డైలీ సీరియల్

సమీక్షించుకోవడం అవసరమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విష్ణ్భుక్తుడైన ప్రహ్లాదుడు అనునిత్యం విష్ణు సంకీర్తనలోనే కాలం గడిపేవాడు. తన కర్తవ్యాన్ని ఏమరక చేస్తుండేవాడు. తన రాజ్యంలో ఎక్కడా అన్యాయాకమ్రాలు జరగకుండా ఉండాలనే ఎన్నో చర్యలు తీసుకొనేవాడు. నిద్ర లేచినప్పటి నుంచి తిరిగి కనులు మూసుకొని పడుకునేదాకా నిరంతరం ఏపని చేసినా ప్రహ్లాదుని మనసు మాత్రం ఆ దేవదేవుని పాదపద్మాలపైనే ఉండేది. కానీ అప్పుడప్పుడు నేను మహావిష్ణువును సరిగా పూజించడం లేదేమో తర్వాతి జన్మ నాకు ఎలా ఉంటుదో అనే చింత ప్రహ్లాదునికి కలుగుతుండేది.
దానితో తన మంత్రి పురోహిత వర్గాన్ని చేర్చి సమాలోచన చేశాడు. మనిషిగా పుట్టినవాడు తిరిగి ఏ జన్మలోను ఇరుక్కుకోక్కుండా శాశ్వతమైన హరి పాదాలను ఎలా చేరుకోవచ్చో చెప్పమని వారిని అడిగాడు.
వారు వారికి తెలిసినవి అన్నీ చెప్పారు. అయినా లోకసంచారం చేద్దాం. అపుడు ఏ మహానుభావుడైనా ఇంకా శ్రీహరిని సేవించే మార్గాలు చెబుతుండవచ్చు. లేకపోయినా మహానుభావులను దర్శనం చేసుకొన్నట్లయితే పూర్వజన్మ కర్మ నాశనం అవుతుంది కదా అని వారితోప్రహ్లాదుడు చెప్పాడు. దానికి వారు సరేనన్నారు. మంత్రులతోను, బ్రాహ్మణులతోను కలసి ప్రహ్లాదుడు దేశాటనం కోసం బయలుదేరాడు.
వారికి ఒక ప్రదేశంలో అజగర మహాముని కనిపించారు. అక్కడ ప్రహ్లాదుడు ఆగాడు. ఆయన పరివారమూ ఆగింది. నిర్విచారంగా జీవిస్తున్న ఆ మహాముని దగ్గరకు వెళ్లి ప్రహ్లాదుడు సాష్టాంగ నమస్కారం చేశాడు. చిరునవ్వుతో ఆ ముని ప్రహ్లాదుడ్ని ఆశీర్వదించాడు. ‘అజగర మునివర్యా! మిమ్ములను చూస్తే నాకు ఎన్నో సందేహాలు వస్తున్నాయి. మీరు ఇలా ఎలా జీవించగలుగుతున్నారు? శాశ్వతమైన ఆ శ్రీహరిపాద పద్మాలను చేరుకోవడానికి సులువైన మార్గం ఏదైనా నాకు బోధించండి. మిమ్ములను చూస్తుంటే ఈ ప్రపంచంలో ఉన్నా కూడా మీరు ఆ హరి పాదాల చెంత ఉన్నట్లుగానే ఆనందంగా ఉన్నట్టు నాకు కనిపిస్తున్నారు’’ అన్నాడు.
దానికి మహాముని సంతసించి ‘నాయనా నీకు నా జీవిత ప్రస్థానాన్ని చెబుతాను. దానినుండి నీవేమైనా తెలుసుకొనగలవేమో చూడుము’’ అంటూ తన జీవితాన్ని ఎలా గడుపుతున్నాడో ఇలా చెప్పడం ఆరంభించాడు.
నేను ఎన్నో జన్మలెత్తినాను. ఏ జన్మలోనైనా విషయసుఖాల వెంట పరుగులు తీశాను. ఎన్నో అధర్మాలు చేశాను. ధర్మాలు కూడా చేశాను. కానీ నశ్వరమైన పదవులకోసమో, ధనపేక్షకోసమో ఆగకుండా పరుగులు తీశాను. కాని నేను ఎంత కష్టపడి ఎందరినో నమ్మించి మోసం చేసి సంపాదించినా చివరకు ఉత్తి చేతులతోను మరొక జన్మకు వెళ్లాను. నేను సంపాదించినదంతా పరుల పాలైంది. లుబ్ధుడిగా ఉంటూ కొన్ని జన్మల్లో తినకుండా , దానధర్మాలు చేయకుండా కూడా కూడబెట్టాను. కాని అది కూడా నేను మరుజన్మకు తీసుకొని వెళ్లలేకపోయాను. కాని వద్దనా నాతోకూడా మరుజన్మకు సంపదలాగా వచ్చిందిమాత్రం కర్మఫలమే.
అందుకే నేను నాతో పాటు వచ్చే కర్మఫలాన్ని మాత్రం కూడబెట్టాలనుకొన్నాను. దానివల్ల కూడా లాభమేమీ లేదు. కర్మఫలం అదిమంచిదైనా, చెడుదైనా జన్మలు వస్తూనే ఉంటాయి. ఎపుడైతే కర్మ ఫలం ఉండదో అపుడు మాత్రమే ఆ పరంధాముని సన్నిధిలోకి వెళ్లగలుగుతాము. అది తెలుసుకొన్న నేను ఈ అజగరంలా నేలపై పడి ఉన్నాను. దొరికింది తింటాను. తాగుతాను. దీనికోసం నేను శ్రమించను. దొరకని నాడు బాధపడను. దొరికిన నాడు సంతోషపడనుకూడా అంతా దైవేచ్ఛ ప్రకారం జరుగుతుందని స్థిర నిశ్చయం చేసుకొన్నాను. అంతేకాదు శోకం, భయం, మోహం, క్రోధం, రాగం, శ్రమ ఇందులో దేనిని ఆశ్రయించినా చివరకు దుఃఖమే కలుగుతుంది.
- ఇంకాఉంది

- డా. రాయసం లక్ష్మి. 9703344804