డైలీ సీరియల్

ఒయాసిస్.. 29

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘కొంతకాలం తర్వాత మళ్లీ హేమంత్‌తో స్నేహం కొనసాగింది. రాకపోకలు ప్రారంభమైనాయి. అహోబలరావుతో చెప్పి కొన్నిసార్లు, చెప్పకుండా కొన్నిసార్లు శే్వత హేమంత్‌ను కల్సుకుంటుండేది. చిన్న చిన్న బహుమతులు ఇచ్చినా, అవి అపురూపంగానే కనిపించేవి. ప్రేమకున్న ఆకర్షణ శక్తి భూమ్యాకర్షణ శక్తికన్నా గొప్పది. డాక్టర, యాక్టరు, ప్లీడరు, ఫిలాసఫర్, రాజూ, పేద- చివరకు సర్వసంగ పరిత్యాగులు, మహాపురుషులూ కూడా ప్రేమకు దాసోహం అన్నవారే.
‘‘హేమంత్‌తో మధ్యలో ఆగిపోయిన ప్రేమాయణం ఇంటర్వెల్ తర్వాత కొనసాగిన సినిమాలా కంటిన్యూ అయింది. మధ్యలో దారి తప్పిన రంగుల కల మళ్లీ దారిలోకి వచ్చినట్లు అనిపించింది. హేమంత్‌మీదకు మనసు మళ్లినందువల్ల అహోబలరావు పట్ల అసహనం పెరిగిపోతోంది. చీటికి మాటికి ఆయన పట్ల చిరాకు పడుతోంది.
‘‘ఒక ఫ్రెండ్ పెళ్లికి పిలిచాడన్న నెపంతో హేమంత్, శే్వత రెండు వారాలపాటు అమెరికాలో తిరిగొచ్చారు. ఇది వాళ్లిద్దరిమధ్యా సాన్నిహిత్యాన్ని పెంచింది. అహోబలరావు అడ్డు తొలగితే మళ్లీ ఇద్దరూ ఏకం కావచ్చన్న అభిప్రాయం ఏర్పడి వుంటుంది.
‘‘శే్వత వైఖరిలో వచ్చిన మార్పు అహోబలరావు గమనించలేనంత అమాయకుడు కాదు. ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలా అన్న ఆలోచన కల్గి ఉంటుంది. భార్యమీద విముఖత ఏర్పడిన సమయంలో ఆయన దృష్టి ఇతర స్ర్తిల వైపు మళ్లటం సహజమే. ఆయన యాజమాన్యంలోని కాలేజీలో వైస్ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న ఛాయ ఈ విషయాన్ని కనిపెట్టింది. లేదా ఆయనే ఆమెకు చూచాయగా తెలియజేసి ఉండవచ్చు. శే్వత ఇంట్లో లేని సమయంలో ఛాయ వచ్చి ఆయనకు కంపెనీ ఇవ్వటం మొదలెట్టింది. ఛాయ తీసుకుంటున్న చొరవ శే్వతకు ఇష్టం లేకపోయినా, తనకూ హేమంత్‌కు బలపడుతున్న బంధం కారణంగా కొంతకాలం వేచి చూడాలని ఆమె అనుకుంది.
‘‘శే్వత ప్రోద్బలం మీద అహోబలరావు హేమంత్ దగ్గర జనరల్ చెకప్ చేయించుకున్నాడు. అహోబలరావు హార్ట్‌కి ఒక వాల్వ్ బ్లాక్ అయిందని, మందులతో ట్రీట్ చేయవచ్చుననీ హైపొటెన్సీ మందులు రాసి వాటిని వాడమన్నాడు. అక్కర్లేకపోయినా హై పొటెన్సీ మందులు వాడినందువల్ల ఆయన క్రమంగా అనారోగ్యానికి గురికావడం మొదలెట్టాడు. గది గమనించిన ఛాయ రెండు రోజులు మందు ఆపేసి చూడమంది. మందు వాడకపోతేనే ఆయనకు హాయిగా ఉన్నట్లు అనిపించింది. మరి ఆ డాక్టరెందుకు ఇలాంటి సలహా ఇచ్చాడు అన్న అనుమానమూ వచ్చింది. ఆయన మనసులో ఎక్కడో ఒక మూల రగులుతున్న అగ్నికి ఛాయ ఆజ్యం పోసింది. శే్వత, హేమంత్ కలిసి అహోబలరావును మృత్యువు దగ్గరగా లాక్కెళ్లి ఆయన చనిపోతే అది సహజమైన మరణంగా లోకానికి చూపించే ప్రయత్నం చేశారా?
