డైలీ సీరియల్

కల్మషనాశిని.. భగవన్నామం ( అజామీళుడు -5)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మరి ఇక ఈ అజామీళుని విషయంలో మీరు చేసిన పొరపాటు తెలిసిందికదా. ఇక వీనిని వదిలివేస్తే మేము మా పని చేసుకొంటాము’అన్నారు.
తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా కాల్చినట్లుగానే హరినామం తెలిసి కానీ తెలియక కానీ పలికితే ఆ పుణ్యం ఊరకనే పోదుకదా.
అంత్యకాలం సమీపించిన ధైర్యం సన్నగిల్లినపుడు పూర్వజన్మ పుణ్యవిశేషం ఉంటేకాని ఏ జీవి పరాత్పరుని నామం తలుచుకోలేడు. పురాకృత సుకృతం వల్లనే ఇతడు నారాయణ నామోపాయసం సేవించాడు. అసలు మనుష్యులుగా పుట్టినవాళ్లు వారి పిల్లలకు హరి నామాలను వారి అంత్యసమయంలోను పిలవడానికి వీలుగా ఉంటుందనే కదా పెట్టుకుంటుంటారు. మరి ఇక ఈ అజామీళుని విషయంలో మీరు చేసిన పొరపాటు తెలిసిందికదా. ఇక వీనిని వదిలివేస్తే మేము మా పని చేసుకొంటాము’అన్నారు.
విష్ణుదూతలు చెప్పినదంతా విన్న యమకింకరులు వారికి నమస్కరించి పొరపాటున మేమీ తప్పు చేశాము. మమ్ము క్షమించండి. ఇకపై జాగ్రత్తగా విష్ణు సంకీర్తనం వెలువడే చోట మేము నిలువబోము అని చెప్పి వారు వెళ్లిపోయారు. దీనినంతా వింటున్న అజామీళుడు తాను చేసిన తప్పిదాలను పరంపరగా గుర్తుకు తెచ్చుకుంటూ అయ్యో భక్త సులభుడైన ఆ పరమపావనుడైన భగవంతుని ఇన్నాళ్లు మరిచాను. ఎంతటి అవివేకిని నేను నీటిబుడగ వంటి ఈజీవితాన్ని వృథా చేసుకున్నానే అని పరితపిస్తూ అజామీళునిలో ఆత్మజ్ఞానం ఉదయించింది. దానితో అతడు బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు. ఇప్పటి వరకు ఉన్న బంధాలన్నింటినీ వదిలివేశాడు. యోగమార్గాన్ని ఆశ్రయించాడు. నిస్సంకోశంగా నిర్మలత్వంతో భగవంతుని పాదపద్మాలను పట్టుకొన్నాడు. యోగమార్గం ద్వారా శరీరాన్ని పరిత్యజించాడు. దివ్య దేహం ధరించి విష్ణు కింకరులముందు నిలిచాడు. ఇపుడు వారిని చూస్తే అమితానందం వేసింది. ఇంతకుముందు నన్ను వీరే రక్షించారు కదా అనుకొన్నాడు. వీరి వల్లనే మహాపాపం నుంచి బయటపడ్డాను. ఇక ఆ పరంధాముని సన్నిధికి వీరే నన్ను చేర్చుతారు అనుకొన్నాడు. అజామీళుని భావాన్ని గ్రహించిన విష్ణుదూతలు రత్నాలు చెక్కిన బంగారు విమానంలో అజామీళుని సాదరంగా ఆహ్వానించి కూర్చోబెట్టుకుని వైకుంఠానికి తీసుకొని వెళ్లారు. సర్వ ధర్మాలను ఉల్లఘించినా, దాసి పుత్రిని పెండ్లాడినా, దుష్కర్మల చేత భ్రష్టుడైనా అతడు క్షణమాత్రంలోనే సంసారాన్ని మోహమని తెలుసుకొన్నాడు. వెనువెంటనే శాశ్వతమైన వైకుంఠధామానికి చేరుకున్నాడు. ఈలోకంలో కనిపించేవన్నీ ఏదో ఒకనాడు నశించిపోయేవే. కనుకనే ప్రతివారు ప్రయత్న పూర్వకంగా భగవంతుని నామాన్ని పలుకుతుండాలి. సాటి ప్రాణులను నారాయణ స్వరూపంగా చూస్తుండాలి. సమబుద్ధి ఏర్పరుచుకోవాలి. దయ క్షమ దానం అనేవాటిని నిత్యజీవితంలో ఏనాడు మరవకూడదు.
- ఇంకాఉంది

- డా. రాయసం లక్ష్మి