డైలీ సీరియల్

మేలుమేలు పరమాత్మ సన్నిధినే( ధ్రువుడు -2)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏమీ తెలియనట్టు అసలు ధ్రువుణ్ణి చూడనే చూడనట్టుగా నటించసాగాడు. ఇవేమీ పట్టని ధ్రువుడు ఎంతో ప్రేమగా తండ్రి ఒడిలోకూర్చోవాలనే ఉద్దేశంతో తండ్రినే చూస్తున్నాడు.
సురుచి కోపాన్ని పట్టలేకపోయింది. వెంటనే ఉత్తాన పాదుని దగ్గరకు వచ్చింది. తండ్రి ఒడిలో కూర్చోబోయే ధ్రువుని పట్టి కిందకు తోసివేసింది. నీ స్థానం ఇది కాదు. నీ తండ్రి అంకపీఠాన్ని అధిరోహించాలంటే తండ్రి లాలింపును, ప్రేమను పొందాలంటే కేవలం నాకడుపున పుట్టాలి. దానికి అదృష్టం కావాలి. నీకు ఆ సునీతికి పుట్టావు కనుక నీకార్హత లేదు. తండ్రి ఒడిలో నీకు కూర్చోవడానికి వీలులేదు. వెళ్లు ఇక్కడనుంచి వెళ్లిపో..అనిరంకెలు వేసింది.
ఆ ధ్రువుని చిన్న మనసు తల్లడిల్లిపోయింది. హృదయం ఎంతో గాయపడింది. ఈసడింపు తట్టుకోలేకపోయాడు. తండ్రి వైపు దీనంగా చూశాడు. కాని తండ్రి కూడా వౌనాన్ని ఆశ్రయించడంతో తానేమీ చేయాలో తెలియక సవితి తల్లిని ఎదరించలేక, తాను కూడా ఉత్తాన పాదుని పుత్రుడినే కదా అన్న ఊహబలీయమై ఉన్నా కూడా పెద్ద పెట్టున ఏడుస్తూ ముఖం అంతా కమిలిపోగా రోషావేశంతో, ఎంతో దుఃఖంతో సునీతి దగ్గరకు పరుగెత్తి వెళ్లాడు.
‘అమ్మా! నేను ఉత్తాన పాద రాజుగారి పుత్రుడిని కానా? నాకెందుకు నాతండ్రి ఒడిలో కూర్చునే అర్హత లేదు’అంటూ తల్లిని నిలదీశాడు. ఆ మాటలు విని అక్కడ జరిగిందేమిటో ఊహించుకున్న తల్లి సునీతి కొడుకును దగ్గర తీసుకొని ఎంతో గారాబంగా ఒళ్లంతా నెమిరింది. ఎంతో లాలలనగా అసలేమీ జరిగిందని ఇలా దుఃఖిస్తున్నావు అని మెల్లగా అడిగింది.
మధ్యాహ్న మార్తాండునిలాగా ఎర్రగా కందిపోయిన మోము తో ఉన్న ఆ చిన్నారి ధ్రువుడు ఏడుస్తూనే సురుచి చేసిన అవమానాన్ని చెప్పాడు. నాకు కూడా తండ్రి అభిమానం కావాలన్నాడు. దానికి సునీతి ‘పుత్రా! నీ పినతల్లి చెప్పింది. నిజమే. నీవు పూర్వజన్మలో చేసిన పాపం వల్లనే నా కడుపున పుట్టావు. నేను చేసిన పాపం వల్లనే నా భర్త ప్రేమను నేను పొందలేకపోతున్నాను. దానివల్లనే నీకు తండ్రి ప్రేమను నేను అందించలేకపోతున్నాను. మన పాపనాశం కావాలంటే ఆ శ్రీమన్నారాయణుడి దయ కావాలి. అందరూ కోరుకునే ఈ తండ్రి ప్రేమనే కాదు సర్వలోకాలకు తండ్రియైన ఆ నారాయణుని ప్రేమను పొందగలిగావంటే ఈ లోకంలో ఉన్నవన్నీ నీవు కోరుకున్నవన్నీ నీ పాదాల చెంతకు వస్తాయి. ఆనాడు నీ తండ్రే కాదు నీ పినతల్లి కూడా నీ చెంతన నిలిచి నీకేమేమి కావాలో వాటిని కూర్చడానికి ప్రయత్నిస్తుంది కనుక నీవు మొట్టమొదట కనులు తుడుచుకుని పూర్వజన్మ పాపాలను పోగొట్టుకొనే ఉపాయం ఉన్న ఆ నారాయణుని నామాన్ని జపించు. ఆ సర్వలోకాలకు తండ్రి యైన ఆ విష్ణువు ప్రేమను పొందు అని లాలించి చెప్పింది.
అంత ఏడుపులోనుధ్రువుడు తల్లి చెప్పి న మాటల్లోని యథార్థతను గ్రహించాడు. వెనువెంటనే తల్లికి నమస్కారం చేశాడు. కాలు బయటకు అడుగుపెట్టాడు. అందరినీ వదిలి పిన్నవయస్సులోనే ఆ నారాయణుని దర్శనం కోసం అడుగులు వేశాడు.
ఈ విషయాలన్నీ త్రిలోక సంచారి యైన నారదుడు తన దివ్యదృష్టితో చూశాడు. ఆహా చిన్నవాడైనా ధ్రువుడు క్షత్రియుడు. కనుకనే తనను అవమానించిన వారి సహింపరాని ములుకుల వలె ఉన్న పలుకులను వినలేకున్నాడు. ఎంతో ఖేదాన్ని భరిస్తూ అడుగులు వేస్తున్నాడు. ఆ నారాయణుని అనే్వషణా పథంలో నేను కూడా తోడుంటాను అనుకొన్నాడు నారదుడు. వెంటనే ధ్రువుని ముందు నిలచాడు. ముక్కుపుటాలు ఎర్రగా కందిపోయి అదురుతుంటే రోషావేశాన్ని తన అదుపులో ఉంచుకుని నారాయణ మంత్రాన్ని జపిస్తూ వేగంగా వెళ్లుతున్న ధ్రువుడు నారదుని చూశాడు.
- ఇంకాఉంది

- డా. రాయసం లక్ష్మి. 9703344804