డైలీ సీరియల్

భావికోసమే ఆలోచన సాగాలి(పరీక్షిత్తు - 5)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ తరువాత తన తండ్రి మెడలో పామును ఎలా తీయాలో తెలియక ఆందోళన పడుతూ ఎవరైనా వచ్చి నా తండ్రిని రక్షించండి అంటూ పెద్దగా ఏడవడం మొదలుపెట్టాడు. కొడుకు ఏడుపు విని శమీకుడు సమాధి స్థితిని నుంచి బాహ్యస్మృతిలోకి వచ్చాడు.
తన భుజం పై వేలాడుతున్న పామును చూసి చేత్తో తీసి దూరంగా పారవేశాడు. తన కుమారుడిని దగ్గరకు పిలిచి ఎందుకు ఏడుస్తున్నావంటూ ఊరడించాడు.
ఎందుకు ఏడుస్తున్నావు ఈ పాము నాపైకి ఎలా వచ్చింది అని అడుగుతుంటే శృంగి ఏడుస్తూ తాను చేసిన పని చెప్పాడు. అసలు ఏమి జరిగిందే అని తన దివ్యదృష్టితో చూశాడు. శృంగిని ‘అయ్యో! ఎంత పనిచేశావు. మహారాజునెవరైనా శపిస్తారా? ధర్మాత్ముడైన ఆ రాజును శపిస్తే రాజు లేకుండా ఈభూమి ఎంత తల్లడిల్లిపోతుంది. అంటూరాజు లేని రాజ్యాన్ని గురించి చెబుతూ అయ్యో విధిని ఎవరూ దాటలేరు కదా. అంటూ తన కొడుకు పెట్టిన శాపాన్ని గురించి మహారాజుకు తెలిపి రమ్మని మునికుమారులను పంపాడు.
అంతలో పరీక్షిన్మమహారాజు తాను చేసిన తప్పిదాన్ని గుర్తించాడు. ఎంతో ఖేదం పొందాడు. అయ్యో మహారాజును, ఇంత వయస్సు వచ్చిన తరువాత కూడా తపోదీక్షలో ఉన్న ఆ మునీశ్వరుడిని నేను ఎందుకు బాధ పెట్టాను. ఆయనకు కోపం వస్తే ఏ అశుభం జరుగుతుందో అని వాపోతున్నాడు. తన మంత్రి పురోహితులతో తాను చేసిన అధర్మం చెప్పి ఎంతో వ్యాకులం పొందుతున్నాడు. అపుడే శమీకుని శిష్యులు వచ్చి శృంగి శాపం గురించి చెప్పారు.
అవును. నిజమే! నేను అధర్మం చేశాను. తప్పక శిక్ష అనుభవించవలసిందే. కోపంతో రగిలిపోయి వివేకాన్ని కోల్పోయి చేయకూడని పని చేశాను అని ఎంతో దుఃఖం పొందాడు.అలా దుఃఖిస్తున్న రాజు దగ్గరకు వచ్చి శమీకుని శిష్యులు వచ్చి శాప వృత్తాంతాన్ని చెప్పారు.
అది విని హస్తిన అంతా దుఃఖాక్రాంతం అయింది. పరీక్షిత్తు మాత్రం నాకు పడవలసిన శిక్ష పడిందనుకొన్నాడు.
మంత్రులు పురోహితులందరూ శృంగిని మహారాజు శపిస్తాడని అనుకొన్నారు. కానీ మహారాజు శృంగిపై ఏమాత్రం ఆగ్రహించలేదు. పైగా ఆ దేవదేవుని బ్రాహ్మణులను, గోవులను ఎట్టి స్థితిలోకూడా శిక్షించే బుద్ధి నాకు పుట్టకుండా చేయమని ప్రార్థించాడు.
విషయం తెలిసిని తక్షకుడు పరీక్షిత్తు సంహరించడానికి ఎదురుచూస్తున్నాడు.
పరీక్షిన్నరేంద్రుడు తనకు వారంరోజుల్లో చావు తప్పదని నిర్ణయించుకున్నాడు. ఇక భూలోక ఐశ్వర్యాలతో తనకు పనిలేదనుకొన్నాడు. వెంటనే సర్వసంగ పరిత్యాగి కాదలిచాడు. తన చిత్తాన్ని గోవింద పదాయత్తం చేశాడు. మనోవైకల్యాలను పక్కన పెట్టేసా గంగాతీరానికి బయలుదేరాడు. ఆ నిర్మలోదకాల చెంత వౌనంగా కూర్చున్నాడు. రాబోయే జన్మజన్మాలకూ భగవత్ భక్తి సౌభాగ్యం తనకు ప్రాప్తించాలని దేవదేవుని ప్రార్థించాడు. తన తనయుడైన జనమేజయుడిని పిలిపించాడు.

- ఇంకాఉంది

- డా. రాయసం లక్ష్మి. 9703344804