డైలీ సీరియల్

విలువల లోగిలి-31

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఊ!’’
అడుగులు ముందుకే పడుతున్నా మనసు వెనక్కి అడుగేస్తోంది. అలా వెనక్కి చూస్తూనే వెళ్లింది విశ్వ.
ఒక్కోసారి ప్రక్కనే వున్నా ఎన్నో యోజనాల దూరంలో ఉన్నట్లుంటుంది.
ఇప్పుడా ఇద్దరూ అదే పరిస్థితిలో ఉన్నారు.
విశ్వకి అమ్మా కావాలి, చందూ కావాలి.
చందూ ఎంత మంచివాడు?
అమ్మను బాగా అర్ధం చేసుకున్నాడు. తనని ‘అత్తయ్యా!’అని కూడా పిలవడు. అమ్మా అనే అంటాడు. అలా ఉంటేనే ఆవిడ తమకి దగ్గిర అవుతుందంటాడు. రేపు ఆవిడను మనతోపాటూ తీసుకెళ్ళాలిగా. దానికి ఇప్పటినుంచే సంసిద్ధం చెయ్యాలి మనం అంటాడు.
తను అమ్మని తమతో తీసుకువెళ్ళాలి అని చందూకి చెప్పకముందే తను అలా అనటం చాలాచాలా సంతోషాన్నిచ్చింది. తన మనసులో మాట గ్రహించగలిగే శక్తి తనకెలా వచ్చింది?
ఎదుటివారిపై ప్రేమ ఎక్కువుగా ఉంటే అలాగే తెలిసిపోతాయి. ఆ మాత్రం తెలియదా అన్నట్లు అంది అంతరంగం.
తమిద్దరిలో ఎవరికి ఎవరిపై ఎక్కువ ప్రేమ. ఎవరూ చెప్పలేరేమో! చివరకు తామిద్దరు కూడా!
తలుపు చప్పుడయితే ఎదురువచ్చింది సుగుణ.
‘‘వచ్చావా విశ్వా! ఎన్నాళ్ళో అయిపోయినట్లుందే నిన్ను చూసి’’అంటూ ఒళ్ళంతా తడిమింది ప్రేమగా.
‘‘నాకుకూడా అమ్మా! అక్కడ ఉన్నా నువ్వెలా ఉన్నావో అనే బెంగే. అక్కడే ఉన్నానని చెప్పవచ్చు కదా!’’
‘‘్భవనక్కే చెప్పొద్దంది. వినకపోతే బాధపడుతుందేమోనని చెప్పలేదు విశ్వా.’’
‘‘్ఫరవాలేదు లేమ్మా. అలా చెప్పి ఉంటే మరింత ప్రశాంతంగా అక్కడ పని చేసుకునే దాన్ని.’’
‘‘ఇంతకీ వాళ్ళంతా ఎలా ఉన్నారు? నీ మాట వింటారంటావా?’’
‘‘చూద్దాం! నాలుగు రోజుల్లో తెలిసిపోతుందిగా.’’
‘‘శాంతిని ఏమయినా అంటారేమో?’’
‘‘ఎప్పుడూ అనేదేగా. ఇప్పుడూ అంటారు. అంతే.’’
‘‘ఇంకా ఎక్కువయితే నీవల్ల అదీ నా భయం.’’
‘‘అమ్మా! నీ కూతురు ఎవరికైనా మంచే చేస్తుంది కానీ చెడు చెయ్యదు. సరేనా?’’
‘‘అది నాకు తెలియదా? ఎందుకో కంగారు. చెడ్డవాళ్ళదగ్గిరే చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ప్రమాదం.’’
‘‘నేను వచ్చేసాను కదమ్మా. ఇంకా నీకు భయం దేనికి?’’
‘‘నువ్వుసరే. శాంతి సంగతే నేను భయపడేది.’’
‘‘్ఫను చెయ్యనా?’’
‘‘వద్దు. తనే చేస్తుందిలే వీలుచూసుకుని, ఇంతకీ క్షేమంగా చేరానని ఫోనుచేసి చెప్పావా? అది మన కనీస మర్యాద’’
