డైలీ సీరియల్

ఉపాఖ్యానాలు - ధ్రువుడు -4

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీవు నిశ్చలంగా కూర్చుని ‘ఓమ్ నమో భగవతే వాసుదేవాయ’ అని ఏడు రోజులు జపిస్తే చాలు ఆ దేవుని దర్శనం తప్పక నీకు లభిస్తుంది. అని మరో మారు దీవించి నారదుడు తన దారిన తాను వెళ్లాడు.
ధ్రువుడు తన మనోరథాన్ని మరొక్కసారి గుర్తుచేసుకొన్నాడు. ఆ పై ఆ నారాయణుని రూపాన్ని స్మరించుకున్నాడు. ఆ వైకుంఠుని అందరూ తులసి మాలలతోను, జాజిపూవులతోను, మరువకం, దవనం లాంటి సువాసనలిచ్చే పత్రాలతోను పూజిస్తారు. కానీ నేను ఏం చేయను. కేవలం నా మనస్సునే ఒక పుష్పంగా ఆ వైకుంఠునికి సమర్పిస్తాను అని నిర్ణయించుకుని నారదుని వల్ల ఉపదేశం పొందిన మంత్రాన్ని ఏవిదంగా జపించాలో ఆలోచిస్తూ మధువనం చేరుకున్నాడు.నారదుడు ఉత్తాన పాదుని స్థితి ఏమై ఉంటుందో చూద్దామని వెళ్లాడు. అక్కడ భార్యకు ఎదురుచెప్పలేకపోయాడు. కాని తన చిన్నకొడుకు ముద్దులొలుకే మాటలతో తండ్రీ అని పిలుస్తూ తన చెంతకు వస్తే దగ్గరకు తీసుకొన లేకపోయానే. అయ్యో నా తండ్రి వాని బాధను అమ్మతో చెప్పుకుని అరణ్యాలవెంట వెళ్లాడట . అయ్యో నాతండ్రీ నా ఒడిలో కూర్చోవాలనే నీ కోరిక ఇంత గట్టిదనుకోలేదు. దానికోసం ఆ పదునాల్గు భువనాలను తన కుక్షిలో కూరుకుని ఉన్న ఆ నారాయణునే అడగడానికి వెళ్లావా అనుకొంటూ లోలోపల కుమిలిపోతున్నాడు.
ఆ వేళలో నారదుడు వచ్చాడు. ఉత్తాన పాదుడు మహర్షికి ఉపచారాలను చేశాడు. ఉచితాసనాన్ని ఇచ్చాడు. కాని తన మనసులోని బాధను దిగమింగలేక కళ్లల్లో నీరు ఉబికి వస్తుంటే దాచుకోలేక అవస్థ పడిపోతున్నాడు.
రాజు దీనస్థితిని చూసి నారదుడు‘రాజా! నీవెందుకో మనోవిచారంతో మగ్గిపోతున్నావు కారణమేమిటి? ’అని అడిగాడు. ఉత్తానపాద రాజు ఇక ఆగలేక ఇలా చెప్పాడు. ‘ఓ మహర్షీ నేనెంతో పాపం చేశాను. నా చిన్న భార్య మీద అతిప్రేమతో సునీతిని బాధపెట్టాను. ఇపుడు సునీతి కొడుకు చిన్నవాడు కేవలం ఐదేండ్ల వాడిని కూడా నేను బాధ పెట్టాను. వాడు నా ఒడిలో కూర్చోవడానికి ఆతురత పడితే నేను వద్దని వారించి పంపించివేశాను. దానితో వాడు వ్యధ చెంది తన అమ్మకు చెప్పుకుని అరణ్యాల వెంట వెళ్లిపోయాడట. తపస్సు చేసి తండ్రి ఒడిలో కూర్చుంటాను అని వెళ్లిపోయాడట. అయ్యో చాలా చిన్నవాడే. బాలకుడే ఆ అరణ్యాల వెంట ఒంటరిగా పోతుంటే ఏ క్రూర మృగమో వచ్చి వానిని పొట్టపెట్టుకుందేమో. అసలు ఎండ కనె్నరని వాడు కదా. పసివాడు దాహార్తితో, నడిచి నడిచి మార్గాయాసంతో కళ్లు తిరిగి ఎక్కడైనా పడిపోయి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లాడేమో కదా. నేనెంత పాపిని’ అయ్యో నేనేమీ చేసేది. నాకు పుట్టగతులుంటాయా ఇంత చిన్నవాడిని బాధపెట్టడానికి నాకు మనస్సెలా వచ్చింది.’ అంటూ నారదమహర్షికి చెబుతూ తాను తననే దూషించుకుంటూ పెద్దగా రోదించసాగాడు ఉత్తానపాదుడు.
అపుడు నారదుడు ఉత్తానపాదుని స్వస్థత కలిగించుకోమని నీ పుత్రుడు క్షేమంగా ఉన్నాడని స్వాంతన పలుకులు చెప్పాడు. ఆ మాటలకు రాజు మోము చిరునవ్వు కనిపించింది. మీ దగ్గర నా కుమారుడు ఉన్నాడా. ఉంటే వానిని నేను క్షమించమని అడుగుతాను. నా చిన్నతండ్రిని నన్ను కోపగించుకోవద్దని బతిమాలుతాను అంటూ వేగిర పడ్డాడు.
- ఇంకాఉంది

- డా. రాయసం లక్ష్మి. 9703344804