డైలీ సీరియల్

సాధనమున పనులు...( ధ్రువుడు -4)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాని తండ్రి భూభాగాన్ని నాకు ఇస్తాడా? నాకు మంచివివాహము, దానితో భార్యాపిల్లలు ఇవన్నీ జరుగుతూ ఉంటే నా మనసు అప్పటిదాకా వేదన భరించగలదా? నేను క్షత్రియుడను. క్షాత్ర ధర్మాన్ని స్వీకరించాను. నేను నా పినతల్లి సురుచి పలికిన దుర్భాషలతో నా హృదయం ముక్కలై పోయింది. నీవు బ్రహ్మమ దేవునివల్లఉదయించావు కదా. నీవు ముల్లోకాలను ఈ మహతిని వాయిస్తూ తిరుగుతుంటావు కదా.కనుక నాకు అతిసులభంగా అతి శీఘ్రంగా ఆ నారాయణుని దర్శనం పొందే భాగ్యానికి మార్గం ఉపదేశించుము’అని కోరుకున్నాడు.
ధ్రువుని మాటలు విని ఎంతో సంతోషపడి నారదుడు యమునానదీజలాలలో స్నానం చేసి నిశ్చలమైన బుద్ధితో నారాయణునకు నమస్కరించు. వేదాలలను పఠించే వయస్సు అర్హత నీకు లేదు కనుక నీవు దర్భలతో ఆసనాన్ని కలిగించుకో. పూరకమూ, రేచకమూ, కుంభకమూ అనే మూడు విధాలైన ప్రాణాయామాలను అభ్యసించు. ప్రాణేంద్రియ మనోమలాలలను పోగొట్టుకుని చాంచల్య దోషాలను తొలిగించుకో. స్థిరమైన బుద్ధితో అచంచలమైన నమ్మకంతో ఆశ్రీహరిని వేడుకో. నీకు నేను ముందుగా ఆ శ్రీమన్నారాయణుని అవతార విశేషాలన్నింటినీ చెబుతాను. విను. దాని వల్ల నీకు ఆ శ్రీహరిపై నమ్మకం దృఢతరం అవుతుంది. ఆపై కూర్చుని తదేక ధ్యానం చేద్దువు’ అంటూ నారాయణుని దశావతార విశేషాలను ధ్రువునికి వివరించాడు. నారదుడు చేసిన ఈ పని వల్ల ధ్రువునిలో కోరిక మరింత బలపడింది. ఎలాగైనా ఆ నారాయణుని దర్శనం పొందాలనుకొన్నాడు. అపుడు ‘నారదా మహర్షీ రూపం లేకపోయినా భక్తుల కోరిక మేరకు రూపంకల్పించుకొనే ఆ పరంధాముడు వైకుంఠ వాసుడు కదా. ఆ వైకుంఠంలో శేషశాయిపై పవళించియున్నపుడు ఏ యే విశేషాలతో ఉంటాడో నాకు ఒకసారి వినిపించండి’ అని ధ్రువుడు అడిగాడు.
ధ్రువునిలో శాఖోపశాఖలుగా విస్తరిస్తున్న భక్తి అనే మహా వృక్షాన్ని చూసిన నారదుడు చాలా సంతోషించాడు. ధ్రువా! ఆ నారాయణుడు కృపారసం కలిగినవాడు. అపార కరుణావత్సలుడు. సుప్రసన్నమైన మోము కలవాడు. చల్లని చూపులు కలవాడు. అందమైన ముక్కు కలిగినవాడు. సొగసైన విల్లువంటి కనుగొమ్మలు కలిగినవాడు. చిక్కని చెక్కిళ్లు కలవాడు. ఇంద్రనీల మణుల వలె ప్రకాశించే మేను కలవాడు. పడచువాడు. ఎర్రని నేత్రాలు పెదవులు కలిగిన వాడు. శ్రీవత్సం అనే పుట్టుమచ్చ గలవాడు. సర్వ లోక రక్షకుడు ఆ హరి మెడలో హారాలు ధరించి ఉంటాడు. తలకు మణులతో దేదీప్యమానంగా వెలిగే కిరీటాన్ని ధరించి ఉంటాడు. భుజకీర్తులు, కౌస్త్భుం ధరించి ఉంటాడు. సూర్య చంద్రుల వంటి కాంతిని వెదజల్లే మకర కుండలాలను పెట్టుకొని ఉంటాడు. శంఖం, చక్రం, గద, పద్మ అనే నాల్గింటిని నాల్గు చేతులతో పట్టుకొని ఉంటాడు. ఆయన మెడలో సువాసనలీనే వనమాల అలరారుతుంటుంది. పచ్చని పట్టు వస్త్రాన్ని కట్టుకొని ఉంటాడు. మేలిమి బంగారు అందెలు కాళ్లకు అలంకరించుకుని ఉంటాడు. గొప్ప సద్గుణాలు కలిగినవాడు. తన భక్తులకు కష్టం కలిగితే చూడలేనివాడు. వారు కోరుకున్నా వారికి సకల వరాలను అందించేవాడు. భక్తులచే వరదుడన్న బిరుదును పొందినవాడు’ అని చెప్పాడు. అన్నీ మాటలు శ్రీహరి గురించి విన్న ధ్రువుని కంటివెంట నీళ్లు కారసాగాయి. ఆ నీటిని తన చేతితో తుడుస్తూ ‘నాయనా! మరేమీ ఫర్వాలేదు. నీవు పసివాడవు. నీ వేదన ఆ వైకుంఠ వాసుని కరిగించివేస్తుంది. నీ దీనాలాపనలను, నీ ధృడ నిర్ణయాన్ని చూసి ఆ దేవదేవుడే నీ దగ్గరకు తప్పక వస్తాడు. నీ మనోవాంఛ తప్పక తీరుతుంది. ’ అని నారదుడు ధ్రువుడిని దీవించాడు.
- ఇంకాఉంది