డైలీ సీరియల్

విలువల లోగిలి-29

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏదో విశ్వ ఉందని అలా ఉంటున్నారనుకుంది.
ఇపుడు తను లేదుగా, ఇక విశ్వరూపం చూపిస్తారనే తన ఊహ తప్పయింది. అయినా తనకు సంతోషమే. అందరూ కలిసిమెలిసి ఉండాలనేదే తన భావన.
గ్లాసుతో మంచినీళ్ళు బిందెలోంచి ముంచి ఇస్తున్న ఆవిడను వింతగా చూస్తూ మంచినీళ్ల గ్లాసు అందుకుంది. ఇంకో సంగతి ఆమెకు మరింత ఆశ్చర్యాన్ని కల్గించింది. అదే! ఆమె కళ్ళలో కనిపిస్తున్న అంతులేని ఆప్యాయత. అమ్మను గుర్తు తెప్పిస్తోంది.
కలా నిజమా తేల్చుకోలేనట్లుగా ఉంది ఆమె పరిస్థితి.
దానినుంచీ తేరుకోకముందే మరో ఆశ్చర్యం ఆమెను చుట్టుముట్టింది.
‘‘వదినా! వదినా!’’ అంటూ ఫణి తనవెంటే తిరగడం! ఇప్పుడతని చూపుల్లో వెకిలితనం లేదు. ఉన్నదంతా ఆరాధనే. అదీ స్వచ్ఛంగ మల్లెపూవులా!
తన చెంగు పట్టుకోవటం లేదు కానీ అమ్మ చుట్టూ తిరిగే తిరిగే పిల్లవాడి తాపత్రయం స్పష్టంగా కనిపిస్తోంది.
ఇంతలో ఇంత మార్పా? విచిత్రమే!
ఇప్పటికిప్పుడు ఈ విషయం ఫోను చేసి విశ్వకి చెప్పేస్తే ఎంత ఆనందపడుతుందో?
‘‘వద్దు.. వద్దు.. ఉత్తరం రాద్దువుగానీ. ఫోనులో అయితే ఒక్కసారి వినేసి వదిలేస్తుంది. అదే ఉత్తరం అయితే మళ్లీ మళ్లీ చదువుకుంటుంది’’ అని సలహా ఇచ్చింది అంతరంగం.
సరే దీని మాట విందాం అని అప్పటికి మాట్లాడే కార్యక్రమానికి ఉద్వాసన చెప్పింది.
ఇక వేణుగోపాల్ అయితే అదే తనకు మొదటి రాత్రేమో అనే అనుభూతిని తెప్పించాడు.
అంతా మాయగా ఉంది. మాయల మరాఠి మంత్రం చెప్పి వస్తువులను మాయం చేసినట్లు వీళ్లందరిలో చెడును విశ్వ తన ప్రేమ మంత్రంతో మాయం చేసేసిందా? అనుకుంది మనసులోనే శాంతి. ఆ రోజంతా ఆమెకు ఓ మధుర జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఇక ఎప్పుడూ ఇలాగే ఉంటుందని మాత్రం ఆమె ఊహించలేదు. కానీ ఒక్కోసారి ఊహించనివే జరుగుతాయి. అలా ఆమె జీవితం ప్రతిరోజూ వసంతంలా మారిపోయింది విశ్వ వచ్చి వెళ్లటంతో.
***
కిటికీ ప్రక్క సీటేమో చిరుగాలి పరామర్శిస్తోంది పదే పదే. ఆ హాయిని అనుభవిస్తోంది విశ్వ.
‘‘ఇంటిల్లిపాదిని కానుకలిచ్చి బుట్టలో వేసుకున్నావ్. ఇందులో నీ గొప్పతనం ఏమీ లేదు’’- ఇప్పటికి ఒంటరిగా దొరికిందని విశ్వను తిట్టటానికిరెడీ అయింది అంతరంగం.
‘‘తల్లీ, హాయిగా ప్రశాంతంగా ఉంది వాతావరణం. జర్నీలో కూడా నన్ను వదలవా? వెళ్ళు.. వెళ్లు..’’ అంది జయం సినిమా సదాను గుర్తుతెచ్చుకుంటూ.
‘‘అక్కడ డైరెక్టరమ్మా. డైరెక్టరు. ఆయన ఏం చెబితే అది చేస్తారు. సదా వెళ్లమంటే వెళతారు. ఉండమంటే ఉంటారు. ఇక్కడ అలా కాదు.
నేనే నీకు డైరెక్టర్ని ఇక్కడ. నేను చెప్పినట్టు వినాల్సిందే’’.
బల్ల లేదుగానీ.. ఉన్నా కొట్టలేదు గానీ కొట్టినట్లే చెప్పింది అంతరంగం.