‘‘చెప్పానమ్మా. బస్టాండులోనే చెప్పేసా. ఇంటికి వచ్చాక అయితే మీ అందరి హడావిడిలో మరిచిపోతానేమోనని.
ఒంటరిగా వెళుతున్నానని అది అసలే బెంగగా ఉంది. ఇక ఈ విషయం తెలియకపోతే ఇంకేమన్నా ఉందా? అసలే కంగారుగొడ్డు.’’
‘‘అంతా నీలా ధైర్యంగా ఉంటారా ఏం?’’
‘‘మనిషికి ధైర్యం తప్పక ఉండాలమ్మా. అప్పుడే ఎన్ని అవరోధాలనయినా అవలీలగా దాటెయ్యగలుగుతాం’’.
‘‘ఏమోనే! నువ్వు ధైర్యంగా అలా అన్నీ చేస్తుంటే బాగుంటుంది కానీ నా ప్రాణాలు అరచేతుల్లో ఉంటాయంటే నమ్ము. వాళ్ళేమన్నా చేస్తారేమో నిన్ను అని ఎంత బెంగపెట్టుకున్నానో నీకు తెలియదు.’’
‘‘నేనేమన్నా చిన్నపిల్లనా? అంత భయపడతావెందుకు?’’
‘‘శాంతి చెప్పిన మాటలు వింటే ఎవరికైనా భయంవేస్తుంది.’’
‘‘ఇప్పుడు నేను వచ్చేసానుగా. ఇంక ధైర్యంగా ఉండు.’’
‘‘అంతేలే. నువ్విలా సాహసాలు చేస్తూనే ఉండు.’’
‘‘పోనీ! మానెయ్యనా?’’
‘‘వద్దులే. ఒకరికి ఉపకారం చేస్తుంటే. సహాయం చెయ్యాలికానీ వద్దనకూడదు. అది మహాపాపం.’’
‘‘అందుకే మా అమ్మంటే నాకిష్టం’’అంటూ ముద్దుపెట్టింది.
‘‘మరి నాకో’’అన్నట్లు చూసాడు చందూ.’’
‘‘తమరెప్పుడు వచ్చారు?’’
‘‘మాకు అన్యాయం చేస్తున్నప్పుడు.’’
‘‘అదేమిటి మీకు నేను ఏమి అన్యాయం చేసాను?’’
‘‘పక్షపాతం చూపిస్తూ ఏం చేయలేదంటావేమిటి?’’
‘‘నేనా? ఎప్పుడు?’’
‘‘అబ్బే! తెలియదు. చాలా అమాయకురాలు.’’
‘‘అవును మరి.’’
‘‘పోనీలే ఆ బాకీ రాత్రికి వడ్డీతో కలిపి తీసుకుంటా’’
‘‘అందుకే అమ్మ నువ్వురాగానే వెళ్ళిపోతుంది లోపలికి.’’
‘‘ఆవిడ లేరనే నేనలా మాట్లాడాను. ఉంటే బుద్ధిమంతుడిలానే ఉంటాను. నీకు మాట రానిస్తానా?’’
‘‘నాకు తెలియదా చందూ! సరదాకి అన్నాలే!’’
‘‘సరే! అమ్మకు ఏమైనా సాయం కావాలేమో చేద్దాం పద’’
‘‘ఏం అక్కర్లేదు. అలా పెరట్లో కుర్చీలు వేసుకుని కబుర్లు చెప్పుకోండి’’ అంది సుగుణ లోపలినుంచీ.
‘‘అమ్మా! బొప్పాయికాయ కొయ్యనా. పండినట్లుంది.’’
పెరట్లోకి వెళ్ళి కర్ర తీసుకువచ్చింది విశ్వ.
‘‘ఇటు ఇవ్వు నేను కొడతాను’’అన్నాడు ఆమె చేతిలోంచి దాన్ని అందుకుంటూ.
‘‘చాలా జాగ్రత్తగాకొట్టాలి. బాగా పండిందికదా!’’
‘‘నాకు తెలుసులేవోయ్.’’అంటూ జాగ్రత్తగా దాన్ని క్రిందనుంచీ కర్రతో నొక్కి క్రిందపడేలోపు లాఘవంగా పట్టుకున్నాడు.
‘‘ఏమో అనుకున్నాను. ఫరవాలేదే’’ అంది నవ్వుతూ విశ్వ.
కర్రను లోపల పెట్టేసి వచ్చింది.
- ఇంకా ఉంది

-యలమర్తి అనూరాధ 9247260206