‘‘్ఛయకు అఖండమైన తెలివితేటలున్నాయి. మాటలతో ఎవరిని ఎలా ఎటు దారి మళ్లించాలో ఆమెకు తెల్సినంతగా మరెవరికీ తెలియదు. శే్వత హేమంతరావు వైపు మొగ్గు చూపుతున్న సమయంలో అహోబలరావు ఛాయ వైపు మొగ్గు చూపడం మొదలెట్టాడు. భార్య తనను మృత్యువు వైపు నెట్టేస్తుందన్న అనుమానంతో అహోబలరావు భార్యను అంతమొందించేందుకు పథకం వేశాడా? ఈ పథకంలో ఆయనపై ఛాయ ప్రభావం ఏ మేరకు ఉంది? శే్వత చనిపోతే, ఆమె మరణంవల్ల ఎవరికి ఎలాంటి లాభం ఉంది? శే్వత అడ్డు తొలగితే ఆ నర్సింగ్ హోంకి తనే ఆధిపత్యం వహించవచ్చునన్న అభిప్రాయంతో మమత హంతకుడికి సహకరించిందా? అసలింతకీ హత్య చేసిందెవరు? ఎవడైనా ఓ ఖూనీకోరుకి డబ్బిచ్చి చేయించాడా?
‘‘ఇవన్నీ ప్రశ్నలు.. వీటికి కచ్చితమైన సమాధానాలు లేవు. ఆయా పరిస్థితుల ఆధారంగా ఇలా జరిగి ఉండవచ్చునన్న ఊహాగానంతో ఈ అభిప్రాయాలకు వస్తున్నాను తప్ప, కచ్చితంగా ఇదిగో ఈ ఆధారాలవల్ల ఈ వ్యక్తి హత్య చేశాడు, లేదా చేయించాడు- అని నిరూపించే స్థితిలో లేను. మరికొంత సమాచారం సేకరించిన తర్వాతనే కచ్చితమైన నిర్ణయానికి రాగలుగుతాను’’ అన్నాడు రణధీర్.
తన పరిశోధన కొనసాగించమని ఉన్నతాధికారులు రణధీర్‌కి ఆదేశాలు ఇచ్చారు.
‘‘ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన కారెక్టర్ మన పరిధిలోకి వచ్చింది. ఆ అమ్మాయి పేరు దీప్తి.. ఆ ఇంజనీరింగ్ కాలేజీలోనే క్లర్క్‌గా పనిచేస్తోంది.. పేదింటి పిల్ల అయినా శ్రీమంతురాలైపోవాలన్న ఆకాంక్ష మెండుగా ఉన్న అమ్మాయి.. అశ్వినీ నర్సింగ్ హోంలో శే్వత ద్వారా సరోగేట్ మదర్‌గా ఉండటానికి అయిదు లక్షలకు ఆశపడి ఒప్పుకుంది. ప్రాసెస్ స్టార్ట్ అయ్యాక శే్వత అంత డబ్బు ఇవ్వరని చెప్పింది. అయితే అబార్షన్ చేయమని దీప్తి శే్వతను అడిగింది. వీరిద్దరిమధ్య కొంత ఘర్షణ జరిగింది. ఈ వ్యవహారం కొలిక్కి రాకముందే శే్వత హత్య జరిగింది. మర్నాడే దీప్తి నర్సు సహాయంతో అబార్షన్ చేయించుకుంది. అవతలి పార్టీ నుంచి అయిదు లక్షలు శే్వత వసూలు చేసిందనీ, తనకు మాత్రం లక్షో, రెండు లక్షలో ఇచ్చి మిగిలింది తాను నొక్కేసే ప్రయత్నం చేసిందంటూ దీప్తి శే్వతమీద మండిపడుతోంది..’’ అన్నాడు రణధీర్.
‘‘ఇది శే్వత హత్యకు దారితీసేంత బలమైన కారణమా?..’’ అని అడిగాడు అడిషనల్ పోలీస్ కమిషనర్.
‘‘కాకపోవచ్చు.. కానీ ఏ చిన్న కారణమైనా మనకొక పెద్ద ‘క్లూ’ ఇచ్చే అవకాశం ఉంది. అలాటి అవకాశం వదులుకోకూడదనే దీప్తిని కూడా వదలకుండా ఫాలో అవుతున్నాను..’’ అన్నాడు రణధీర్.
‘‘గో ఎహెడ్..’’ అని అడిషినల్ కమీషనర్ అన్నాడు.
అంతటితో ఆ సమావేశం ముగిసింది.
రణధీర్ తన రూంలోకి వచ్చి కూర్చోగానో ఛాయ ఫోన్ చేసింది.
‘‘ఒక శుభవార్త’’ అన్నది.
‘‘ఎవరికి శుభవార్త?’’ అని అడిగాడు రణధీర్.

- ఇంకా ఉంది

శ్రీధర