డైలీ సీరియల్

విలువల లోగిలి-26

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పేలోపే సినిమా ప్రారంభమయ్యింది. ఇక సంభాషణ ఆపేశారు.
శాంతి సినిమా చూడటం మానేసి విశ్వనే చూస్తోంది. ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోవడంలేదు. అవతలివారు తను చెప్పినవి పాటిస్తారా లేదా అని కూడా పట్టించుకోవడం లేదు. తను చెప్పాలనుకున్నది మాత్రం ఎంతో స్పష్టంగా చెప్పేస్తోంది. ప్రతి నిముషం తన సంసారాన్ని వెళ్ళేలోపు ఒక కొలిక్కి తీసుకురావాలన్న తపన మాత్రం కనిపిస్తోంది. దీనికి తనంటే ఎంత ఇది?
శాంతకే తెలియదు. తన స్థానంలో మరెవరన్నా ఉన్నా విశ్వ ఇలానే ఆలోచిస్తుందని. అదే ఆమె విలక్షణ లక్షణమని.
అలా ఆ రెండో రోజు గడిచిపోయింది.
ఎప్పటికప్పుడు సూర్య చంద్రకు ఫోనులో అన్ని విషయాలు చెప్పి అతని సూచనలు తీసుకుంటోంది. చక్రధర్ కూడా అతను పంపినవాడే. అతను దూరంగా వున్నా అతని సహాయం మాత్రం ఆమెకు చేరువలోనే.
***
‘‘విశ్వక్కా! రేపు వెళ్లిపోతానన్నావట. మరో నాలుగు రోజులు ఉండవచ్చు కదా!’’ అంటున్న సుందరితో ‘‘లేదమ్మా! నాకు కొంచెం అర్జెంటుగా చెయ్యాల్సిన పనులు ఉన్నాయి. అదీకాక అమ్మను విడిచి ఎప్పుడూ నేను ఇన్ని రోజులు ఉండలేదు. తను ఎలా ఉందో ఏమిటో?’’’
‘‘నువ్వొచ్చి రెండు రోజులయింది. మాకే ఇలా వుందంటే మరి మీ అమ్మగారికి ఎలా ఉంటుందో నేను ఊహించగలను. కుదిరితే మళ్లీ రా అక్కా!’’.
‘‘తప్పకుండా’’.
‘‘అక్కా! నేనొకటి అడుగుతాను. తప్పుగా అనుకోవు కదా!’’
‘‘లేదు.. లేదు.. అడుగు’’
‘‘నువ్వు ఫెయిర్ ఇన్ లవ్‌లీ వాడుతావా? ఇంకేదైనా వాడుతావా?’’
‘‘సుందరీ, నిజం చెప్పాలంటే నేను అసలు ఏ క్రీమూ వాడను. స్నానం చేసేటపుడు పసుపు ముఖానికి రాసుకుంటానంతే. వారానికి ఒకసారి సున్నిపిండితో నలుగు పెట్టుకుంటాను. సహజ సౌందర్యానే్న నేను ఇష్టపడతాను. ఇంకా చెప్పాలంటే దీనికంటే మానసిక సౌందర్యానికి ఎక్కువ విలువ ఇస్తాను’’
‘‘అవునా!’’
‘‘అవును సుందరీ. ఈ రోజు యవ్వనంలో ఉన్నాం కాబట్టి ఎలా ఉన్నా అందంగానే కనిపిస్తాం. ఏ బ్యూటీ పార్లర్‌కో వెళ్లి రెడీ చేయించుకుంటే ఇంకా అందంగా ఉంటాం. కానీ వయసు పెరుగుతున్న కొద్దీ ఈ ఆకర్షణ తగ్గిపోతుంది. ముఖంలో ముడతలు, తలలో తెల్ల వెంట్రుకలు వస్తాయి. మనల్ని చూస్తే మనకే నచ్చదు. ఇలా మారిపోయే అందానికి ఎందుకు విలువ ఇవ్వాలి చెప్పు? అదే మనసును తీసుకో. అది ఎప్పుడూ హుషారుగానే ఉంటుంది, మనం ఊహించగలిగితే’’.
‘‘అదెలా? కష్టం వస్తే బాధవేస్తుంది. సుఖంవస్తే ఆనందంగా ఉంటుంది. ఎప్పుడూ హుషారుగా ఎలా ఉంటుంది మనసు?’’.
