాడు..
‘‘ఏదో ప్లాన్ వేశానన్నావు..’’’
‘‘ఊ..’’ అన్నది నవ్వుతూ.
‘‘నాకు చెప్పకూడదా?’’ అని అడిగాడు రణధీర్.
‘‘చెప్పటానికేం లేదు.. ఏదో రకంగా డబ్బు సంపాదించాలి.. నా దగ్గర డబ్బు ఉంటే, ఎంత ఉందీ అని చూస్తారుగానీ, అది ఎలా సంపాదించానా అని ఎవరూ చూడరు.. ఒక గొప్ప అనుభవజ్ఞుడు అన్నాడు.. నువ్వు బీదవాడిగా పుడితే అది నీ తప్పుకాదు.. కానీ బీదవాడిగానే చనిపోతే అది కచ్చితంగా నీ తప్పే- అన్నాడు..’’ అన్నది దీప్తి.
‘‘ఇంత చిన్న వయసులో ఇంత విజ్ఞానాన్ని ఎలా సంపాదించావు దీప్తి?’’ అని అడిగాడు రణధీర్.
‘‘నేను నిరుపేదగా పుట్టాను.. కానీ ప్రపంచంలో పేదలుగా పుట్టిన వాళ్లంతా పేదలుగా చనిపోవటం లేదు. నిరుపేదగా పుట్టి, చూస్తుండగానే ఆగర్భ శ్రీమంతుడు అయినవాళ్ళు ఎందరో ఉన్నారు. ఉదాహరణకి, ధీరూభాయ్ అంబానీ దుబాయ్‌లో ఒక చమురు కంపెనీలో చిన్న ఉద్యోగిగా జీవితం ప్రారంభించాడట. అలాగే ఎల్వీ ప్రసాద్ బాంబేలో ఒక సినిమా హాలల్లో గేట్ కీపర్‌గా పనిచేశాడట. కానీ తర్వాతి కాలంలో వాళ్ళు తమదైన ఒక మహా సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారు..’’
‘‘దీప్తి, నువ్వు అంబానీ అంత అవుతావా?’’ అని అడిగాడు రణధీర్.
‘‘వైనాట్.. డబ్బు లేనివాడు కాదు పేదవాడు, జీవితంపై ఒక లక్ష్యం, ఒక డ్రీమ్.. లేనివాడు నిజమైన పేదవాడు..’’ అన్నది దీప్తి.
‘‘ఏమిటి నీ డ్రీమ్?’’ అని అడిగాడు రణధీర్.
‘‘త్వరలో ఇలాంటి కారు కొనాలి..’’
‘‘ఈ కారు నీదే అనుకో.. నువ్వే ఉంచుకో..’’
‘‘కారు ఉంచుకుంటాను.. పెట్రోలు కావాలి. డ్రైవరు కావాలి.. అంచేత మీరు నన్ను ఉంచుకుంటే నేను కారు ఉంచుకున్నట్లే గదా..’’ అని పకపకా నవ్వింది.
‘‘నీ కిష్టమైతే, నాకూ ఇష్టమే...’’ అన్నాడు రణధీర్.
దీప్తి అతని చేతిని అందుకుని ముద్దుపెట్టుకుంది.

- ఇంకాఉంది

శ్రీధర