డైలీ సీరియల్

ఆచరించి చెప్పేవాడే ఆచార్యుడు (నృగమహారాజు -1)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కలియుగంలో కొందరు పరులసొత్తుకాశపడి నానా కల్లలాడుతారు. దొమీలు, దోపిడీలు చేసైనా ఎదుటివారిసొత్తును బలవంతంగా లాక్కుంటున్నారు. అట్లా లాక్కుని తీసుకొంటే ఏవౌతుందో తెలుసుకోరు. అది తెలిసిన హైందవం కనుక పరులసొత్తును పాముగా చూడమని చెబుతుంది. ఎందుకలా చెప్పాల్సి వస్తుందో ఈ నృగమహారాజు జీవితాన్ని ఆలోకించినపుడు మీకే తెలుస్తుంది.
ఒకానొక కాలంలో ఇక్ష్వాకుడనే రాజుకు నృగుడనే పుత్రుడు జన్మించాడు. ఇక్ష్వాకుడు పరమ ధార్మికుడు. కనుక తన పుత్రునికి కూడా ధర్మపథాన్ని అనుసరించమని చెప్పాడు నృగుడు కూడా చిన్ననాటి నంచి ధర్మంగా, నీతిగా, న్యాయంగా ఉండడం అలవాటు చేసుకొన్నాడు. పెద్దయ్యాక నృగుడు రాజ్యాధికారాన్ని పొందాడు. నృగమహారాజు గా కీర్తిపొందాడు. అందరిచేత ధర్మాత్ముడు అన్నపేరుపొందాడు. అనేక వేల యజ్ఞాలు చేశాడు. తన రాజ్యంలో లేమి అనేది లేకుండా ఉండాలని శ్రమించాడు. అందరినీ విద్యావంతులను చేశాడు. జారులు, చోరులు తన నగరానికి ఆమడ దూరంలోకూడా నిలువలేనట్టు చర్యలు తీసుకొన్నాడు.
అటువంటి మహారాజు అనేక బ్రాహ్మణుల, పురోహితుల సలహా మేరకు అనేక వేల దానాలు చేశాడు. భూదానం, గృహదానం, అశ్వ, గజ, గో దానాలు లెక్కలేనన్ని చేశాడు. వస్త్ర,తిలలు, కనకం, మణులు, మాణిక్యాలు ఇలాంటివైతే నిరంతరం ఆ రాజుగారి దగ్గర దానాలు పుచ్చుకునేవారి సంఖ్య లెక్కపెట్టలేనంతగా ఉండేది. ఇన్ని దానాలు చేసినా, యజ్ఞయాగాదులు చేసినా కూడా నృగమహారాజులో ఇసుమంతైనా అహంకారం పుట్టలేదు. తాను నిమిత్తమాత్రుడినని అంతా చేయించేవాడు భగవంతుడే నని అనుకొనేవాడు.
కాని ఓ రోజు నేను అన్ని దానాలు సక్రమంగా చేస్తునే ఉన్నాను కదా అని ఆయన చేసిన పుణ్యకార్యాలన్నింటినీ గుర్తుచేసుకోవడం ఆరంభించాడు. ఆ సమయంలోనే ప్రతిరోజులాగే ఆ రోజు గోదానం కోసం వచ్చిన బ్రాహ్మణుడిని పూజించి తన ఆవుల మందలో ఉన్న ఆవులను తీసుకొని వచ్చి దానం చేశాడు. ఆ బ్రాహ్మణుడు రాజును దీవించి తనకిచ్చిన గోవులను తోలుకుని ఇంటి ముఖం పట్టాడు.
ఆ బ్రాహ్మణుడు వీధి వెంట వెళ్లుతున్నపుడు ఆ దారినే కశ్యపుడన్న బ్రాహ్మణుడు వెళ్తున్నాడు. ఆయన అనుకోకుండా గోవులను చూశాడు. విప్రుడు తోలుకెళ్లే గోవుల్లో తన గోవు ఉన్నట్టు గ్రహించాడు. ఆ కశ్యపునకు విపరీతమైన కోపం వచ్చింది. వెంటనే వెళ్లి ‘ ఓ బ్రాహ్మణోత్తమా ! నలుగురికి ధర్మం చెప్పాల్సిన నీవే నాగోవును దొంగలించి తీసుకొని వెళ్తున్నావే ఇది ఏంబాగుంది?’ అని అడిగాడు.
విప్రునకు విషయం అర్థం కాక ‘నేను నీ గోవులను తీసుకొని వెళ్లడం లేదు. నాకు నృగమహారాజు దానంచేసిన గోవులను తీసుకెళ్తున్నాను.
- ఇంకాఉంది

- డా. రాయసం లక్ష్మి