‘‘అదే కదా మ్యాజిక్. కష్టం వస్తే అందరూ బాధపడతారు. అలా కాకుండా సుఖంవచ్చినా కష్టం వచ్చినా ఒకేలా ఉండగలిగితే అపుడు మనసు మనం చెప్పిన మాటే వింటుంది’’
‘‘అది చాలా కష్టం కదా!’’
‘‘కష్టమే మరి’’
‘‘నువ్వలా ఉండగలవా?’’
‘‘ఇప్పటివరకూ అలాగే ఉన్నాను. ఇకముందు కూడా అలానే ఉండాలనుకుంటున్నాను’’.
‘‘నేను కూడా నీలా ఉండటానికి ప్రయత్నిస్తాను. కానీ నావల్ల కాదేమో.. ఏడుపు నాకు రెడీగా ఉంటుంది. మా అన్నయ్య అయితే ఇది టాప్ విప్పుతుంది చూడండి అని ఏడిపిస్తూ ఉంటాడు’’.
‘‘ఏదైనా నేను చెయ్యగలను అనుకుంటే తప్పకుండా చేస్తావు. చేయగలనో లేదో అనుకుంటే మాత్రం సాధించలేవు. ఏ పని చేయటానికైనా ముందు నిన్ను నువ్వు సిద్ధం చేసుకోవాలి. నీ మీద నీకే నమ్మకం లేకపోతే విజయం నినె్నలా వరిస్తుంది చెప్పు’’.
‘‘అక్షరసత్యం. నువ్వు లెక్చరర్‌వి అయితే బాగుండేదక్కా. పాఠాలు బాగా చెప్పగలవు’’.
‘‘ఈ రోజుల్లో లెక్చరర్స్‌ని ఎవరు గౌరవిస్తారు సుందరీ? వాళ్ళను బఫూన్స్‌లా సినిమాల్లో చూపిస్తున్నారు. హాస్యంకోసం గురువులను కించపరచవచ్చా? ఆచార్య దేవోభవ అన్న విషయానే్న విస్మరిస్తున్నారు. విద్యాబుద్ధులు నేర్పించేది, భవితకు చక్కని మార్గాన్ని చూపే గురువును మన్నించటమే మానేశారు. డబ్బు శాసిస్తోంది ఎవరి మాట ఎవరు వినాలో అదే నిర్ణయిస్తోంది. సమాజంలో మార్పుకి సినిమా ఎంతో దోహదపడుతుంది. అలాంటిది సినిమాల్లోనే గురువులను ఇలా కించపరుస్తుంటే ఇక విద్యార్థులు గురువుల మాటలు ఏం వింటారు? కోట్లుపెట్టి సినిమాలు తీసేవారు కాస్త విజ్ఞత పాటించాలి. ఏది చూపించాలో, ఏది చూపించకూడదో తెలుసుకుని తీయాలి. మనవల్ల ఒక మంచి జరగకపోయినా ఫర్వాలేదు చెడు మాత్రం జరగకూడదని జాగ్రత్త ప్రతి మనిషికి ఉండటం చాలా అవసరమనిపిస్తుంది.
అలా బుగ్గమీద చేయి వేసుకుని వింటున్న సుందరిని చూసి ‘‘నువ్వేదో అంటే నేనేదో మాట్లాడేసాను’’ అంది విశ్వ.
‘‘అక్కర్లేని మాట నువ్వు ఒక్కటి కూడా మాట్లాడలేదు. మా స్టూడెంట్స్‌కి ఒక గంట క్లాసు నీతో ఇప్పిస్తే బాగుంటుంది అనిపించింది తెలుసా?’’
‘‘విశ్వా! ఏం చేస్తున్నావ్? బాలామణిగారు పిలుస్తున్నారు’’
‘‘ఆ! వస్తున్నా!’’ అంటూ అటు వెళ్లింది.
‘‘అమ్మాయ్! నువ్విచ్చిన పుస్తకం చదివేశాం. పరీక్ష ఏదో పెడతానన్నావుగా. ఎప్పుడు పెడతావు?’’
‘‘రేపు 12గంటలకు పెట్టేస్తాను’’
‘‘శాంత నువ్వు వెళ్లిపోతున్నారని చెప్పింది?’’
‘‘వెళ్ళటం మాట నిజమే. కానీ మీకందరికీ బహుమతి ఇచ్చాకే నేను వెళ్ళేది’’’.
‘‘మంచిదమ్మాయ్. ఒకవేళ నువ్వా పని చెయ్యకపోయినా ఫర్వాలేదు. ఎందుకంటే తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఆ పుస్తకంలో. దాన్ని చదవకపోతే అవన్నీ తెలిసేవి కాదు.
- ఇంకా ఉంది

- యలమర్తి అనూరాధ