‘‘హాయిగా చందు కబుర్లతో సేద తీరుదామంటే ఇది నన్ను వదిలిపెట్టేట్లు లేదే?’’
‘‘నాకు సమాధానం చెప్పు?’’
‘‘ఏం చెప్పాలి?’’’
‘‘నీకు తెలియదా?’’
‘‘తెలియదు’’
‘‘నేను చెప్పను’’
‘‘నేనే చెబుతా. లేకపోతే వదలకుండా పట్టేసుకుంటావ్. పిచ్చిముఖమా! నేనోంటో నీకు తెలియదా? కానుకలు మనుషులను దగ్గిర చేసుకోవటానికి. ఇక నా మాటలు మనసులను దగ్గర చేస్తాయి. కానుకలు అశాశ్వతం. మాటలు శాశ్వతం. ఇపుడు చెప్పు. కానుకలదా? నాదా గొప్పతనం?’’ రెట్టించింది విశ్వ.
‘‘ఎప్పుడూ ఇంతే! నన్ను ఓడిస్తావు. ఎప్పుడు నేను గెలుస్తానో ఏంటో? కాసేపు నేను ఒంటరిగా ఉంటే కానీ ఈ నా ఓటమిని తట్టుకోలేను’’ అని వెనుతిరిగింది అంతరంగం..
‘తిక్క కుదిరింది’ అనుకుంది విశ్వ.
ఈ నాలుగురోజులు చందూని చాలా మిస్ అయింది. ఇక తన పరిస్థితి అయితే చెప్పక్కర్లేదు. రోజూ అక్కడ ఉన్నా రాత్రి ఇక్కడ తనను నిద్రపోనిచ్చేవాడు కాదు. కబుర్లు, కబుర్లు. గంటలు గంటలు కబుర్లు. ఇన్ని ఎలా వస్తాయి అంటే-
‘‘ఇది బావి అమ్మా బావి. తోడేకొద్దీ వసూనే వుంటాయి’’ అంటాడు చిలిపిగా.
తన జీవితంలోకి హఠాత్తుగా వచ్చేసి సుడిగాలిలా చుట్టేసాడు. తనదే లోకంలా అయిపోతోంది మనసు. తొలి వలపుకి ఇంత శక్తి ఉందా? తనకు తాను ఎన్నిసార్లు ఇలా ప్రశ్నించుకుందో? అవును. అవును అన్నదే సమాధానం.
చందూవి తనలాంటి భావాలే, కాకపోతే ఇంకాస్త ఉధృతంగా.
నాలుగు రోజులనుంచీ అమ్మనీ, చందూని ప్రక్కన బెట్టి మరీ శాంతి సంసారం గురించి ఆలోచించిందేమో కాసేటిలోనే నిద్రలోకి జారుకుంది విశ్వ.
సెల్ మోతకు లేచింది.
‘హలో!’ అంది విశ్వ.
‘‘చందూని మేడమ్.. దిగండి.. గుడివాడ వచ్చేసింది’’ అన్నాడు.
నిజమా అంటూ అటూ ఇటూ చూసింది.
నిజమే. గుడివాడ బస్‌స్టేషనే. అంత మొద్దు నిద్రపోయిందా? బస్సులోంచి బయటకు చూసింది. ఎదురుగా చందూ ‘హాయ్’ చెబుతూ.
తను సీటులోంచి లేచేలోపే తను బస్సులోపలికి వచ్చి తన బ్యాగు తీసుకుని ముందుకు నడిచాడు.
అతని వెంట విశ్వ.
‘‘అమ్మగారికోసం గంటనుంచీ పడిగాపులు.. తెలుసా?’’ అన్నాడు కారు డిక్కీలో బ్యాగ్ పెడుతూ.
‘‘ఎందుకు వచ్చేముందు నేను ఫోన్ చేసేదాన్నిగా?’’
‘‘ఏమిటీ.. నువ్వా..’’ అన్నాడు పడీ పడీ నవ్వుతూ.
‘‘ఎందుకమ్మా అంత నవ్వు?’’
‘‘మరి.. నేను లేకపోతే తమరు విజయవాడ వెళ్లిపోయిండేవారు. అపుడు నేను వచ్చి తీసుకురావాల్సి వచ్చేది’’.
‘‘మరీ చెబుతావు చందూ’’
‘‘సరే! ఎక్కు. తొందరగా వెళ్దాం’’
‘‘కారు తెచ్చేసావా?’’
‘‘ఆ.. అన్నిటికీ తిరగటానికి వీలుగా ఉంటుందిగా’’
‘‘మరి డ్రైవరు?’’
‘‘అమ్మగారున్నపుడు నేనే తమకి డ్రైవర్ని’’
‘‘వేషాలు.. ప్రైవసీ పోతుందని బడాయి కబుర్లు’’
‘‘గ్రహించేసావే?’’
‘‘నేనేం అంత ముద్దపప్పుని కాను’’
‘‘అలా కన్పిస్తావులే’’

- ఇంకా ఉంది

-యలమర్తి అనూరాధ 9247260206